Airtel వాలెట్ నుంచి బ్యాంక్ ఖాతాకు మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోండిలా!

|

దేశంలో గత కొన్ని సంవ‌త్స‌రాలుగా డిజిటల్ చెల్లింపులు అద్భుతమైన వృద్ధిని సాధించాయి. ఇంకా క‌రోనా రాక‌తో డిజిట‌ల్ చెల్లింపుల వృద్ధి భారీగా ఊపందుకుంద‌ని చెప్పొచ్చు. ఏదేమైన‌ప్ప‌టికీ.. ఈ డిజిట‌ల్ చెల్లింపుల వృద్ధిలో ప‌లు యూపీఐ యాప్‌లు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. వాటిలో BHIM, Google Pay, Airtel థాంక్స్, PhonePe వంటి UPI యాప్‌లు ఉన్నాయి. ఇందులో ఎయిర్‌టెల్ థాంక్స్ వాలెట్(Airtel Payments) యాప్ ను వినియోగించే వారు చాలా మందే ఉన్నారు.

airtel wallet

ఎయిర్‌టెల్ వాలెట్(Airtel Payments) యాప్ ద్వారా యూజ‌ర్లకు తక్షణ ఆన్‌లైన్ లావాదేవీలు చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే, ఎయిర్‌టెల్ వాలెట్ యాప్‌లో ఉన్న డ‌బ్బుల్ని బ్యాంక్ అకౌంట్‌కు ఎలా బ‌దిలీ చేసుకోవాలో తెలియ‌క చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు. అలాంటి వారి కోసం మేము ఎయిర్‌టెల్ వాలెట్‌ని బ్యాంక్‌కి బదిలీ చేయడం ఎలా అనే విష‌యాన్ని మీ ముందుకు తీసుకువ‌చ్చాం. స్టెప్ బై స్టెప్ ప్ర‌క్రియ‌ను తెలుస‌కోవ‌డానికి కింది స‌మాచారాన్ని పూర్తిగా చ‌ద‌వండి.

airtel wallet

ఎయిర్‌టెల్ వాలెట్(Airtel Payments) నుంచి బ్యాంక్ ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ చేయ‌డం ఎలా:
* ముందుగా మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా, యాప్ స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత యాప్‌ను ఓపెన్ చేయాలి.
* యాప్ ఓపెన్ అయ్యాక మీకు ఐదు సెక్ష‌న్లు కనిపిస్తాయి. మేనేజ్, పే, షాప్, డిస్క‌వ‌ర్, హెల్ప్ అనే సెక్ష‌న్లు మీకు క‌నిపిస్తాయి.
* వాటిల్లో పే (Pay) అనే సెక్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
* పే పేజీలోకి ఎంట‌ర్ అయ్యాక పై భాగంలో పే బ్యాంక్ అకౌంట్ అనే ఆప్ష‌న్‌ను మీరు క‌నుగొంటారు. దానిపై క్లిక్ చేయాలి. పే బ్యాంక్ ఖాతా అనే ఆప్ష‌న్ నుంచి ఏ బ్యాంక్ ఖాతా అయినా నిధుల‌ను పొందవచ్చు.
* మీకు అనేక బ్యాంకుల జాబితా అక్క‌డ క‌నిపిస్తుంది. అందులో మీరు న‌గ‌దు సెండ్ చేయాల‌నుకుంటున్న బ్యాంక్‌ను ఎంపిక చేసుకోవాలి.
* బ్యాంక్‌ను ఎంపిక చేసుకున్న త‌ర్వాత మీరు ఒక ఫారం తో కూడిన కొత్త పేజీలోకి ఎంట‌ర్ అవుతారు. అందులో మ‌నీ రిసీవ‌ర్ యొక్క బ్యాంక్ ఖాతా వివ‌రాలు, పేరు, ఐఎఫ్ఎస్‌సీ వంటి వివ‌రాల‌ను న‌మోదు చేయాలి. ఆ త‌ర్వాత కంటిన్యూ అనే బ‌ట‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత మీరు ఎంత న‌గ‌దునున సెండ్ చేయాల‌నుకుంటున్నారో అక్క‌డ టైప్ చేయాలి. అద‌నంగా మీరు రిసీవ‌ర్‌కు ఏదైనా నోట్(గ‌మ‌నిక‌) పంపాల‌నుకుంటే అక్క‌డ రాయ‌డానికి అవ‌కాశం ఉంటుంది.
* అనంత‌రం ఏ ఖాతా నుంచి న‌గ‌దును పంపాల‌నుకుంటున్నార‌నే విష‌యాన్ని అడుగుతుంది. అప్పుడు మీరు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత ప్రొసీడ్ అనే బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.
* అనంత‌రం పేమెంట్ పూర్తి అవుతుంది.

ఎయిర్‌టెల్ వాలెట్ నుండి బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీకి సంబంధించిన ఛార్జీలు మొత్తం లావాదేవీ విలువలో 3% వ‌ర‌కు ఉంటాయి.

airtel wallet

అదేవిధంగా, Airtel Xstream Fiber స‌ర్వీసెస్ ఇన్‌వాయిస్ డౌన్‌లోడ్ ఎలాగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.

* ముందుగా కంపెనీకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌ Airtel.in లోకి వెళ్లాలి.
* హోం పేజీ ఓపెన్ అయిన త‌ర్వాత పై భాగంలో కుడి వైపున యూజ‌ర్ లాగిన్ ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
* యూజ‌ర్ లాగిన్ కోసం ఇప్పుడు ఓ లాగిన్‌ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో లాగిన్ ఐడీలో యూజ‌ర్ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ టైప్ చేయాలి. ఆ త‌ర్వాత క్లిక్ టూ వ‌న్ టైం పాస్‌వ‌ర్డ్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయ‌డం ద్వారా యూజ‌ర్ రిజిస్ట‌ర్ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని అక్క‌డే ఇచ్చిన బాక్సులో ఎంట‌ర్ చేయ‌డం ద్వారా వెరిఫికేష‌న్ పూర్త‌వుతుంది.
* అనంత‌రం కింద లాగిన్ బ‌ట‌న్ క్లిక్ చేస్తే.. యూజ‌ర్లు త‌మ ఎయిర్‌టెల్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్‌లోకి లాగిన్ అవుతుంది.
* లాగిన అయిన త‌ర్వాత అందులో ఎడ‌మ‌వైపు పైభాగంలో ఎయిర్‌టెల్ సంబంధించి యూజ‌ర్ మొబైల్ నంబ‌ర్‌తో రిజిస్ట‌ర్ అయిన అన్ని ఎయిర్‌టెల్ స‌ర్వీసుల‌కు సంబంధించిన ఓవ‌ర్‌వ్యూ క‌నిపిస్తుంది.
* ఆ ఓవ‌ర్ వ్యూ కింద Broadband సేవ‌లకు సంబంధించిన‌ ఆప్ష‌న్ క‌నిపిస్తాయి.
* Broadband సేవ‌ల‌ను ఎంచుకున్న త‌ర్వాత‌.. అందులో బిల్లింగ్‌కు సంబంధించిన ఆప్ష‌న్ ఉంటుంది.
* దాని మీద క్లిక్ చేయ‌డం ద్వారా మ‌న‌కు లాస్ట్ పేమెంట్ లిస్ట్ క‌నిపిస్తుంది. అక్క‌డే మ‌న‌కు ఏ నెల బిల్ కావాలో దానికి సంబంధించిన ఫైల్స్ క‌నిపిస్తాయి. ఆ ఫైల్స్ కుడి వైపున మ‌న‌కు ఫైల్ వ్యూ వివ‌రాలు, మ‌రియు ప్రింట్‌, డౌన్‌లోడ్ ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. వాటిని క్లిక్ చేయ‌డం ద్వారా ఇన్‌వాయిస్ లేదా బిల్ ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Best Mobiles in India

English summary
Money Transfer from airtel wallet app to bank account, see the procedure.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X