పేటీఎం యాప్‌ను వాడుతున్న వెరిఫైడ్ యూజర్లు పేటీఎం ఫిజికల్ డెబిట్ కార్డును పొందవచ్చు. తాజాగా విడుదల చేసిన పేటీఎం ఐఓఎస్ యాప్ అప్‌డేట్‌లో ఈ సౌకర్యాన్ని యూజర్లకు పేటీఎం అందిస్తున్నది.
వర్చువల్ డెబిట్ కార్డును ఇతర క్రెడిట్ కార్డు మాదిరిగా వాడుకోవచ్చు అకౌంట్ హోల్డర్ పేర్, 16 అంకెల సంఖ్య, గడువు తేదీ, CVV నెంబర్ వంటి వివరాలను కలిగి ఉండాలి. యూజర్లు వారి ఆన్ లైన్ షాపింగ్ సమయంలో....చెల్లింపులకు దీనిని ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు పేటీఎం యూజర్ల అభ్యర్థనపై ఫిజికల్ డెబిట్ కార్డును కూడా అనుమతిస్తున్నారు. అయితే ఫిజికల్ డెబిట్ కార్డును ఎలా ఉపయోగించాలో...ఈ క్రింది స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.
స్టెప్ 1...
మీ స్మార్ట్ ఫోన్లో పేటీఎం యాప్ ఓపెన్ చేయండి. బాటమ్ రైట్ కార్నలోని బ్యాంక్ ఐకాన్ను ప్రెస్ చేయండి.
స్టెప్ 2...
ఇప్పుడు ఆ పేజీలో వర్చ్యువల్ డెబిట్ కార్డు, బ్యాలెన్స్, సేవింగ్స్ అకౌంట్ వివరాలతోపాటు మరిన్ని ఆప్షన్స్ చూడవచ్చు. మీరు డెబిట్ &ATCకార్డు ఆప్షన్ను చూసేవరకు స్క్రోల్ చేస్తూనే ఉండండి.
స్టెప్ 3....
మీకు కావాల్సిన ఆప్షన్ పై నొక్కితే...వర్చువల్ డెబిట్ కార్డు, మీ కార్డును నియంత్రించే ఆప్షన్, కార్డు కోసం రిక్వెస్ట్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.
స్టెప్ 4...
ఇప్పుడు రిక్వెస్ట్ కార్డుపై ప్రెస్ చేయండి.
స్టెప్ 5...
ఇది మిమ్మల్ని మరో పేజికి తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు కార్డు వివరాలతోపాటు డెలివరీ అడ్రస్ కూడా కనిపిస్తుంది. మీరు ఒక వేళ అడ్రస్సును మార్చాలనుకుంటే...మీరు న్యూ యాడ్ ఆఫ్షన్ పై నొక్కండి.
స్టెప్ 6.
మీకు వచ్చిన సమాచారంతో మీకు ఓకే అయినట్లయితే...120రూపాయలు చెల్లించడానికి కంటిన్యూ చేయండి.
స్టెప్ 7...
ఆ ప్రొసెస్ పూర్తి చేసిన తర్వాత, ఫిజికల్ డెబిట్ కార్డు కొన్ని రోజుల్లో మీ అడ్రస్సుకు వస్తుంది.
స్టెప్ 8....
ఫిజికల్ డెబిట్ కార్డును ఉపయోగించి ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కలకత్తా, హైదరాబాద్ మెట్రో నగరాల్లో ఏ ఏటిఎం బ్యాంక్ నుంచి అయినా నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే మూడు ట్రాన్జక్షన్స్ కు ఎలాంటి రుసుమును వినియోగదారుల నుంచి వసూలు చేయదు.
Xiaomi వాలంటైన్స్ డే గిఫ్ట్, ఈ ఏడాది రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ ఆ రోజే !
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.