రూ.10కే మూడు నెల‌ల Youtube ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్‌.. ఇది చూడండి!

|

ప్ర‌ముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం అయిన YouTubeలో ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ సేవ‌ల్ని అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ కొన‌డం ద్వారా యూజ‌ర్ల‌కు యాడ్స్ ఫ్రీ ఎక్స్‌పీరియ‌న్స్‌తో పాటు, త‌మ వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్‌లను కూడా యూట్యూబ్ అందిస్తుంది.

 
Youtube

ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఈ యూట్యూబ్ ప్రీమియంకు భారీగా డిమాండ్ పెరిగింది. అంత‌రాయం లేని స్ట్రీమింగ్ కోసం చాలా మంది యూజ‌ర్లు ప్రీమియం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, భారతదేశంలో ఈ స‌ర్వీస్ నెలకు రూ.129తో ప్రారంభమవుతుంది. కానీ, ఇప్పుడు మీరు దీని మూడు నెల‌ల స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అతి త‌క్కువ ధ‌ర‌కు కేవ‌లం రూ.10 కే పొంద‌వ‌చ్చు. అది ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 
Youtube

ఇన్విటేష‌న్ ప్రోగ్రామ్ అందుబాటులో!
YouTube ప్ర‌స్తుతం ఇన్విటేష‌న్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఇన్విటేష‌న్ ప్రొగ్రామం కింద రూ.10కి ప్రీమియం మెంబర్‌షిప్‌ను అందిస్తున్నారు. ఈ ఆఫర్‌ను పొందే వినియోగదారులు మూడు నెలల పాటు YouTube ప్రీమియం సభ్యత్వాన్ని పొందుతారు. ఆ తర్వాత వారు ప్రీమియంను కొన‌సాగించాల‌నుకుంటే నెలకు అధికారిక ధర రూ.129 చెల్లించాల్సి ఉంటుంది. ఆఫర్ లభ్యత వ్య‌వ‌ధిని కంపెనీ వెల్లడించనప్పటికీ, ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

Youtube

యూట్యూబ్ ప్రీమియం ఉప‌యోగాలు:
సాధార‌ణంగా ఇంట‌ర్నెట్ యాక్సెస్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ YouTube సేవ‌ల్ని ఉచితంగా పొంద‌వ‌చ్చు. అయితే, యూట్యూబ్ అందుబాటులోకి తెచ్చిన ప్రీమియం స‌ర్వీసుల ద్వారా యాడ్స్ లేని వీడియో అనుభవాన్ని మరియు అనేక ఇతర ఫీచర్‌లను పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా, వీడియోలను డౌన్‌లోడ్ చేయడం, వీడియోలను ఆఫ్‌లైన్‌లో ప్లే చేయడం, మరియు బ్యాక్ గ్రౌండ్‌లో వీడియోలను ప్లే చేయడం, YouTube Music సభ్యత్వం వంటి ఫీచ‌ర్లను యూజ‌ర్లు పొంద‌వ‌చ్చు.

రూ.10ల ఆఫ‌ర్ ఎలా పొందాలి:
YouTube ప్రీమియంను కేవ‌లం రూ.10తో మూడు నెలల పాటు ఉపయోగించవచ్చని కొంతమంది వినియోగదారులకు YouTube స్వ‌యంగా నోటిఫికేషన్‌లను పంపుతున్నట్లు సమాచారం. ఆయా ఇన్విటేష‌న్ లింక్ ద్వారా యూజ‌ర్లు ఆ ఆఫ‌ర్ ను పొంద‌వ‌చ్చు. అయితే, ఆఫ‌ర్‌కు సంబంధించిన ఇన్విటేష‌న్ లింక్‌ను ప్ర‌ముఖ టిప్‌స్ట‌ర్ అభిషేక్ యాద‌వ్ ట్విట‌ర్ వేదిక‌గా షేర్ చేశారు. దాని ద్వారా కూడా ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చు.

మిత్రుల నుంచి ప్రీమియం మెంబ‌ర్షిప్ ఇన్విటేష‌న్‌ను పొంద‌డం ద్వారా కూడా ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. ఇంతకు ముందు ఎటువంటి సబ్‌స్క్రిప్షన్‌ను (ఉచితంగా లేదా తగ్గింపుతో) కొనుగోలు చేయని వినియోగదారులు మాత్రమే ఆఫర్‌ను పొందవచ్చు. ఆఫర్ వ్యవధి తర్వాత, యూజ‌ర్లు ప్రీమియం కొన‌సాగించాల‌నుకుంటే నెలకు రూ.129 ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఆఫర్ గడువు ముగిసే ఏడు రోజుల ముందు కంపెనీ వారికి తెలియజేస్తుంది. ఈ వినియోగదారులు ఎప్పుడైనా సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు.

Youtube

అదేవిధంగా, యూట్యూబ్‌లో క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్ గురించి, ఆ ఫీచ‌ర్‌ను సాధించాలంటే ఏం చేయాలో అనే విష‌యాల్ని ఇప్పుడు వివ‌రంగా తెలుసుకుందాం:
సాధారణంగా Youtube అంటే వీడియో మాత్ర‌మే పోస్టులు చేస్తార‌ని అంద‌రికీ తెలుసు. కానీ, ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మ‌న ఛానెల్‌లో మ‌రో రెండు ర‌కాల పోస్టులు చేయ‌వ‌చ్చు. అవేంటంటే.. ఫేస్‌బుక్ స‌హా ఇత‌ర సామాజిక మాధ్య‌మాల మాదిరి హెడ్‌లైన్ డిస్క్రిప్ష‌న్‌తో ఫోటో పోస్టులు చేయ‌వ‌చ్చు. దాంతో పాటుగా పోల్స్ (క్విజ్ మాదిరి) పోటీలు కూడా ఈ Community Tab Feature ద్వారా మ‌న ఛానెల్‌పై నిర్వ‌హ‌ణ చేయ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు రాష్ట్రంలో రాబోయే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది.. అనే ప్ర‌శ్న ఇచ్చి దానికి నాలుగు ఆప్ష‌న్ల‌ను జ‌త చేయ‌వ‌చ్చు. త‌ద్వారా మీ స‌బ్‌స్క్రైబ‌ర్ల అభిప్రాయాల‌ను ఈ పోల్‌లో మీరు తెలుసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఈ విధంగా క‌మ్యూనిటీ ట్యాబ్ Youtube క్రియేట‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఈ ఫీచ‌ర్ సాధించాలంటే ముందుగా మ‌న స‌బ్‌స్క్రైబ‌ర్ కౌంట్ 500 దాటాలి. ఆ త‌ర్వాత మ‌నం క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్‌ను కోరుతూ యూట్యూబ్‌కు రిక్వెస్ట్ పెట్టుకోవాలి.

క‌మ్యూనిటీ ట్యాబ్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.

* ముందుగా Youtube ఛానెల్‌లోకి వెళ్లాలి.
* ఆ త‌ర్వాత ఎడ‌మ‌వైపు మీకు వివిధ ర‌కాల ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. వాటిని స్క్రోల్ డౌన్ చేస్తే చివ‌ర‌న సెండ్ Feedback అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
* సెండ్ ఫీడ్ బ్యాక్ (Send Feedback) ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకున్న వెంట‌నే మీకు ఒక న్యూ టేబుల్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు యూట్యూబ్‌కు ఓ చిన్న డిస్క్రిప్ష‌న్ రాయాలి. "మా ఛానెల్ స‌బ్‌స్క్రైబ‌ర్ కౌంట్ 500 చేరుకుంది. కాబ‌ట్టి మాకు క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్ అందించ‌గ‌ల‌రు." అని ఇంగ్లీష్‌లో రాసి సెండ్ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఈ ప్ర‌క్రియ పూర్తి చేసిన త‌ర్వాత మీ ఛానెల్ కంపెనీ గైడ్‌లైన్స్ అన్ని స‌క్ర‌మంగా పాటిస్తున్న‌ట్ల‌యితే త‌ప్ప‌కుండా వారం లేదా ప‌ది రోజుల్లో క‌మ్యూనిటీ ట్యాబ్ అందుబాటులోకి వ‌స్తుంది.

Best Mobiles in India

English summary
Now you can Get 3 months subscription of youtube premium for Rs.10

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X