జియోఫైబర్ సర్వీస్ 12నెలలు ఉచితంగా పొందవచ్చు!! ఎలాగో తెలుసా??

|

రియోలెన్స్ జియో టెలికాం సంస్థ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో జియోఫైబర్ గా ప్రవేశించి తక్కువ కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఆన్‌బోర్డ్‌లో ఎక్కువ మంది కస్టమర్లను పొందడం కోసం రిలయన్స్ జియో కొత్త కస్టమర్లకు ఒక నెలపాటు జియోఫైబర్ సేవలను ఉచితంగా అందిస్తోంది. ఇదే కాకుండా అదనంగా ఈ టెలికాం దిగ్గజం వినియోగదారులకు వారు కోరుకున్నంత కాలం జియోఫైబర్ కనెక్షన్‌ను ఉచితంగా పొందటానికి కొన్ని మార్గాలను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఏమిటి మరియు ఎలా పనిచేస్తుందో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

30 రోజుల ఉచిత ట్రయల్

30 రోజుల ఉచిత ట్రయల్

మీరు కొత్తగా జియోఫైబర్ ను కొనుగోలు చేసినట్లు అయితే కనుక జియో అధికారికంగా 30 రోజులపాటు ట్రయల్ వ్యవధిని ఉచితంగా అందిస్తుంది. దీని అర్థం జియోఫైబర్ యొక్క క్రొత్త కస్టమర్లందరూ మొదటి నెల తమ యొక్క అన్ని సేవలను ఉచితంగా పొందుతారు. మీకు డేటా కావాలంటే కనుక తిరిగి చెల్లించదగిన రూ.1500 మీ వద్ద నుండి జియో వసూలు చేస్తుంది. దీని కింద మీకు 150Mbps వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు. దీనితో పాటుగా అపరిమిత వాయిస్ కాల్స్ మరియు WiFi ONT మోడెమ్ కూడా పొందవచ్చు.

అంతరిక్షంలోకి ఉచితంగా వెళ్లే అవకాశం!! ఇందుకోసం ఇలా చేయండి..అంతరిక్షంలోకి ఉచితంగా వెళ్లే అవకాశం!! ఇందుకోసం ఇలా చేయండి..

బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌
 

మీరు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో పాటు పలు OTT ప్లాట్‌ఫామ్‌లకు సబ్స్క్రిప్షన్ ను కావాలనుకుంటే కనుక జియో సంస్థ మీ వద్ద నుండి రూ.2500 తిరిగి చెల్లించదగిన డిపాజిట్‌ను వసూలు చేస్తుంది. క్రొత్త కస్టమర్లకు ఇది కూడా ఒక నెలపాటు ఉచిత ట్రయల్స్ ను అందిస్తుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులకు 150 ఎమ్‌బిపిఎస్ వేగంతో అపరిమిత డేటాను, అపరిమిత వాయిస్ కాల్స్, 4K సెట్-టాప్ బాక్స్, వైఫై ఒఎన్‌టి మోడెమ్ వంటివి అందిస్తుంది. వీటితో పాటుగా డిస్నీ + హాట్‌స్టార్, సోనీ LIV, Zee5 వంటి 13 OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ ను అందిస్తుంది.

ఉచిత ట్రయల్

150Mbps స్పీడ్ 30 రోజుల ఉచిత ట్రయల్ వ్యవధిలో మాత్రమే అందించబడుతుందని గమనించాలి. ఈ పోస్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకారం స్పీడ్ మరియు ప్రయోజనాలు అందించబడతాయి. మీరు చందా కోసం చెల్లించకూడదనుకుంటే కనుక మీకు కావలసినంత కాలం ఉచిత ఆఫర్‌ను కొనసాగించడానికి ఒక మార్గం ఉంది.

JioFiber సర్వీస్ ఒక సంవత్సరంగా ఉచితంగా పొందే విధానం

JioFiber సర్వీస్ ఒక సంవత్సరంగా ఉచితంగా పొందే విధానం

** ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా రిఫరెన్స్ ఇచ్చిన వినియోగదారులకు జియో ఒక నెలపాటు అదనపు జియోఫైబర్ సర్వీసును ఉచితంగా ఇస్తోంది. సరళంగా చెప్పాలంటే మీ రిఫరెన్స్ ద్వారా మీ స్నేహితుడు కొత్త జియోఫైబర్ కనెక్షన్ తీసుకుంటే మీకు మరియు మీ స్నేహితుడికి ఒక నెల పాటు సర్వీసులు ఉచితంగా లభిస్తుంది.

** ఈ ప్రమోషనల్ ఆఫర్ ను మీకు కావలసినన్ని సార్లు వర్తిస్తుంది. ఉదాహరణకు మీ రిఫరెన్స్ ద్వారా 12 మంది కొత్తగా జియోఫైబర్ కనెక్షన్‌కు సబ్స్క్రిప్షన్ ను పొందినట్లయితే మీకు 12 నెలలు కనుక లేదా ఒక సంవత్సరం పాటు జియోఫైబర్ సర్వీస్ ఉచితంగా లభిస్తుంది.

** రిలయన్స్ జియో భారతదేశంలో రూ.999, రూ.699, రూ.399, రూ 1499, రూ.3999 మరియు రూ.849 వంటి పలు ధరల వద్ద జియోఫైబర్ ప్లాన్‌లను అందిస్తుంది. మరిన్ని వివరాలను పొందడానికి మీరు రిలయన్స్ జియో అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్ళవచ్చు.

 

Best Mobiles in India

English summary
JioFiber Service is Available Free For 12 Months!! Just Follow These Steps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X