కీబోర్డులో ఈ సీక్రెట్ కీ వర్డ్స్ ఎప్పుడైనా టచ్ చేశారా..?

|

ఈ రోజుల్లో ప్రతి పనికి కంప్యూటర్ అనేది సర్వ సాధారణమైపోయింది. అయితే చాలామంది కంప్యూటర్ మీద గంటల తరబడి పని చేస్తుంటారు. వారు చేసే పనిలో కొన్ని రకాల షార్ట్ కట కీస్ ఉన్నప్పటికీ వారు అవి పట్టించుకోకుండానే తమ పనులు చేస్తుంటారు. దీని వల్ల పనులు ఒక్కోసారి చాలా ఆలస్యం అవుతుంటాయి. మౌస్ లేనిదే ఒక్కోసారి అసలు పనే జరగదు. మౌస్ మొరాయించిందంటే ఇక అంతే సంగతులు. మరి మౌస్ పనిచేయనప్పుడు మనం కంప్యూటర్లో వేగంగా పనిచేయలేమా అంటే దీనికి సమాధానం ఉంది. కొన్ని రకాల షార్ట్ కట్ కీస్ ద్వారా మనం వేగంగా పనిచేయవచ్చు. మౌస్ లేకుండానే మనం కీబోర్డ్ మీద చకచకా పనులు చేసుకోవచ్చు. మరి అదెలాగో మీరే చూడండి.

 

ఈ షార్ట్ కట్స్‌తో ఫేస్‌బుక్‌ని ఆడుకోవచ్చు, సింపుల్ ట్రిక్స్ఈ షార్ట్ కట్స్‌తో ఫేస్‌బుక్‌ని ఆడుకోవచ్చు, సింపుల్ ట్రిక్స్

F5

F5

మీరు పేజిని రీలోడ్ చేయాలంటే బ్రౌజర్ దగ్గరకెళ్లి అక్కడ మౌస్ రైట్ క్లిక్ చేసి దాన్ని రీలోడ్ చేయడమో లేక బ్రౌజర్ దగ్గర క్లిక్ చేసి ఎంటర్ కొట్టడమో చేస్తుంటారు. అలా కాకుండా మీరు F5ని ప్రెస్ చేస్తే నేరుగా మీ పేజీ రీలోడ్ అవుతుంది.

End , Home

End , Home

అలాగే మీరు మీ వెబ్ పేజీలో ఒక్కో సారి ఎక్కడ ఉన్నామో తెలియకపోవచ్చు. మధ్యలో ఉన్నామో లేక చివరలో ఉన్నామో తెలియక తికమకపడుతుంటాం. అలా కాకుండా End బటన్ నొక్కితే మీరు వెంటనే పేజీ చివరకు వెళ్లిపోవచ్చు. Home బటన్ నొక్కితే మీరు పేజీ మొదటికి రావచ్చు.

Ctrl ప్లస్ Ctrl మైనస్
 

Ctrl ప్లస్ Ctrl మైనస్

మీరు మీ వెబ్ పేజిలో ఉన్న సమాచారం ఒక్కో సారి చాలా చిన్నదిగా కనిపిస్తుంటుంది. దాన్ని జూమ్ చేసి చూడాలనుకున్నా ఎలా చూడాలో తెలియదు. అలాంటి వారికి షార్ట్ కట్ కీ ఉంది. Ctrl నొక్కిపెట్టి ఆ తర్వాత + బటన్ నొక్కడం ద్వారా మీరు జూమ్ చేసి చూడవచ్చు. అలాగే దాన్ని మళ్లీ యధాస్ఠితికి తీసుకురావాలంటే Ctrl+- నొక్కడం ద్వారా చేరుకోవచ్చు.

Ctrl+o

Ctrl+o

మీరు మీ వెబ్ పేజీలో ఏధైనా సమాచారం చూడాలనుకుంటే దాని కోసం Ctrl+o నొక్కితే సరిపోతుంది. ఈ బటన్లు ప్రెస్ చేయడం ద్వారా మీరు ఉన్నది ఉన్నట్లు చూడగలుగుతారు.

