MI ఫోన్లకు MIUI9 అప్డేట్ వచ్చింది : డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేయడం ఎలా..?

కొన్ని ఎంపిక చేయబడిన మొబైల్స్ మాత్రమే ఈ అప్డేట్ పొందగలవు. ఆ మొబైల్స్ Xiaomi Mi Max, Redmi Y1, Redmi Y1 Lite, Redmi Note 4, Redmi 4, Mi Max 2, Mi MIX 2, Mi 6, Mi 5, మరియు Mi 5s Plus.

|

చైనా మొబైల్ హ్యాండ్ సెట్ తయారీదారులైన Xiaomi, MIUI 9 గ్లోబల్ స్టేబుల్ ROM ను కొన్ని ఎంపిక చేసిన మొబైల్స్ కు విడుదల చేసింది. మొదటగా Red Mi 4, Mi Max 2, Mi 5s, Mi MIX 2, Mi 6 మరియు Redmi 4X (భారతదేశంలో రెడ్మి 4 గా విడుదల చేయబడింది) మోడల్స్ వరకే MIUI 9 అప్డేట్ ప్రారంభించింది. Mi Max, Mi Max Prime, Mi MIX 2, Redmi Y1, Redmi Y1 Lite, Mi MIX, మరియు Mi 5 కూడా OTA(over the air) పద్దతిలో నవీకరణలను స్వీకరించడం ప్రారంభించాయి. మీ Xiaomi మొబైల్ MIUI 9 నవీకరణకు మద్దతిస్తే మీరు ఇక్కడ తనిఖీ చేసుకోవచ్చు.OTA ద్వారా అప్డేట్ పొందడానికి, వినియోగదారులు అప్డేట్ నోటిఫికేషన్ కోసం ఓపికగా వేచి ఉండాలి. లేదా మొబైల్ లో అప్డేటర్ అప్లికేషన్ ద్వారా అప్డేట్స్ వచ్చున్నాయో లేదో గమనించవచ్చు. కానీ వేచి ఉండుటకు ఆసక్తి కనపరచని వారికై మేము స్టేబుల్ romలింకులని, ఫ్లాషింగ్ చేయవలసిన మార్గాలను పొందుపరచడం జరిగినది.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

ఫ్లాషింగ్ ప్రక్రియతో

ఫ్లాషింగ్ ప్రక్రియతో

ఫ్లాషింగ్ ప్రక్రియతో ప్రారంభించే ముందు, Xiaomi వినియోగదారులు వారి బ్యాటరీ 60 శాతం పైన ఉన్నట్లు నిర్ధారించుకోవాలి మరియు సురక్షితంగా ఉండేలా అప్లికేషన్లు, కాంటాక్ట్స్ మరియు మల్టీమీడియా కంటెంట్ సంబంధించిన బ్యాకప్ తీసుకోవాలి. Xiaomi స్మార్ట్ఫోన్ వినియోగదారులు ROM వెర్షన్ బట్టి రికవరీ లేదా Fastboot ప్యాకేజీ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. మీరు డెవలపర్ ROM ను ఉపయోగిస్తున్నట్లయితే, అప్పుడు .zip కొనసాగింపుగా ఉన్న రిజిస్ట్రీ ప్యాకేజీని లేదా స్టేబుల్ ROM ని రన్ చేసేవారు .tgz పొడిగింపుతో ఉన్న Fastboot ప్యాకేజీని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Redmi నోట్ 4

Redmi నోట్ 4

Redmi నోట్ 4 మరియు MIమాక్స్2 ఉన్నవారు Xiaomi యొక్క వెబ్సైట్ నుండి సంబంధిత ROM లు డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. MIUI9 గ్లోబల్ స్టేబుల్ ROM ను డౌన్లోడ్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలనే దానిపై క్రింది దశలను అనుసరించండి.

Devices roms and recovery list :

Devices roms and recovery list :

Fastboot పద్ధతి:
1) మీ స్మార్ట్ఫోన్ ను బ్యాకప్ చేసిన తర్వాత, FastbootROMను డౌన్లోడ్ చేయండి.

