కీబోర్డును లాక్ చేయటమెలా..?, బాగా ఉపయోగించే కీబోర్ట్ షార్ట్ కట్స్ ఏంటి..?
పర్సనల్ కంప్యూటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. చిన్నారులను పీసీ దగ్గర విడిచిపెట్టినట్లయితే మౌస్ అదేవిధంగా కీబోర్డ్ బటన్‌లను ఆటవస్తువుల్లా ఏలా పడితే అలా ప్రెస్ చేసేస్తారు. పొరపాటున ఏదిపడిదే అది క్లిక్ చేయటం వల్ల కంప్యూటర్‌కు హానితలెత్తే అవకాశముంది. ఈ విధమైన సమస్య నుంచి బయటపడాలంటే ‘కిడ్-కీ-లాక్'అనే అప్లికేషన్‌ను పీసీలో ఇన్స్‌టాల్ చేసుకోవటం ఉపయుక్తం. ఈ అప్లికేషన్‌ను పీసీలో డౌన్‌లోడ్ చేసుకోవటం వల్ల కావల్సిన కీబోర్డ్ బటన్‌లతో పాటు మౌస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. పాస్‌వర్డ్ ఆధారంగా లాక్‌ను డిసేబుల్ చేయవచ్చు. విండోస్ ఎక్స్‌పీ ఇంకా విండోస్7 వోఎస్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. కిడ్-కీ-లాక్ (kid-key-lock)

మౌస్ లేకండా విండోస్ కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడం సాధ్యమేనా..? ముమ్మాటికి సాధ్యమే కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ప్రయత్నించటం ద్వారా పీసీని నిశ్చింతగా ఆపరేట్ చేసుకోవచ్చు. పలు ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.......
- ఎఫ్1 ( F1) - సహాయం (హెల్ప్).
- కంట్రోల్ + ఈఎస్‌సీ (CTRL+ESC): ఓపెన్ స్టార్ మెనూ.
- ఆల్ట్ + టాబ్ (ALT+TAB): ఓపెన్ చేసి ఉన్న ప్రోగ్రామ్ లలోకి మారవచ్చు.
- ఆల్ట్ + ఎఫ్4 (ALT+F4) : ప్రోగ్రామ్ నుంచి నిష్క్రమించుట.
- షిప్ట్ + డిలీట్ (SHIFT+DELETE): శాస్వుతంగా డిలీట్ చేయుట.
- విండోస్ లోగో+ ఎల్ (Windows Logo+L) : లాక్ ద కంప్యూటర్.
- కంట్రోల్ + సీ ( CTRL+C): కాపీ,
- కంట్రోల్ + ఎక్స్ (CTRL+X): కట్,
- కంట్రోల్ + వీ ( CTRL+V): పేస్ట్,
- కంట్రోల్ + జడ్ (CTRL+Z): అండూ,
- కంట్రోల్ + బి (CTRL+B): బోల్డ్,
- కంట్రోల్ + యూ( CTRL+U): అండర్ లైన్,
- కంట్రోల్ + ఎల్ (CTRL+I): ఇటాలిక్.


Click it and Unblock the Notifications