మీ ల్యాప్‌టాప్‌లు అధికంగా వేడెక్కడానికి కారణాలు..? పరిష్కార మార్గాలు.

|

ల్యాప్‌టాప్ల వాడకం గత రెండు సంవత్సరాలుగా ఎక్కువ అయింది. కరోనా రాకతో అన్ని కంపెనీలు తమ యొక్క ఉద్యోగులకు ల్యాప్‌టాప్లను అందించి ఇంటి వద్ద పనిచేయమని ఆదేశాలను జారీచేసింది. అధిక సమయం ల్యాప్‌టాప్లను ఉపయోగించడంతో అవి వేడెక్కడం గమనిస్తూ ఉంటాం. ఈ రోజుల్లో దీనిని చాలా సాధారణ సమస్యగా భవిస్తూ దీనిని తరచూ అనుభవిస్తున్నారు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో. ల్యాప్‌టాప్ వేడెక్కడం వల్ల బ్లూ స్క్రీన్ వంటి అనేక ఇతర సమస్యలకు దారితీస్తుందని మనందరికీ తెలుసు. ఫ్యాన్ స్పీడ్ అధికంగా ఉన్న సందర్భంలో ల్యాప్‌టాప్ వేడెక్కుతు CPU ఒత్తిడిని తగ్గించడం వలన దాని పనితీరు తగ్గుతుంది. ల్యాప్‌టాప్ ఈ ప్రదేశంలో వేడి అవుతున్నదో తెలుసుకోవాలనుకుంటే మీరు HW మానిటర్ కోసం వెళ్లవచ్చు. మీ ల్యాప్‌టాప్ వేడెక్కడానికి గల కారణం మరియు దానిని నివారించడానికి గల మార్గాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
మీ ల్యాప్‌టాప్‌లు అధికంగా వేడెక్కడానికి కారణాలు..? పరిష్కార మార్గాలు.

ల్యాప్‌టాప్ వేడెక్కడానికి ప్రధాన కారణాలు

** ల్యాప్‌టాప్‌ను ఎక్కువ సమయం వినియోగించడంతో ల్యాప్‌టాప్ రంధ్రాలలో అధిక మొత్తంలో ధూళి అడ్డుకుంటుంది. ఫలితంగా ల్యాప్‌టాప్ వినియోగంలో కూలింగ్ ఫ్యాన్‌కు గాలి ప్రసరణ సరిగ్గా లేకపోవడంతో ఫ్యాన్ వేడిని తగ్గించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

** చాలా సందర్భాలలో ల్యాప్‌టాప్ దిగువన ఉన్న ఎయిర్ వెంట్‌లు ధూళితో నింపబడి ఉండిపోతాయి.

మీ ల్యాప్‌టాప్‌లు అధికంగా వేడెక్కడానికి కారణాలు..? పరిష్కార మార్గాలు.

** ల్యాప్‌టాప్‌లో ఒకేసారి బహుళ-ప్రోగ్రామ్‌లను రన్ చేస్తున్నప్పుడు మదర్‌బోర్డ్, హార్డ్-డిస్క్, సాఫ్ట్-డిస్క్ మరియు పవర్ సోర్స్ యొక్క వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కావున వీటిని అధిక రేటుతో ఉపయోగించినప్పుడు దీని ఫలితంగా వేడెక్కడం మొదలవుతుంది.

** ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ల్యాప్‌టాప్ ను ఉపయోగిస్తున్నప్పుడు దీని ద్వారా ఉత్పత్తి చేయబడిన వేడి కూడా అధికముగానే ఉంటుంది. పరిసర ప్రాంతాలు చల్లగా ఉంచడంతో స్వయంచాలకంగా వేడి కూడా తగ్గుతుంది.

వేడెక్కుతున్న ల్యాప్‌టాప్‌ సమస్యలను పరిష్కరించే విధానం

** ల్యాప్‌టాప్ లోపల కూలింగ్ ఫ్యాన్‌ని జోడించడం సాధ్యం కాదు కావున అధిక సమయం ల్యాప్‌టాప్‌లను వినియోగించే వారు హీటింగ్ సమస్యను తగ్గించడానికి కూలింగ్ ప్యాడ్ లేదా ఎగ్జాస్ట్ రేడియేటర్‌ను కొనుగోలు చేయవచ్చు. అయినప్పటికీ నిరంతరం గేమ్‌లు ఆడే నోట్‌బుక్ వినియోగదారులు ల్యాప్‌టాప్ వేడెక్కడం వంటి ఇబ్బందులను ఎదురుకుంటారు. ఈ సమస్యను తగ్గించడానికి తరచూ దుమ్మును శుభ్రం చేస్తూ ఉండడం మాత్రమే ఉత్తమ మార్గం.

మీ ల్యాప్‌టాప్‌లు అధికంగా వేడెక్కడానికి కారణాలు..? పరిష్కార మార్గాలు.

** ల్యాప్‌టాప్‌ల యొక్క కింద భాగంలో కూలింగ్ సిస్టంను కలిగి ఉంటాయి కావున దుప్పటి, దిండు వంటి వాటిని వీటి ఉపయోగంలో వినియోగించడంతో ల్యాప్‌టాప్ యొక్క గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీని ఫలితంగా మీ ల్యాప్‌టాప్ త్వరగా వేడిగా మారుతుంది. కూలింగ్ ఫ్యాన్ యొక్క గాలి అధికమవ్వడంతో ఉష్ణోగ్రత పెరిగి ల్యాప్‌టాప్ వేడెక్కుతుంది. ల్యాప్‌టాప్‌ను చెక్క వంటి ఉపరితలంపై ఉంచడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ సమస్యలను నివారించడానికి మీరు ల్యాప్‌టాప్ హోల్డర్‌ను ఉపయోగించవచ్చు.

** మీరు ఒక సంవత్సరానికి పైగా ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఫ్యాన్‌లు దుమ్ముతో కప్పబడి ఉండడమే కాకుండా హీట్ సింక్ కూడా అధిక దుమ్ముతో కప్పబడి ఉంటుంది. మీ ల్యాప్‌టాప్‌లు వేడెక్కకుండా ఉండాలంటే వాటిని మీరు తరచూ శుభ్రం చేయాలి. ల్యాప్‌టాప్‌ల దుమ్మును తొలగించడానికి స్క్రూడ్రైవర్, బ్రష్, థర్మల్ గ్రీజు, రాగ్ వంటి టూల్స్ ని ఉపయోగించవచ్చు.

Best Mobiles in India

English summary
Overheating Laptop: Tips to Fix Laptop Heating Problems

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X