లీ1ఎస్ ఫోన్‌లో ఆ సమస్యలా..?

Written By:

లీఇకో సంస్థ నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ లీ1ఎస్ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో ఆకట్టుకుంటోంది. అయితే, మార్కెట్లో విడుదలయ్యే ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లోనూ ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. ఈ కోవకే చెందిన లీ1ఎస్ ఫోన్‌లో కూడా ఓవర్ హీటింగ్, యాప్ క్రాష్, వై-పై కనెక్టువిటీ బగ్ వంటి చిన్ని చిన్ని సమస్యలు తలెత్తుతున్నట్లు పలువురు యూజర్లు చెబుతున్నారు. ఈ సాధారణ సమస్యలను సునాయాశంగా పరిష్కరించేందకు పలు సింపుల్ ట్రిక్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సమస్య 1

లీ1ఎస్ ఫోన్‌లో ఆ సమస్యలా..?

ఓవర్ హీటింగ్

లీ1ఎస్ ఫోన్ అంతగా పాపులర్ కాని హీలియో ఎక్స్10 చిప్‌సెట్‌తో వస్తోన్న నేపథ్యంలో హీటింగ్ సమస్య కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ మెటల్ బాడీతో వస్తుండటంతో సమస్య మరింత ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫోన్‌లో ఎక్కువు సేపు గేమ్స్ ఆడుతున్నప్పుడు, వీడియోలను ప్రాసెస్ చేస్తున్నప్పుడు హీటింగ్ వస్తున్నట్లు యూజర్లు చెబుతున్నారు. హీటింగ్ సమస్యను పరిష్కరించేందుకు ఈ ఈ టిప్స్‌ను ట్రై చేసి చూడండి...

హీటింగ్ సమస్యను ఎదుర్కొనే ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ అయినా సంతృప్తికరమైన ప్రదర్శనను కనబర్చలేదు. కాబట్టి, మీ ఫోన్‌ను ఒకసారి రీస్టార్ట్ చేసి చూడండి. సమస్య కంటిన్యూ అవుతున్నట్లయితే.. ఫోన్ హీటింగ్‌ను అదుపులోకి తీసుకువచ్చే అనే యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ‘Cool Down Phone' వంటి యాప్స్‌ను ట్రై చేసి చూడండి.

 

 

సమస్య - 2

లీ1ఎస్ ఫోన్‌లో ఆ సమస్యలా..?

యూజర్ ఇంటర్‌ఫేస్‌లో తరచూ యాప్స్ క్రాష్ అవుతున్నాయి

ఫోన్‌లో వివిధ రకాల యాప్స్‌ను ఒకేసారి వాడుతున్నప్పుడు ఈ సమస్య తలెత్తే అవకాశముంది. లీ1ఎస్ ఫోన్ 3జీబి ర్యామ్‌తో వస్తున్నప్పటికి కొన్ని పెద్ద పెద్ద యాప్స్ ఈ ర్యామ్ స్పేస్‌ మొత్తాన్ని ఆక్రమించేయగలవు. యాప్‌లకు సంబంధించి క్యాచీ మెమరీ పేరుకుపోవటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశముంది. కాబట్టి, క్లీన్ మాస్టర్ వంటి యాప్స్ మీ ఫోన్‌లో ఉండటం మంచిది. ఇవి ఎప్పటికప్పుడు, యాప్‌లకు సంబంధించి క్యాచీ మెమరీని క్లీన్ చేసేస్తుంటాయి.

 

సమస్య 3

లీ1ఎస్ ఫోన్‌లో ఆ సమస్యలా..?

వై-ఫై కనెక్టువిటీ బగ్స్

ఫోన్ సుధీర్ఘ సమయం పాటు స్టాండ్ బై మోడ్‌లో ఉన్నప్పుడు వై-ఫై నెట్‌వర్క్స్ ఆటోమెటిక్‌గా disconnect అయిపోతున్నాయని పలువురు యూజర్లు ఆరోపిస్తున్నాయి. ఈ సమస్యను మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే ఫోన్‌ను ఫ్లైడ్ మోడ్‌లోకి తీసుకువెళ్లి ఒక 10 సెకన్లతో తిరిగి సాధారణ మోడ్‌లోకి తీసుకురండి. ఈ సమస్య సాఫ్ట్‌వేర్ బగ్ కారణంగా కూడా సంభవించే అవకాశముంది. కాబట్టి, ఇది మీ ఫోన్‌కు శాస్వుత సమస్య అని ఫీల్ అవ్వకండి. యూజర్ ఇంటర్‌ఫేస్ అప్‌డేట్ అయితే సమస్య ఆటోమెటిక్‌గా క్లియర్ అవుతుంది.

 

సమస్య 4

లీ1ఎస్ ఫోన్‌లో ఆ సమస్యలా..?

వాట్సాప్ క్రాష్ అవుతోంది..

లీ1ఎస్ ఫోన్‌లో థర్డ్ పార్టీ యాప్స్ సరిగ్గా స్పందించటం లేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ మెసెంజర్‌లో ఈ సమస్యను గుర్తించినట్లు వీరు చెబుతున్నారు. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Apps>Whatsapp Messenger and click on ‘Clear cache' as well as ‘Clear Data' ) సెట్టింగ్స్‌ను రీసెట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le 1S: Common Problems And Their Fixes. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting