Home
How to

పాన్‌తో ఆధార్ లింక్ చేశారా,నేటితో గడువు పూర్తి,ఎలా చేయాలో తెలుసుకోండి

పాన్‌ను ఆధార్ నంబర్‌తో అనుసంధానించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగిసిపోతోంది.

By Hazarath Aiah

పాన్‌ను ఆధార్ నంబర్‌తో అనుసంధానించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగిసిపోతోంది. పాన్‌ను ఆధార్ నంబర్‌తో అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 2018 జూన్ 30 వరకు గడువు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం గడువును ఇప్పటికి నాలుగు సార్లు పొడిగించింది. ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే అందుకు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించి ఉండాలి. ఇదిలా ఉంటే మరోసారి గడువు పొడిగింపు ఉంటుందా అన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అనుసంధానం కోసం ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్ సైట్ కు వెళ్లి పై భాగంలో కనిపించే లింక్ ఆధార్ ను ఎంచుకోవాలి. తర్వాత పేజీలో పాన్ నంబర్, ఆధార్ నంబర్ పేర్కొని 'లింక్ ఆధార్' ను క్లిక్ చేయాలి. ప్రాసెస్ ఓ సారి తెలుసుకోండి.

e-filling portalలో లాగిన్

e-filling portalలో లాగిన్

మీరు ముందుగా ఇన్ కమ్ టాక్స్ e-filling portalలో లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ వివరాలతో అందులో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. లింక్ కోసం క్లిక్ చేయండి.

లాగిన్ కాగానే..

లాగిన్ కాగానే..

మీరు లాగిన్ కాగానే మీకు అక్కడ పాప్ అప్ విండో ఒకటి కనిపిస్తుంది. ఆధార్ లింక్ చేయమని అడుగుతుంది.

ఆధార్ నంబర్ తో పాటు పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు

ఆధార్ నంబర్ తో పాటు పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు

అక్కడ మీరు ఆధార్ నంబర్ తో పాటు పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Link Now

Link Now

మీరు ఇచ్చిన వివరాలు కరెక్ట్ గా ఉంటే అక్కడ Link Now అనే ఆప్సన్ మీకు కనిపిస్తుంది.

మొబైల్ నంబర్

మొబైల్ నంబర్

దాన్ని మీరు క్లిక్ చేయగానే మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. అది ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ కోడ్ వస్తుంది. దాంతో పాటు మీ మెయిల్ కి ఓ లింక్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఓటీపీ యాడ్ చేయాల్సి ఉంటుంది.

ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ అయిందంటూ మెసేజ్

ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ అయిందంటూ మెసేజ్

ఆ ప్రాసెస్ అయిపోగానే మీకు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ అయిందంటూ మెసేజ్ కనిపిస్తుంది. మీ పని అయిపోయినట్లే.

Best Mobiles in India

English summary
Deadline to link PAN with Aadhaar expires today: Confusion over what will happen from tomorrow More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X