PhonePe యాప్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం ఎలా?
ప్రముఖ డిజిటల్ పేమెంట్ సర్వీస్ PhonePe తన వినియోగదారుల కోసం ఇప్పుడు కొత్తగా ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్య బీమా ప్రాముఖ్యత తెరపైకి వచ్చింది. అటువంటి పరిస్థితిలో వినియోగదారులు ఇప్పుడు నేరుగా PhonePe ద్వారా ఆరోగ్య బీమా తీసుకోవచ్చు. అయితే బీమా పొందే ప్రక్రియ కూడా చాలా సులభం. చాలా మంది ప్రజలు ప్రస్తుత సమయంలో ముఖ్యంగా కావలసింది మరియు ముఖ్యమైనది ఆరోగ్య బీమా. అయితే అత్యవసర పరిస్థితికి వచ్చే వరకు ఆరోగ్య బీమాను కలిగి ఉండటం ఎంత ముఖ్యమో గ్రహించలేరు. PhonePe ఇప్పుడు కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని అభివృద్ధి చేసింది. ఇది మొదటిసారి ఆరోగ్య బీమా కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. PhonePe ద్వారా ప్రజలు మూడు సులభమైన దశల్లో బీమాను కొనుగోలు చేస్తారు.

ఆరోగ్య బీమాను అందించే మొదటి పేమెంట్ యాప్ PhonePe. ఇందులో మరొక విశేషమేమిటంటే బీమా పొందడానికి ఎలాంటి ఆరోగ్య పరీక్ష మరియు రిపోర్టు చూపించాల్సిన అవసరం కూడా లేదు. మీ యొక్క పేరు, లింగం, వయస్సు మరియు ఇమెయిల్ ఐడిని పూరించడం ద్వారా మాత్రమే బీమా తీసుకోవచ్చు. రూ.999 ప్లాన్‌లో కస్టమర్‌లు రూ.1 లక్ష వరకు బీమా రక్షణను పొందుతారు. PhonePe లో కొత్తగా ప్రవేశపెట్టిన హెల్త్@999 ప్లాన్ రూ.1,00,000 బీమా రక్షణను అందిస్తుంది.

PhonePe లో రూ.999 ధర వద్ద లభించే ఇన్సూరెన్స్ ప్లాన్ ఆసుపత్రి ఖర్చులకు కవరేజీని అందిస్తుంది. రోగులు ఆసుపత్రిలో ICUలో చేరడం, డేకేర్ విధానాలు, అంబులెన్స్ ఛార్జీలు మరియు ఆయుష్ చికిత్సతో సహా అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. ఈ ప్లాన్ కోసం నగదు రహిత హాస్పిటల్ నెట్‌వర్క్ దేశంలోని 7600 ఆసుపత్రులలో విస్తరించి ఉంది. Health@999ని PhonePe ద్వారా తక్షణమే పొందవచ్చు మరియు ఇది జీవితకాల పునరుద్ధరణ ఫీచర్‌తో వస్తుంది. రూ. 999 ఇన్సూరెన్స్ ప్లాన్ రూ.1,00,000 ఆరోగ్య బీమా కవర్ మొత్తాన్ని అందిస్తుంది. అయితే మీరు బీమా కవర్ మొత్తాన్ని పెంచాలనుకుంటే కనుక Health@1999 ప్లాన్ రూ.2,00,000 బీమా మొత్తాన్ని మరియు Health@2649 ధర వద్ద లభించే మరొక ప్లాన్ రూ.3,00,000 ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందిస్తుంది.
PhonePe నుండి హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే విధానం

** ముందుగా PhonePe యాప్‌ని ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్‌పై ఉన్న బీమా ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
** ఇప్పుడు Health@999 ప్లాన్‌పై నొక్కండి.
** ఆపై మీ యొక్క వయస్సు మరియు ఆరోగ్య బీమాను ఎంచుకోండి.
** దీని తర్వాత మీ యొక్క పూర్తి పేరు, లింగం, పుట్టిన తేదీ మరియు ఇమెయిల్ ఐడిని అందించాలి.
** అన్ని వివరాలను పూరించిన తర్వాత మీరు చెల్లించి పాలసీని పొందవచ్చు.


Click it and Unblock the Notifications