2) ఫాస్ట్ బూటింగ్ కు ముందు, మొబైల్ బూట్లోడర్ అన్ లాక్ చేయబడి ఉండాలి. దీన్ని ఎలా చేయాలనే దానిపై మరింత సమాచారం కోసం ఈపేజీని సందర్శించండి. en.miui.com/unlock/

3) మీరు బూట్లోడర్ అన్లాక్ చేసిన తర్వాతనే, Fastboot మోడ్ కు వెళ్ళాలి. మీ పరికరాన్ని స్విచ్ఆఫ్ చేసి వాల్యూమ్ డౌన్ మరియు పవర్ బటన్ను ఏకకాలంలో నొక్కి పట్టుకొని ఉంచండి. తద్వారా మొబైల్ ఫాస్ట్ బూట్ స్క్రీన్లోకి వెళ్తుంది.

4) యూజర్లు PC ను USB తో వారి ఫోన్లకు కనెక్ట్ చేయవచ్చు, ఫ్లాష్ tool లో రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయండి. డివైజ్ ID చూపబడుతుంది. లేకపోతే, Mi PC Suite(pcsuite.mi.com) మరియు డ్రైవర్లను( drive.google.com/file/d/0B-NA6Dj31wfZMzlnRHNRcE9UN28/view ) ఇన్స్టాల్ చేసుకోండి. PCలో ఒక ఫోల్డర్ లో, ఫాస్ట్ బూట్ ROM ఎక్స్ట్రాక్ట్ చేయండి.

5) MiFlash tool ఓపెన్ చేసి, కుడి పక్క డౌన్ యారో బట్టన్ క్లిక్ చేసి "CLEAN ALL " చేయవలసి ఉంటుంది.

6) సెలెక్ట్ ని క్లిక్ చేసి ఫాస్ట్ బూట్ rom ఎక్స్ట్రాక్ట్ చేసి ఉన్న ఫోల్డర్ ను బ్రౌస్ చేసి, తర్వాత ఫ్లాష్ మీద క్లిక్ చేయండి.

7) మీ ఫోన్ లో ఫ్లాషింగ్ ప్రారంభమవుతుంది మరియు 3-5నిమిషాల సమయం పడుతుంది. మీ PC మరియు మొబైల్ పనితీరుపై ఆధారపడి. వినియోగదారులు ఫ్లాషింగ్ చేస్తున్నప్పుడు వారి పరికరాన్ని తొలగించకూడదని గమనించాలి.

8) ఇప్పుడు మొబైల్ MIUI9తో పునఃప్రారంభించబడుతుంది.

 

రికవరీ ROM పద్ధతి:

రికవరీ ROM పద్ధతి:

1) మీ స్మార్ట్ఫోన్ బ్యాకప్ చేశాక, మీ మొబైల్ లో రికవరీ ROMని డౌన్లోడ్ చేయండి. దీన్ని ఇంటర్నల్ స్టోరేజ్ నందు ఉంచండి.

2) updater app ఓపెన్ చేసి, కుడి ఎగువ మూలలో మెను క్లిక్ చేసి, ఆపై అప్డేట్ ప్యాకేజీ ఎంచుకుని క్లిక్ చేయండి.

3) డౌన్లోడ్ చేసిన ROM ఎంచుకోండి, OK క్లిక్ చేయండి. పూర్తి ప్రక్రియ కోసం వేచి ఉండండి. ఆపై రీబూట్ క్లిక్ చేయండి.

4) పరికరం MIUI9తో రీబూట్ చేస్తుంది.

 

గమనిక : కొన్ని ఎంపిక చేయబడిన మొబైల్స్ మాత్రమే ఈ అప్డేట్ పొందగలవు. ఆ మొబైల్స్ Xiaomi Mi Max, Redmi Y1, Redmi Y1 Lite, Redmi Note 4, Redmi 4, Mi Max 2, Mi MIX 2, Mi 6, Mi 5, మరియు Mi 5s Plus.

Best Mobiles in India

English summary
MIUI 9 Rollout: How to Download and Install on Xiaomi Mi Max, Redmi Y1, Redmi Y1 Lite, Redmi Note 4, Redmi 4, Mi Max 2, Mi MIX 2, Mi 6, Mi 5, and Mi 5s Plus

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X