 Ctrl+f

Ctrl+f

వెబ్ పేజిలో మనకు కావలసిన పదాలను వెతకడానికి ఒక్కోసారి చాలా సమయం తీసుకుంటుంది. అలాంటి వారు సమయాన్ని ఆదా చేసుకోవాలంటే Ctrl+f నొక్కి పనులు చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు నేరుగా వెతికే ఆప్సన్ లోకి వెళతారు.

Ctrl+w

Ctrl+w

ఇక మీరు ఏదైనా పేజీని మూసేయాలనుకుంటే మౌస్ తో అక్కడ మూల కనిపించే పేజీ దగ్గర ఉన్న క్లోజ్ బటన్ దగ్గరకు వెళతారు. అలా కాకుండా ఒక్క క్షణంలో మీరు మీ పేజీని క్లోజ్ చేయాలనుకుంటే Ctrl+w నొక్కితే సరిపోతుంది. అలాగే మీరు వెంటనే ఏదైనా కొత్త పేజీని తెరవాలనుకుంటే Ctrl+tని నొక్కితే సరిపోతుంది.

 Ctrl+h

Ctrl+h

కొత్త విండోని ఓపెన్ చేయాలనుకోండి అప్పుడు మీరు Ctrl+n నొక్కితే మీరు కొత్త విండోలకి వెళతారు. అలాగే మీరు ఏం సెర్చే చేశారు అనే దాన్ని చూడాలనుకోండి Ctrl+hని నొక్కితే మీరు సెర్చ్ చేసిన మొత్తం హిస్టరీ మీ కళ్లముందు ప్రత్యక్షమవుతుంది.

Ctrl+Shift+y

Ctrl+Shift+y

మీరు ఏదైనా డౌన్లోడ్ చేశారనుకోండి అప్పుడు మీరు నేరుగా డౌన్లోడ్ పేజీలోకి వెళ్లి చూడాలి కదా..అయితే అలాంటి సమయంలో టైం ఆదా చేసుకోవాలంటే మీరు Ctrl+Shift+y ప్రెస్ చేశారనుకోండి. వెంటనే మీకు డౌన్లోడ్స్ విండో ఓపెన్ అవుతుంది.

 Ctrl+Shift+t

Ctrl+Shift+t

మీరు పొరపాటును ఏదైనా టాబ్ ని క్లోజ్ చేశారు.దాన్ని మళ్లీ వెంటనే ఓపెన్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇలాంటి సమయంలో మీరు Ctrl+Shift+t ని ప్రెస్ చేస్తే మీరు క్లోజ్ చేసిన పేజీ వెంటనే ఓపెన్ అవుతుంది. అలాగే మూసివేయబడిన విండో ని తిరిగి తెరవడానికి Ctrl+Shift+nని ప్రెస్ చేయండి.

 Ctrl+Shift+p

Ctrl+Shift+p

మీరు కొత్త విండో కాకుండా ప్రవేట్ విండో తెరవాలనుకుంటే Ctrl+Shift+pని ప్రెస్ చేస్తే చాలు. కొత్త ప్రైవేట్ విండోలోకి వెళ్లిపోతారు. అలాగే వెబ్ పేజి యొక్క సోర్స్ ని చూడడానికి Ctrl+uని ప్రెస్ చేయండి. ఇంకా వెబ్ పేజిని బుక్ మార్క్ చేయడానికి Ctrl+dని ప్రెస్ చేయండి.

Ctrl+F2

Ctrl+F2

బుక్ మార్క్ మేనేజర్ ని తెరవడానికి Ctrl+Shift+b, డెవలపర్ టూల్ బార్ ని తెరవడానికి Ctrl+F2,వెబ్ పేజిలో ఎక్కడ ఉన్న అడ్రస్ బార్ కి చేరుకోవడానికి F6, హిస్టరీని తొలగించి పేజిని రిలోడ్ చేయడానికి Ctrl+F5, యాడ్ ఆన్ బార్ ని తెరవడానికి Ctrl+/ బటన్లను ప్రెస్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Keyboard Shortcuts to Speed up Your Workflow in Any Browser More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X