హార్డ్ డిస్క్ కొంటున్నారా, అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

|

హార్డ్ డ్రైవ్ కొనేముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. హార్డ్‌డ్రైవ్ అనేది మీ పీసీ లేదా లాప్‌టాప్ లో అత్యంత కీలకమైనది. ఒక్కోసారి పనితీరు మారే కొద్ది మీ పాత హార్డ్ డ్రైవ్ సరిపోదు, అప్పుడు మీ అవసరానికి తగినట్లు ఎక్కువ సామర్థ్యం కలిగిన హార్డ్ డ్రైవ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందు కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా హార్డ్ డ్రైవ్‌లు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. అలాంటప్పుడు ఎలాంటి హార్డ్ డ్రైవ్ ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హార్డ్ డ్రైవ్ కొనే ముందు తెలుసుకోవాల్సిన సంగతులు

 

లేటెస్ట్ టెక్నాలజీతో TCL iFFALCON Smart TVలు,ధరలు ఇవే !లేటెస్ట్ టెక్నాలజీతో TCL iFFALCON Smart TVలు,ధరలు ఇవే !

హార్డ్ డిస్క్ కొంటున్నారా, అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

ఈ క్రింద పేర్కొన్న అంశాల ఆధారంగా కొత్త హార్డ్ డ్రైవ్ లను ఎంపిక చేసుకోవాలి.
1. హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు, సాలిడ్ స్టేట్ డివైజ్ లతో పోల్చితే వేరైనవి. రెండూ కూడా ఒకే తరహాలో పనిచేస్తుప్పటికీ, కానీ రెండూ వేర్వేరు లక్షణాలు కలిగి ఉన్నవి. సాలిడ్ స్టేట్ డివైజ్ లు వేగంగా పనిచేస్తాయి. అలాగే తక్కువ పవర్ వినియోగించుకుంటాయి. అయితే ఇవి చాలా ఖర్చుతో కూడినవి, ఖరీదైనవి, మీకు అనుకూలమైన బడ్జెట్ లో హార్డ్ డ్రైవ్ తీసుకోవాలంటే మాత్రం హార్డ్ డిస్క్ డ్రైవ్ లు ఉత్తమమైనవి.

2. హార్డ్ డ్రైవ్ సైజు విషయానికి వస్తే ఇవి రెండు వివిధ పరిమాణాల్లో లభిస్తాయి. 3.5 అంగుళాల హార్డ్ డ్రైవ్ అలాగే 2.5 అంగుళాల హార్డ్ డ్రైవ్ అందుబాటులో ఉన్నాయి. 3.5 అంగుళాల హార్డ్ డ్రైవ్ ను పీసీ కంప్యూటర్ లలో వాడుతారు అలాగే 2.5 అంగుళాల హార్డ్ డ్రైవ్ ను లాప్ టాప్ లలో వాడుతారు. ఇక వీటి మెమరీ సామర్థ్యం విషయానికి వస్తే 4 టీబీల నుంచి 12 టీబీల వరకూ హార్డ్ డిస్క్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

హార్డ్ డిస్క్ కొంటున్నారా, అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

3. హార్డ్ డిస్క్ లో ఎంపికలో చూడాల్సిన ప్రత్యేకతల విషయానికి వస్తే..ముందుగా స్టోరేజీ కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకోవాలి. అలాగే రెవల్యూషన్స్ పర్ మినట్(ఆర్‌పీఎం) ఎంత రేంజ్ తో పనిచేస్తుందో తెలుసుకోవాలి. తద్వారా డేటా ట్రాన్స్ ఫర్ చాలా వేగంగా జరిగే వీలుంది. అలాగే కాచె స్పేస్ ఉందో తెలుసుకోవాలి.ఫలితంగా ఫైల్ ట్రాన్స్ ఫర్ సక్రమంగా జరుగుతుంది.

Best Mobiles in India

English summary
Know these things before buying a Hard Drive More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X