Home
How to

ఫోన్‌లోని Appsను ఇంటర్నల్ మెమురీ నుంచి SD cardలోకి మూవ్ చేయటం ఎలా..?

By Bommu Sivanjaneyulu

లిమిటెడ్ స్టోరేజ్ ఆప్షన్‌లతో లభ్యమవుతోన్న ఎంట్రీ-లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను స్టోరేజ్ సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. 32జీబి స్టోరేజ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే 16జీబి, 8జీబి ఇన్‌బిల్ట్ మెమురీలతో రన్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నట్లు తాజా విశ్లేషణలు చెబుతున్నాయి.

memory card slot

పోన్‌లలో యాప్స్ వినియోగం ఎక్కువైపోవటం వల్ల కూడా స్టోరేజ్ కొరతకు దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు. యాప్స్ కారణంగా స్టోరేజ్ సమస్యలను ఫేస్ చేస్తున్న ఆండ్రాయిడ్ యూజర్లు ఫోన్ మెమురీలోని కొన్ని యాప్స్‌ను SD cardలోకి మూవ్ చేసుకోవటం ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేసుకోవచ్చు. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లోని యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

ముందుగా ఫోన్ SD cardలోకి మూవ్ చేయాలనుకుంటోన్న యాప్స్‌ను ఐండెటిఫై చేయండి. ఉదాహరణకు మీరు వాట్సాప్ అప్లికేషన్‌ను ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌లోకి మూవ్ చేయాలనుకుంటున్నట్లయితే

యాప్‌కు ఇకపై ఎటువంటి రెగ్యులర్ అప్‌డేట్స్ అందవు. అంతేకాదు, ఎస్డీ కార్డును తొలగించిన ప్రతిసారి వాట్సాప్ అప్లికేషన్ ఫోన్‌లో కనిపించదు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ఫోన్‌తో పాటుగా వచ్చే ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ను SD cardలోకి మూవ్ చేయటం కుదరదు. కాబట్టి, మీరు అప్పుడప్పుడూ వినియోగించుకునే యాప్స్‌ను మాత్రమే ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌లోకి మూవ్ చేసుకోవటం మంచిది.

స్టెప్ 1

ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయాలనుకుంటోన్న యాప్స్‌ను నిర్థారించుకున్న తరువాత ఫోన్ సెట్టింగ్స్‌లోని యాప్స్ మేనేజ్‌మెంట్ సెక్షన్‌లోకి వెళ్లండి. అక్కడ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న యాప్స్ లిస్ట్ మీకు కనిపిస్తుంది. వాటిలో మీకు కావల్సిన యాప్ సెలక్ట్ చేసుకున్నట్లయితే సంబంధిత యాప్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి.

స్టెప్ 2

యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత "Move to SD card" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేసినట్లయితే యాప్ కాస్తా ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ కాబడుతుంది. ఒక వేళ ఆ యాప్ అప్పటికే ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌లో ఉన్నట్లయితే "Move to phone storage" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

లిమిటెడ్ స్టోరేజ్ ఆప్షన్‌లతో లభ్యమవుతున్న పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌకర్యం అందుబాటులో ఉండదు. మరి ఇటువంటి ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేసుకోవటం ఎలా..?

ఫోన్‌లోని పాత మెసేజ్‌లను డిలీట్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు. ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్ క్లౌడ్ సర్వీసులలోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ మరింత ఆదా అవుతుంది. పాటలను ఫోన్‌లో స్టోర్ చేసుకుని వినే బదులు, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా వినటం వల్ల బోలెడంత స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది. సాధారణ ఫోటోలతో పోలిస్తే హెచ్‌డి ఫోటోలు ఎక్కువ స్పేస్‌ను ఆక్రమించేస్తాయి. కాబట్టి, సాధారణ ఫోటోలకే ప్రాధాన్యత ఇవ్వటం మంచిది.

ఫోన్‌లో రెగ్యులర్‌గా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నట్లయితే, బ్రౌజింగ్ డేటాకు సంబంధించి క్యాచీ ఫైల్స్ ఫోన్‌లో పేరుకుపోతూ ఉంటాయి. బ్రౌజర్ హిస్టరీలోకి వెళ్లి ఎప్పటికప్పుడు క్యాచీ ఫైల్స్‌ను క్లియర్ చేసుకోవటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ పెరగటంతో పాటు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా వేగంగా ఉంటుంది.

ఫోన్‌లోని పనికిరాని యాప్స్‌ను ఎప్పటికప్పుడు డిలీట్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది. డేటా కేబుల్ సహాయంతో ఫోన్‌లోని డేటాను ఎప్పటికప్పుడు కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లోకి మూవ్ చేయటం అలవాటు చేసుకన్నట్లయితే స్టోరేజ్ స్పేస్ ఆదా అవటంతో పాటు ఫోన్ పై ఒత్తిడి మరింత తగ్గుతుంది.

Best Mobiles in India

English summary
your phone storage is full because of apps so try this trick, transfer you apps from phone memory to SD card.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X