JioFiber బ్రాడ్‌బ్యాండ్ సేవలు మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీ చేయడం ఎలా?

|

రిలయన్స్ జియో యొక్క బ్రాడ్‌బ్యాండ్ ఆర్మ్ జియోఫైబర్ ఈ సంవత్సరంలో కొత్త చందాదారులను చేర్చడానికి అనేక ప్లాన్ లను సిద్ధం చేస్తోంది. అన్ని రకాల వ్యక్తులు మరియు వ్యాపారాల అవసరాలను తీర్చడానికి జియోఫైబర్ పలురకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల అవసరాల కోసం 30Mbps నుండి 1Gbps వరకు అధిక-ఇంటర్నెట్ వేగంతో అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వినియోగదారులు తమ ప్రాంతాలలో జియో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కోసం చూస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. JioFiber బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నప్పటికీ వీటి సేవలను పొందని కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. మీ ప్రాంతంలో ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ల సేవలు అందుబాటులో ఉన్నాయో లేదో వంటి వివరాలను కనుగొనడం ఎలానో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
JioFiber Broadband Service Availability in Your Place Checking Process Step by Step

మీ ప్రాంతంలో జియోఫైబర్ ప్లాన్ లభ్యతను తనిఖీ చేసే పద్ధతులు

 

** మీ ప్రదేశంలో జియోఫైబర్ లభ్యతను తనిఖీ చేయడానికి రిలయన్స్ జియో యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. ఈ వెబ్‌సైట్‌లో స్టోర్, ప్లాన్‌లు మరియు బుక్ నౌ ఆప్షన్ వంటి అనేక ఎంపికలను మీరు గమనించవచ్చు. ఇందులో కుడి వైపు ఎగువ మూలలో ఉన్న బుక్ నౌ ఎంపికపై నొక్కండి. క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ పేజీకి మళ్ళించబడతారు.

** తరువాత మీ పేరు మరియు అధికారిక మొబైల్ నంబర్‌ను నమోదు చేసి OTP ను రూపొందించండి ఎంపికను నొక్కండి. కోడ్‌ను ధృవీకరించి ఫారమ్‌ను పూరించండి. ఇందులో మీ ఇమెయిల్ చిరునామాతో పాటు పూర్తి చిరునామాను పూరించమని అడుగుతారు. అన్ని వివరాలు పంచుకున్న తర్వాత మీ ప్రదేశంలో జియోఫైబర్ సేవలు అందుబాటులో ఉన్నాయో లేదో వెబ్‌సైట్ మీకు తెలియజేస్తుంది.

JioFiber Broadband Service Availability in Your Place Checking Process Step by Step

** ఒకవేళ మీ ప్రదేశంలో జియో సేవలు అందుబాటులో లేకపోతే కనుక మీ ప్రాంతంలో జియోఫైబర్ సేవలను అమలు చేసినప్పుడు కంపెనీ మీకు నోటిఫికేషన్ ఇస్తుంది.

జియోఫైబర్ ప్లాన్లు రూ.399 నుండి రూ.8,499 ధరల మధ్యలో అందుబాటులో ఉన్నాయి. ఈ ధరల మధ్యలో లభించే అన్ని ప్లాన్లు అపరిమిత హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటాను అనేక రకాల ప్రయోజనాలతో కలిపి అందిస్తాయి. వీటిలో అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్స్టార్ వంటి మరిన్ని టాప్ కంటెంట్ ప్రొవైడర్ల ఓవర్-ది-టాప్ (OTT) చందాను కూడా ఈ ప్రణాళికలు అందిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి జియో ఫైబర్ 2 కోట్ల వినియోగదారుల మార్కును దాటుతుందని సంస్థ భావిస్తున్నది.

Best Mobiles in India

English summary
JioFiber Broadband Service Availability in Your Place Checking Process Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X