WhatsApp ద్వారా 2022 న్యూ ఇయర్ స్టిక్కర్లను పంపడం ఎలా??

|

2021 సంవత్సరం ముగియనున్న అధ్యాయంతో ప్రజలు కొత్త సంవత్సరాన్ని ఆశాజనకంగా స్వీకరించేందుకు ఎదురుచూస్తున్నారు. కరోనా యొక్క కొత్త వేరియంట్ ఓమ్రికాన్ కేసులు ఇండియాలో మళ్ళి అధికమవుతున్న సందర్భంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ప్రభుత్వం పరిమితులు ఇవ్వడం లేదు. ఇటీవలి పరిస్థితుల కారణంగా నూతన సంవత్సర వేడుకలు కేవలం ఇంటి వద్దనే ఉండి జరుపుకోవడానికి చాలా మంది ఎంచుకుంటున్నారు. ఒకవేళ మీరు ఎంచుకున్న ప్లాన్‌లు రద్దు చేసుకొని ఉంటే కనుక గ్రీటింగ్‌లు వర్చువల్ స్పేస్‌లోని పరిష్కారం ద్వారా శుభాకాంక్షలు పంపడానికి ఆహ్లాదకరమైన మరియు సులభమైన మార్గం WhatsApp స్టిక్కర్లు. ఈ సులభమైన దశల్లో క్రాస్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఉచితంగా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు ప్రియమైనవారికి మీ శుభాకాంక్షలను ఎలా పంచుకోవచ్చో వంటి వివరాలు తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

 
New Year 2022: How to Download and Send New Year Stickers Through WhatsApp

స్టెప్ 1- మీ ఫోన్‌లో Google Play Store యాప్‌ని ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో WhatsApp న్యూ ఇయర్ స్టిక్కర్‌ అని టైప్ చేయండి.

 

స్టెప్ 2- యాప్ స్టోర్ వివిధ స్టిక్కర్ ప్యాక్‌లను చూపుతుంది. చాలా యాప్‌లు యానిమేటెడ్ వాటితో సహా బహుళ స్టిక్కర్‌లను కలిగి ఉంటాయి. రేటింగ్‌ని తనిఖీ చేసి మీకు కావలసిన ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 3- డౌన్‌లోడ్ చేసిన తర్వాత WhatsAppని ఓపెన్ చేసి వ్యక్తిగత చాట్ లేదా గ్రూపుకి వెళ్లండి.

స్టెప్ 4- ఆపై స్టిక్కర్ ట్యాబ్‌ను ఎంచుకోవడానికి ఎమోజి ఎంపికను నొక్కండి.

స్టెప్ 5- ఇది మీరు డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్ల ప్యాక్‌లను చూపుతుంది.

స్టెప్ 6- ప్యాక్‌ని తెరవడానికి స్టిక్కర్ ప్యాక్ హెడర్‌ని ఎంచుకోండి మరియు కొన్ని స్టిక్కర్‌లను ఎంచుకోవడానికి క్రిందికి స్క్రోల్ చేయండి.

స్టెప్ 7- స్టిక్కర్‌ను నొక్కండి మరియు దాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి.

మీరు స్టిక్కర్‌పై క్లిక్ చేసి ఇష్టమైన వాటికి జోడించు ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీ స్నేహితులు పంపిన స్టిక్కర్‌లను కూడా సేవ్ చేయవచ్చు. ఇది సేవ్ చేయబడుతుంది మరియు ఇతర స్టిక్కర్ ప్యాక్‌లతో పాటు చూపబడుతుంది.

Best Mobiles in India

English summary
New Year 2022: How to Download and Send New Year Stickers Through WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X