Meta 3D అవతార్‌ని ఫేస్‌బుక్‌లో సృష్టించడం ఎలా?

|

Meta సంస్థ ఇప్పుడు తన ఫేస్‌బుక్‌ మరియు మెసెంజర్ యాప్‌లను వినియోగిస్తున్న భారతీయ వినియోగదారుల కోసం కొత్తగా అప్‌డేట్‌చేయబడిన 3D అవతార్‌లను ప్రకటించింది. ఆన్‌లైన్ ప్రపంచంలో మిమ్మల్ని మీరు మెరుగ్గా వ్యక్తీకరించడానికి మీ యొక్క వర్చువల్ వెర్షన్‌ను సృష్టించడానికి మెటా 3D అవతార్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ కొత్త అప్‌డేట్‌లు వినికిడి సహాయాలు మరియు కోక్లియర్ ఇంప్లాంట్‌లకు మద్దతునివ్వడమే కాకుండా అవతార్‌ల కోసం వీల్‌చైర్‌ను కూడా జోడిస్తుంది.

 
Meta 3D Avatar Create Process Step by step on Facebook

ఈ జోడింపులతో మెటా సంస్థ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృత ప్రేక్షకుల సంఖ్యని మరింత పెంచుకోవాలని యోచిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు ఇన్స్టాగ్రామ్ మరియు మెసెంజర్ యాప్‌లలో కూడా Meta 3D అవతార్‌లను ఉపయోగించవచ్చు. నేటి ఈ కథనంలో ఫేస్‌బుక్‌లో మీ యొక్క 3D అవతార్‌ను ఎలా సృష్టించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Meta 3D అవతార్‌ని ఫేస్‌బుక్‌లో సృష్టించే విధానం

Meta 3D Avatar Create Process Step by step on Facebook

1. మీ ఫోన్‌లో ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేయండి.

2. హాంబర్గర్ ఐకాన్ వలె కనిపించే మెనుపై క్లిక్ చేయండి.

3. తరువాత 'See more' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

4. అవతార్‌ ఎంపికని కనుగొని దానిపై క్లిక్ చేయండి.

5. ఇప్పుడు మీరు ఈ అవతార్‌ని మీ ఇష్టానికి అనుగుణంగా మార్చుకోవచ్చు.

(మెటా 3D అవతార్‌లు మెరుగ్గా కనిపించేలా చేయడానికి మెటా సంస్థ మరిన్ని ఎంపికలను జోడించింది).

6. మార్పులు చేయడం పూర్తయిన తరువాత 'ఫినిష్' బటన్‌పై నొక్కండి.

7. ఇప్పుడు మీరు మెటా 3D అవతార్‌లను ఉపయోగించి ఏదైనా పోస్ట్‌ని సృష్టించవచ్చు మరియు Facebook యాప్‌లో స్టేటస్ ని అప్‌డేట్ చేయవచ్చు. మీరు 3D అవతార్‌ని మీ ప్రొఫైల్ చిత్రంగా కూడా ఉపయోగించవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ మరియు మెసెంజర్‌లో మెటా 3D అవతార్‌లను ఉపయోగించే విధానం

Meta 3D Avatar Create Process Step by step on Facebook

1. ఇన్‌స్టాగ్రామ్ లేదా మెసెంజర్‌ యాప్‌లను ఓపెన్ చేయండి.

2. చాట్ ను ఓపెన్ చేయండి.

3. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కుడివైపున ఉన్న స్టిక్కర్ బటన్‌పై క్లిక్ చేసి, అవతార్ ఎంపిక కోసం చూసి దానిపై క్లిక్ చేయండి. ఇందులో మీకు అన్ని రకాల 3D అవతార్‌లు కనిపిస్తాయి. అదేవిధంగా మెసెంజర్‌లో స్టిక్కర్ బటన్‌పై క్లిక్ చేయడంతో ఎగువ విభాగంలో మీరు స్వయంచాలకంగా రూపొందించబడిన అన్ని మెటా 3D అవతార్‌లను చూడగలరు.

3D అవతార్‌లకు మరిన్ని మెరుగుదలలు తీసుకురావాలని మెటా ప్లాన్ చేసింది. ఇది భవిష్యత్తులో మరిన్ని స్టిక్కర్ ఎంపికలు మరియు కేంద్రీకృత శైలులను జోడిస్తుంది.

Best Mobiles in India

English summary
Meta 3D Avatar Create Process Step by step on Facebook

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X