కీబోర్డ్ మీద ఫాస్ట్‌గా టైప్ చేయాలనుకుంటున్నారా..?

Written By:

మీరు కీ బోర్డ్ మీద ఫాస్ట్ గా టైప్ చేయాలనుకుంటున్నారా...మీరు ఎంత ట్రై చేసినా కీ బోర్డ్ మీద చేతులు ఫాస్ట్ గా వెళ్లడం లేదా...మీ బాస్ ఫాస్ట్ గా టైప్ చేయమని ఫైల్స్ ఇస్తే మీరు చేయలేకపోతున్నారా.. అయితే మీకోసం కొన్ని 6 చిట్కాలు ఇస్తున్నాం. వాటితో మీరు మీ టైపింగ్ స్పీడ్ వేగంగా పెంచుకునే అవకాశం ఉంది. మరి అవి ఎంతవరకు పనిచేస్తాయో ఓ సారి చెక్ చూసి చూడండి.

Read more: టెక్నాలజీ మహిమ: జేబులో పట్టే వాషింగ్ మిషన్‌..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వర్క్ ప్లేస్

మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కాని మీరు ముందు కంపర్ట్‌బుల్ గా ఉండేలా మీ ప్లేస్‌ను సెట్ చేసుకోవాలి. మీరు కంపర్ట్‌బుల్ గా లేకుంటే పనిచేయడం చాలా కష్టం.

కూర్చునే విధానం

మీరు చక్కగా కూర్చోవాలి. అటు ఇటు ఒరగడం కాని లేకుంటే ఓ పక్కనుంచి టైప్ చేయడం కాని చేయకూడదు. మీ చేతి వేళ్లు కీ బోర్డ్ మీదనే ఉండాలి. మీరు ఎత్తును కూదా సరిచూసుకోవాల్సి ఉంటుంది.

చేతుల పొజిషన్

ఇది చాలా ముఖ్యం. పై రెండు చేసిన తరువాత మీరు ఇది చేయాలి. ముందుగా ఎఫ్ దగ్గర మీ ఎడమ చేయి రెండో వేలును ఉంచి అలా వరుసగా ఏ దాకా మిగతా వేళ్లను ఉంచండి. అలాగే కుడి పక్కన కూడా కుడి చేతి వేళ్లు జె దగ్గర నుంచి ఎల్ దాకా పెట్టంది. చివరన ; and : వీటిదగ్గర కుడిచేతి చిటికెన వేలు ఉంటుంది. స్పేస్ బార్ మీదకు రెండు చేతుల బొటన వేళ్లు ఉంచండి.

ముందుగా ప్రాక్టీస్

ఇక చిన్నగా స్టార్ట్ చేయండి. అలానే కీ బోర్డ్ లో పైకి కిందకి ఉన్న లెటర్స్ మీదకు అవే వేళ్లు పోనివ్వండి. ఉదాహరణకు ఎఫ్ మీద ఉన్న వేలు ఆర్ మీదకు డి మీద ఉన్న వేలు ఈ మీదకు ఇలా కిందకు కూడా ప్రయత్నించండి.

చూడకుండా టైప్

ఇది చాలా కష్టమైన పని. అయితే చేస్తూ పోతుంటే ఏదైనా సాధ్యమే. మీరు కూడా నిదానంగా ప్రయత్నించి చూడండి. మీకు సాధ్యమవుతుంది.

వచ్చే వరకు ప్రయత్నం

అక్కడ మీరు ఎంత నేర్చుకుంటే అంత వస్తుంది. అంతేకాని షార్ట్ కట్స్ ఏమి ఉండవు..సో గట్టిగా ట్రై చేయడమే

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Keyboard skills: How to type faster
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot