Home
How to

మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ ఇరగదీయాలంటే..? సింపుల్ ట్రిక్స్

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే ప్రతి ఒక్కరూ క్యాజువల్ ఫోటోగ్రాఫర్స్‌గా మారిపోతున్నారు. ఇందుకు కారణం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలోనూ క్వాలిటీ కెమెరా వ్యవస్థలను ఏర్పాటు చేస్తుండటమే.

By Bommu Sivanjaneyulu

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే ప్రతి ఒక్కరూ క్యాజువల్ ఫోటోగ్రాఫర్స్‌గా మారిపోతున్నారు. ఇందుకు కారణం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలోనూ క్వాలిటీ కెమెరా వ్యవస్థలను ఏర్పాటు చేస్తుండటమే. క్యాజువల్ ఫోటోగ్రఫీకి మాత్రమే ఉపయోగపడుతున్న స్మార్ట్‌ఫోన్‌లు ద్వారా ప్రొఫెషనల్ క్వాలిటీ ఫోటోలను రాబట్టేందుకు పలు ముఖ్యమైన టిప్స్..
ఆటో మోడ్ పై పట్టు ఉండాలి...
మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాలోని ఆటోమెటిక్ షూటింగ్ మోడ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోగలిగినట్లయితే హైక్వాలిటీ ఫోటోలను మీరు క్యాప్చుర్ చేసుకోవచ్చు. ఈ మోడ్ కెమెరాలోని అన్ని విభాగాలను ఏ విధంగా వినియోగించుకుంటుందో తెలుసుకున్నట్లయితే మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మంచి మార్కులు లభిస్తాయి.

 డీఫాల్ట్స్‌ను ఓవర్ రైడ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు

డీఫాల్ట్స్‌ను ఓవర్ రైడ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు

స్మార్ట్‌ఫోన్‌లలోని కెమెరా సెట్టింగ్స్ వాటంతటకవే అడ్జస్ట్ అయినప్పటికి అవి 100 శాతం ఖచ్చితం మాత్రం కాదు. ఈ డీఫాల్ట్ సెట్టింగ్స్‌ను సందర్భాన్ని బట్టి మార్చుకోవటం ద్వారా మంచి ఫలితాలను రాబట్టే అవకాశముంటుంది.

మల్టిపుల్ షాట్స్ తీసుకోండి..

మల్టిపుల్ షాట్స్ తీసుకోండి..

స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వెంటవెంటనే మల్టిపుల్ షాట్స్‌ను క్యాప్చుర్ చేసుకోవటం ద్వారా వాటిలో మంచి ఫోటోలను పిక్ చేసుకునే వీలుంటుంది. ఫోటోలను షూట్ చేసే సమయంలో కెమెరా యాంగిల్ అటు ఇటు కదలకుండా స్థిరంగా ఉండేలా చూసుకోండి.

 ఎడిటింగ్ కీలకం..

ఎడిటింగ్ కీలకం..

క్యాప్చుర్ చేసుకున్న ఫోటోలకు ఫోన్‌లోని ఎడిటింగ్ యాప్స్ ద్వారా కావల్సిన హంగులను అద్దుకోవచ్చు. బెస్ట్ క్వాలటీ ఫోటోగ్రఫీని ఆస్వాదించే క్రమంలో ఈ ఫోన్‌లోని అన్ని వనరులను ఉపయోగించుకోండి.
కాంతి చాలా కీలకం..
మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని తక్కువ వెళుతురు సెట్టింగ్స్‌లో కాకుండా పగటి కాంతిలో ట్రై చేసినట్లయితే ప్రొఫెషనల్ స్థాయి ఫోటోలను ఆస్వాదించవచ్చు. ఫ్లాష్‌కు బదులుగా హై డైనమిక్ రేంజ్ మోడ్ (HDR Mode)ను అప్లై చేయటం ద్వారా ఉత్తమ క్వాలిటీ ఫోటోలను ఆస్వాదించవచ్చు.

 జూమ్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి

జూమ్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి

డిజిటల్ జూమ్‌ను ఉపయోగించకండి. అవసరమనుకుంటే సబ్జెక్ట్‌కు దగ్గరగా వెళ్లి చిత్రీకరించండి. ఫ్లాష్‌ను తెలివిగా ఉపయోగించండి. ఫ్లాష్‌ అనేది తక్కువ వెళుతురు కండీషన్ లలో మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని సందర్భాల్లో ఫ్లాష్‌ను ఉపయోగించవద్దు.
థర్డ్ పార్టీ యాప్స్‌తో బెస్ట్ క్వాలిటీ ఫోటోగ్రఫీ..
థర్డ్ పార్టీ కెమెరా యాప్స్ సహాయం తీసుకోవటం ద్వారా బెస్ట్ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు. మీ ఫోన్ కెమెరా లెన్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం ద్వారా ఫోటోల క్లారిటీ బాగుంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Smartphones are by far the most common form of camera used today, and it’s easy to see why: they’re compact, most people have one with them at all times, and many can take photos that rival standalone point and shoot cameras.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X