ఆండ్రాయిడ్ ఫోన్‌లలో DVD, VCD ఫైల్స్‌ను రన్ చేయటం ఎలా..?

స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ ఆవిర్భవించిన నాటినుంచి DVD, VCD వంటి మీడియా ప్లేయర్లకు క్రమంగా ఆదరణ తగ్గుతూ వచ్చింది. VCD డిస్క్‌లలో ఉపయోగించే DAT అనే ఫైల్ ఎక్స్‌టెన్షన్ , DVD డిస్క్‌లలో ఉపయోగించే VOB అనే ఫైల్ ఎక్స్‌టెన్షన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ ఫైల్ ఎక్స్‌టెన్షన్స్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటాయి.

జియో సిమ్ పోయిందా..? బ్లాక్ చేయటం సులభం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

DAT, VOB ఫైల్స్‌..

మరి ఇటువంటి పరిసితుల్లో పాత కాలపు DAT, VOB ఫైల్స్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ప్లే చేయటం సాధ్యమవుతుందా..? వాస్తవానికి, ఆండ్రాయిడ్ డివైస్‌లలో డీఫాల్ట్‌గా అందించే ఆండ్రాయిడ్ ప్లేయర్ ఈ విధమైన ఫైల్ ఫార్మాట్‌లను సపోర్ట్ చేయదు.

కొన్ని ఎక్స్‌టెన్షన్స్‌ ద్వారా...

అయితే, అందుబాటులో ఉన్న కొన్ని ఎక్స్‌టెన్షన్స్‌ ద్వారా DAT, VOB ఫైల్స్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్ లలో రన్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియను ఇప్పుడు చూద్దాం..

MX player, Wondershare player

DAT, VOB ఫైల్స్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ప్లే చేసుకునే క్రమంలో MX player, Wondershare player వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

స్టెప్ 1

మీరు ఒకవేళ Wondershare player యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే, యాప్ ఓపెన్ అయిన వెంటనే రకరకాల ఫోల్డర్స్‌లో మీ ఫోన్‌లోని వీడియో, ఆడియో ఫైల్స్ కనిపిస్తాయి.

స్టెప్ 2

యాప్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కనిపించే మెనూ బటన్ పై క్లిక్ చేయటం ద్వారా సెట్టింగ్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సెట్టింగ్ విండోలో కనిపించే ‘Decoding Mode'ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా యాప్ సపోర్ట్ చేసే అన్నిరకాల ఫైల్ ఫార్మాట్స్ డిస్‌ప్లే కాబడతాయి.

స్టెప్ 3

వాటిలో మీకు కావల్సిన VOB ఫైల్ ఫార్మాట్‌ను సెలక్ట్ చేసుకుని ‘Decoding Mode'ను ‘Auto'లో ఉంచటం ద్వారా మీకు కావల్సిన DVD కంటెంట్ ఆండ్రాయిడ్ డివైస్‌లలో ప్లే అవుతుంది.

DAT ఫైల్స్‌ను ప్లే చేయటం ఎలా..?

VCD డిస్క్‌లలో ఉపయోగించే DAT ఫైల్స్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ప్లే చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా ‘MX Player' యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి, మీ ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ అయిన వెంటనే ప్లేయర్ ఫార్మాట్‌ను బట్టి రకరకాల ఫోల్డర్స్‌లో మీ ఫోన్‌లోని వీడియో, ఆడియో ఫైల్స్ కనిపిస్తాయి. వాటిలో DAT ఫైల్ ఫోల్డర్‌ను ఓపెన్ చేసి కంటెంట్ ను ఆస్వాదించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Play DVD and VCD files on your Android phone. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot