Home
How to

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ పిక్సెల్4 కెమెరా ఫీచర్లను పొందడం ఎలా?

ప్రస్తుతం వున్న స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల కెమెరాలు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉన్నాయి. ఇటీవల ప్రారంభించిన గూగుల్ పిక్సెల్ 4 యొక్క కెమెరా ఫీచర్లు మరింత అదనపు ప్రయోజనాలతో వస్తున్నాయి. కెమెరా విభాగంలో బాగా ఎక్కువగా హైలైట్ చేయబడిన విషయం మెరుగైన నైట్ మోడ్ మరియు ఆస్ట్రోఫోటోగ్రఫీ.

ఫోటోగ్రఫీ

గూగుల్ సంస్థ ఇప్పటికే ఈ ఫీచర్లను తన పాత తరం పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లకు విడుదల చేయడం ప్రారంభించింది. ఈ లక్షణాలు చాలావరకు ఫోన్ యొక్క హార్డ్‌వేర్ మీద ఆధారపడకుండా ఫోటోగ్రఫీ యొక్క గణను అద్భుతమైన రీతిలో మెరుగుపరుస్తాయి.

 

పిక్సెల్ 4

గూగుల్ సంస్థ ఇండియాలో ఇప్పటి వరకు తన కొత్త పిక్సెల్ 4 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయలేదు. మీరు గూగుల్ పిక్సెల్ 4 స్మార్ట్‌ఫోన్‌ యొక్క కెమెరా ఫీచర్‌ను ఉపయోగించాలని చూస్తున్నట్లయితే అందుబాటులో ఉన్న ఏకైక ఎంపిక గూగుల్ పిక్సెల్ 3 లేదా పిక్సెల్ 3 ఎక్స్ఎల్.

 

స్మార్ట్‌ఫోన్‌లలో

అలా కాకుండా మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో కూడా గూగుల్ పిక్సెల్ 4 యొక్క కెమెరా ఫీచర్లను ఉపయోగించవచ్చు. కొత్త పిక్సెల్ 4 ఫీచర్లతో పాటు మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా నుండి ఇమేజ్ క్వాలిటీని మెరుగుపరచాలని చూస్తున్నారా అందుకోసం మీకు మంచి అవకాసం గూగుల్ కల్పిస్తోంది.

 

 Android 9.0 పై

ఇందులో భాగంగా మొదటిది మరియు అతి ముఖ్యమైనది ఇది కెమెరా పోర్టుపై ఆధారపడి ఉంటుంది. ఇది అన్ని రకాల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయకపోవచ్చు. అలాగే ఉత్తమ ఫలితాల కోసం Android 9.0 పై లేదా తరువాత తరం OSతో నడుస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించడం చాలా ముఖ్యం అని గమనించవలసిన విషయం.

 

పద్ధతులు

గమనిక

పిక్సెల్ 4 యొక్క కెమెరా ఫీచర్లకు పోర్టు చేస్తున్నపుడు ఒక్కొక్కసారి మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌ పాడైపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కావున దీనిని పొందడానికి కింద ఉన్న పద్ధతులు పాటించండి. ఈ పద్ధతులు పాటించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

1. గూగుల్ కెమెరా పోర్ట్ apk యొక్క తాజా వెర్షన్ (వెర్షన్ 7.2 ) కోసం సెర్చ్ చేయండి.

2. APK యొక్క తాజా వెర్షన్ ను డౌన్‌లోడ్ చేసి దానిని ఇన్‌స్టాల్ చేయండి.

3. స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ను విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దానిని ఓపెన్ చేసి దానికి అవసరమైన అన్ని అనుమతులను అనుమతించండి.

4. తరువాత ఇన్‌స్టాల్ చేసిన యాప్ ను ఉపయోగించి ఫోటోలను తీయడం ప్రారంభించవచ్చు.

 

 

ఆస్ట్రోఫోటోగ్రఫీ

ఆస్ట్రోఫోటోగ్రఫీ ఫీచర్ ప్రారంభించడం ఎలా?

1. ఇన్‌స్టాల్ చేసిన గూగుల్ కెమెరా యాప్ ఓపెన్ చేసి అందులో గల సెట్టింగ్స్ లను ఓపెన్ చేయండి.

2. అందులో కిందకు స్క్రోల్ చేసి "అడ్వాన్స్' ఎంపికను ఎంచుకోండి.

3. తరువాత అందులో గల ఆస్ట్రోఫోటోగ్రఫీ ముందు గల టోగుల్ ఆన్ చేయండి.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Learn The Procedures to Have Pixel 4 Camera Features on Other Android Devices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X