Facebook & ఇన్‌స్టాగ్రామ్‌ను మాతృ భాషలోకి మార్చడం ఎలా?

|

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్ లను ఉపయోగిస్తున్న వారు తమ యొక్క మాతృ భాషలో కూడా వీటిని చూడవచ్చు. ఇందులో భాషను సెట్టింగులలో మార్చడం వంటి సరళమైన కొన్ని దశలను అనుసరించి భాషను మార్చవచ్చు. అనేక భాషల మీద పట్టు కోసం కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు ఫేస్‌బుక్ అకౌంటును సృష్టించినప్పుడు లాంగ్వేజ్ సెట్టింగులలో మీకు నచ్చిన భాషలను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మీ భాషా ప్రాంతానికి తేదీలు, సమయం మరియు సంఖ్యలతో కూడా సరిపోతుందని కంపెనీ తెలిపింది.

ఫేస్‌బుక్‌లో భారతీయ భాషల మద్దతు

ఫేస్‌బుక్‌లో భారతీయ భాషల మద్దతు

నోటిఫికేషన్లు, మోర్ టెక్స్ట్ మరియు టూల్టిప్స్ వంటి వాటిని వేరే భాష మరియు ఆకృతిలో చూడటానికి మీరు మీ భాష మరియు ప్రాంత సెట్టింగులను మార్చవచ్చు. ఫేస్‌బుక్ కేవలం ఇంగ్లీష్ కాకుండా చాలా భాషలకు మద్దతును ఇస్తుంది. ఈ ఇతర భాషలలో తెలుగు, హిందీ, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, అరబిక్, మాండరిన్ చైనీస్, పోర్చుగీస్ మరియు మరిన్ని భాషలు ఉన్నాయి. ఈ సోషల్ నెట్‌వర్క్ మొత్తంగా ఎనిమిది భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది.

Also Read:Oppo Smart TV త్వరలో లాంచ్ కానున్నాయి!!! అందుబాటు ధరలోనే...Also Read:Oppo Smart TV త్వరలో లాంచ్ కానున్నాయి!!! అందుబాటు ధరలోనే...

ఫేస్‌బుక్‌లో భాషను మార్చే విధానం?

ఫేస్‌బుక్‌లో భాషను మార్చే విధానం?

స్టెప్ 1: ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేసి కుడివైపు ఎగువ భాగంలో గల మూడు-వరుసల చుక్కల బటన్‌ను నొక్కండి.

స్టెప్ 2: తరువాత సెట్టింగ్‌ల ఎంపికను ఎంచుకొని అందులో ప్రైవసీ ఎంపికకు వెళ్లండి.

స్టెప్ 3: ఇందులో "భాష" ఎంపికను నొక్కండి మరియు మీకు నచ్చిన భాషను ఎంచుకోండి. మీ భాషా ప్రాధాన్యత ప్రకారం ఫేస్‌బుక్ ఆటోమ్యాటిక్ గా పేజీని రీలోడ్ చేస్తుంది కాబట్టి మీరు సేవ్ చేయనవసరం లేదు. దీనిని తిరిగి మార్చడానికి మరియు ఇతర ఎంపికలను తనిఖీ చేయడానికి మీరు అదే దశలను అనుసరించవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లో భాషను మార్చే పద్ధతులు

ఇన్‌స్టాగ్రామ్‌లో భాషను మార్చే పద్ధతులు

స్టెప్ 1: ఇన్‌స్టాగ్రామ్‌లో మీ యొక్క ప్రొఫైల్‌కు వెళ్లడానికి ఇన్‌స్టాగ్రామ్-యూజర్-ప్రొఫైల్ లేదా దిగువ కుడి వైపున ఉన్న మీ ప్రొఫైల్ ఫోటోను నొక్కండి.

స్టెప్ 2: కుడివైపు ఎగువ భాగంలో నొక్కండి ఆపై ఇన్‌స్టాగ్రామ్‌ - సెట్టింగ్‌ల ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 3: అకౌంట్> భాష ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 4: తరువాత మీరు ఉపయోగించాలనుకుంటున్న భాషను ఎంచుకోండి.

Best Mobiles in India

Read more about:
English summary
Language Change Process on Facebook or Instagram?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X