Jio అంతర్జాతీయ రోమింగ్(IR) సేవలను యాక్టీవేట్ చేయడం ఎలా?
భారతదేశం యొక్క అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో తన యొక్క అన్ని రకాల వినియోగదారుల వివిధ అవసరాలను తీర్చడానికి అనేక రకాల సర్వీసులను అందిస్తుంది. వీరిలో తరచూ విదేశాలకు వెళుతున్న వారికి సహాయపడే సర్వీసులలో ఒకటి అంతర్జాతీయ రోమింగ్ సర్వీస్. రిలయన్స్ జియో తన యూజర్లకు అంతర్జాతీయ రోమింగ్ సర్వీసును కూడా అందిస్తుంది.

ఈ సర్వీస్ యూజర్లు విదేశాలకు వెళ్ళేటప్పుడు వారి జియో సిమ్‌ను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఈ అంతర్జాతీయ సర్వీస్ సహాయంతో జియో వినియోగదారులు టెల్కో యొక్క ప్రయోజనాలు మరియు సేవలను దాదాపు 170 దేశాలలో ఆనందించవచ్చు. అయితే జియో నంబర్‌లో అంతర్జాతీయ రోమింగ్ ను ఎలా యాక్టీవేట్ చేసుకోవాలో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో వెబ్‌సైట్ ద్వారా అంతర్జాతీయ రోమింగ్ సేవను యాక్టీవేట్ చేసుకునే విధానం
** Jio వెబ్‌సైట్ ద్వారా అంతర్జాతీయ రోమింగ్ సర్వీసును యాక్టీవేట్ చేయడానికి మొదట సైన్ ఇన్ పై క్లిక్ చేయండి.
** తరువాత OTPని పొందడం కోసం మీ Jio మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. మీరు OTP ను అందుకున్న తర్వాత సైన్ ఇన్ చేయండి.
** తరువాత స్క్రీన్ కుడివైపు మూలలో గల సెట్టింగుల ఎంపికపై క్లిక్ చేయండి. ఇందులో మానేజ్ సర్వీసును ఎంచుకోండి.
** అంతర్జాతీయ రోమింగ్ (IR) ను ప్రారంభించడానికి బటన్‌ను కుడి వైపుకు జారచవలసి ఉంటుంది. తర్వాత మీరు మీ అకౌంట్ యొక్క క్రెడిట్ పరిమితిని పెంచవచ్చు. మీ ప్రీపెయిడ్ అకౌంటులో మీకు తగినంత క్రెడిట్ ఉంటే కనుక కొనసాగింపు ఎంపికపై క్లిక్ చేయండి.
** Jio ఒక ఫ్లాష్ మెసేజ్ ను మీతో పంచుకుంటుంది. ఇది IR కోసం మీ అభ్యర్థన విజయవంతంగా సమర్పించబడిందని పేర్కొంటుంది. IR యాక్టీవేట్ అయిన తర్వాత Jio నోటిఫికేషన్ మెసేజ్ పంపుతుంది.

మైజియో యాప్ ద్వారా అంతర్జాతీయ రోమింగ్ సేవను యాక్టీవేట్ చేసుకునే విధానం
జియో వినియోగదారులు మైజియో యాప్ ద్వారా కూడా అంతర్జాతీయ రోమింగ్ సేవను యాక్టీవేట్ చేయవచ్చు. ఇందుకోసం మొదట జియో యాప్ ను ఓపెన్ చేసి MyJio హోమ్ స్క్రీన్‌లో ‘ISD / Intl roaming' ని యాక్టీవేట్ చేయడం కోసం 'యాక్టీవేట్' బటన్ పై నొక్కండి. IRని విజయవంతంగా సమర్పించిన తర్వాత Jio నోటిఫికేషన్ మెసేజ్ ను పంపుతుంది. మీరు ప్యాక్ కొనడానికి క్రెడిట్ పరిమితిని కూడా పెంచవచ్చు. మీ ప్రాధాన్యతను ఎంచుకోండి మరియు క్రియాశీలతను ఖరారు చేయండి.


Click it and Unblock the Notifications








