మీ ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?

Written By:

మీ స్మార్ట్‌ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?, సమస్య ఫోన్ ఛార్జర్‌లోనా లేక ఫోన్ బ్యాటరీలోనా అని తికమక పడుతున్నారా..? అయితే, మీ ఫోన్‌ను సర్వీసింగ్ సెంటర్‌కు తరలించే ముందు ఈ 10 విషయాలను తెలుసుకోండి. మీ సమస్యకు సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది...

Read More : ఏప్రిల్‌లో మీరు కొనేందుకు 20 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?

సమస్య ఫోన్ యూఎస్బీ పోర్ట్‌లో ఉన్నట్లయితే..?

ముందుగా ఫోన్‌ను స్విచాఫ్ చేయండి. ఆ తరువాత బ్యాటరీని తొలగించండి. డివైస్ పూర్తిగా ఆఫ్ అయిన తరువాత చిన్న పిన్ లేదా టూత్ పిక్ సహాయంతో పోర్ట్ లోపలి మెటాలిక్ సర్ఫేస్ పై మీటండి. ఇలా చేయటం less contact సమస్య ఏదైనా ఉంటే తొలగిపోతుంది.

 

మీ ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?

ఫోన్ యూఎస్బీ పోర్ట్‌లో దుమ్ము అధిక మోతాలు పేరుకున్నట్లయితే ఛార్జింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్ యూఎస్బీ ఛార్జర్ పోర్ట్‌ను క్లీన్‌చేసి చూడండి. యూఎస్బీ పోర్ట్‌‌ను క్లీన్ చేసే ముందు ఫోన్‌ను స్విచాఫ్ చేయండి. డివైస్ పూర్తిగా ఆఫ్ అయిన తరువాత క్లీనింగ్ ప్రక్రియను ప్రారంభించండి.

 

మీ ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?

ఛార్జింగ్ కేబుల్‌ను మార్చి చూడండి. ప్రయోజనం ఉండొచ్పు.

మీ ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?

ఛార్జర్ అడాప్టర్‌ను చెక్ చేసి చూడండి.

మీ ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?

ఫోన్ బ్యాటరీని మార్చి చూడండి. బ్యాటరీ పాతబడే కొద్ది పనితీరు మందగిస్తుంటుంది. కాబట్టి బ్యాటరీలో సమస్య ఉండి ఉండవచ్చు.

మీ ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?

వేగవంతమైన ఛార్జింగ్ కోరుకుంటున్నారా..? అయితే మీ ఫోన్ వేగంగా చార్జ్ అవ్వదు. వాల్ చార్జర్‌ను ఉపయోగించటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వేగవంతంగా చార్జ్ అవుతంది.

మీ ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్బీ హబ్ ద్వారా ఛార్జ్ చేస్తున్నారా..?, ఈ ప్రక్రియ మీ ఫోన్ ఛార్జింగ్ ప్రాసెస్ ను 50శాతం వరకు తగ్గించే ప్రయత్నం చేస్తుంది.

మీ ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లను టర్నాఫ్ చేయటం మంచిది. తద్వారా ఫోన్ వేగవంతంగా చార్జ్ అవుతుంది.

మీ ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?

యూఎస్బీ 3.0 పోర్ట్, స్టాండర్డ్ ఏసీ వాల్ చార్జర్‌లతో పోలిస్తే శక్తిని మరింత వేగవంతంగా సప్లై చేస్తంది. యూఎస్బీ 3.0 పోర్ట్ గరిష్ట వేగం 900ఎమ్ఏ. కాబట్టి, యూఎస్బీ 3.0 పోర్ట్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ‌ని వేగవంతంగా చార్జ్ చేసుకోవచ్చు.

మీ ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?

ఫోన్‌లను చార్జ్ చేసేందుకు కంపెనీ చార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి. ఫోన్‌తో పాటుగా వచ్చే కంపెనీ చార్జర్‌లు మన్నికైన పనితీరును కనబరుస్తాయి. నకిలీ చార్జర్లు చార్జింగ్ వేగాన్ని బాగా తగ్గించేస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Is your smartphone not charging properly? Here are the solutions. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot