మోటో జీ ఫోన్‌లో తలెత్తే సమస్యలు వాటి పరిష్కారాలు

Posted By:

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో మోటరోలా ‘మోటో జీ' ఒకటి. ఎంతటి గొప్ప స్మార్ట్‌ఫోన్‌లో అయినా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సాంకేతిక లోపం తలెత్తక తప్పదు. అలాగే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలోనూ సాంకేతిక లోపాలు తలెత్తటం సహజం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మోటో జో స్మార్ట్‌ఫోన్‌లో తలెత్తే పలు సాధారణ సమస్యలు వాటి పరిష్కారాలను మీముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అస్థిరమైన బ్యాటరీ పర్సెంటేజ్

మోటో జీ ఫోన్‌లో తలెత్తే సమస్యలు వాటి పరిష్కారాలు

అస్థిరమైన బ్యాటరీ పర్సెంటేజ్

మీ మోటో జీ ఫోన్‌లోని బ్యాటరీ పర్సెంటేజ్ ఒక సంఖ్య నుంచి మరొక సంఖ్యకు హఠాత్తుగా మారిపోతుందా..? ఈ విధమైన సమస్య మీ మోటో జీ ఫోన్‌కు ఎదురైనట్లయితే, ముందుగా ఫోన్ బ్యాటరీ స్థాయిని సున్నాకి తీసుకురండి. ఆ తరువాత ‘0' నుంచి ‘100' శాతం వరకు పూర్తిగా చార్జ్ చేయండి. ఈ పద్ధతిని అలవాటు చేయటం ద్వారా బ్యాటరీ ఓ క్రమ పద్ధతిని అలవర్చుకుంటుంది. అలానే మీ ఫోన్‌లో బ్యాటరీకి సంబంధించి థర్డ్ పార్టీ యాప్స్ ఏవైనా ఇన్‌స్టాల్ చేసి ఉంటే వాటిని తొలగించండి. సమస్యకు అవికూడా కారణమై ఉండొచ్చు.

 

ఫోన్‌ ‘సిమ్ కార్డ్' ను గుర్తించటం లేదా..?

మోటో జీ ఫోన్‌లో తలెత్తే సమస్యలు వాటి పరిష్కారాలు

ఫోన్‌ ‘సిమ్ కార్డ్' ను గుర్తించటం లేదా..?

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ అప్‌డేట్‌ను అందుకున్న తరువాత మీ మోటో జీ ఫోన్ సిమ్‌కార్డ్‌ను గుర్తించటం లేదా..? ఈ సమస్య పరిష్కారం పై మోటరోలా ఇప్పటికే పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. మీ ప్రయత్నంగా, వేరే సిమ్‌లను వేసి ప్రయత్నించిండి. ఒకవేళ సమస్య మీ సిమ్ కార్డ్‌లో ఉంటే పరిష్కరించుకోవచ్చు. మీరు అడాప్టర్‌తో కూడిన మైక్రోసిమ్‌ను వినియోగిస్తున్నట్లయితే నానో సిమ్‌గా మార్చి ప్రయత్నించండి. ఈ పోన్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ వర్షన్ పై రన్ అవుతున్నట్లయితే సమస్య పరిష్కారమయ్యేంత వరకు 3జీ, 2జీ డేటా కనెక్షన్‌లను ఆఫ్ చేసి ఉంచండి.

 

కెమెరా స్టార్ట్ అవటం లేదా..?

మోటో జీ ఫోన్‌లో తలెత్తే సమస్యలు వాటి పరిష్కారాలు

కెమెరా స్టార్ట్ అవటం లేదా..?

మీ మోటో జీ ఫోన్‌లో కెమెరా యాప్ స్పందించటం లేదా..? అయితే, ముందుగా సెట్టింగ్స్‌లోని యాప్స్ మెనూలోకి ప్రవేశించి కెమెరా యాప్‌ను సెలక్ట్ చేసుకోండి. కెమెరా యాప్ ఓపెన్ అయిన తరువాత ‘Force stop' ‘clear data', ‘clear cache' ఆప్షన్‌లను ‘Apply' చేయండి. చాట్ మెసెంజర్స్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి కెమెరాను యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసే ముందు ఓసారి వాటిని తొలగించి చూడండి. సమస్యకు పరిష్కారం లభించవచ్చు.

 

ఎల్ఈడి నోటిఫికేషన్‌లు పనిచేయటం లేదు..?

మోటో జీ ఫోన్‌లో తలెత్తే సమస్యలు వాటి పరిష్కారాలు

ఎల్ఈడి నోటిఫికేషన్‌లు పనిచేయటం లేదు..?

మీ మోటో జీ ఫోన్‌లో ఎల్ఈడి నోటిఫికేషన్‌ వ్యవస్థ పనిచేయటం లేదా, అయితే Motorola's Notification Light Widgetను డౌన్‌లోడ్ చేసకుని ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే సమస్య పూర్తిగా తొలగిపోతుంది.

 

బ్యాటరీ చార్జ్ అవటనాకి ఎక్కువ సమయం తీసుకుంటుదా...?

మోటో జీ ఫోన్‌లో తలెత్తే సమస్యలు వాటి పరిష్కారాలు

బ్యాటరీ చార్జ్ అవటనాకి ఎక్కువ సమయం తీసుకుంటుదా...?

మీ మోటో జీ ఫోన్‌లోని బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవటానికి ఎక్కువ సమయం తీసకుంటుందా..? అయితే ఇది హార్డ్‌వేర్ సమస్యే, చార్జర్‌కు సంబంధించిన యూఎస్బీ కేబుల్‌ను మార్చటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Moto G Problems and Solutions. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting