Google Play Storeను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేయడం ఎలా?
గూగుల్ ప్లే స్టోర్ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో లభించే అత్యంత ముఖ్యమైన మరియు మొదటి యాప్ లలో ఒకటి. ఇది ఆండ్రాయిడ్ OS మద్దతు గల యాప్లను ఇన్‌స్టాల్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వీటితో పాటుగా వినియోగదారులకు సినిమాలు చూడటానికి మరియు పుస్తకాలను చదవడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు వారి స్మార్ట్‌ఫోన్‌లలో అవసరమయ్యే కార్యాచరణలను పొందడానికి ఇది గమ్యస్థానం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

స్మార్ట్‌ఫోన్‌లలో ఏదైనా యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఆండ్రాయిడ్ యాప్ లలో గూగుల్ ప్లే స్టోర్ ఒకటి. హువయి లేదా పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో నడుస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో ప్లే స్టోర్ లేకపోతే కనుక కొన్ని పద్దతుల ద్వారా పొందవచ్చు. కాబట్టి మీరు ప్లే స్టోర్ లేని స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తుంటే కనుక దాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎలా ఇంస్టాల్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ప్లే స్టోర్ ను డౌన్‌లోడ్ మరియు ఇన్‌స్టాల్ చేసే పద్ధతులు
స్టెప్ 1: మొదట మీరు తెలియని మూలాల నుండి యాప్ లను డౌన్‌లోడ్ చేయడానికి కార్యాచరణను ప్రారంభించాలి. దీన్ని ప్రారంభించడానికి మొదట > సెట్టింగ్‌ల యాప్ కు వెళ్లండి > సెర్చ్ బాక్స్ లో 'అన్ క్నౌన్ ' అని టైప్ చేయండి> తెలియని యాప్లను ఇన్‌స్టాల్ చేయి ఎంపికపై నొక్కండి> దాన్ని ప్రారంభించండి.
స్టెప్ 2: తరువాత మీరు మీ ఫోన్ యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఇందులో హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ సమాచారం రెండూ ఉంటాయి. Whatdevice.app ని ఓపెన్ చేయడం ద్వారా మీరు ఈ సమాచారాన్ని కనుగొనవచ్చు. Android సంస్కరణ మీ సాఫ్ట్‌వేర్ సమాచారం అయితే, హార్డ్‌వేర్ 'armv80' వంటి వాటి ద్వారా సూచించబడుతుంది.
స్టెప్ 3: తరువాత గూగుల్ అకౌంట్ మేనేజర్ కోసం APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి. మీ OS సంస్కరణకు దగ్గరగా ఉన్న ఫైల్‌ను మాత్రమే డౌన్‌లోడ్ చేయండి.
స్టెప్ 4: తరువాత గూగుల్ సర్వీస్ ఫ్రేమ్ వర్క్ ను డౌన్‌లోడ్ చేయండి. దాని ప్రక్రియ గూగుల్ అకౌంట్ మేనేజర్ మాదిరిగానే ఉంటుంది.

స్టెప్ 5: తరువాత వరుసలో గూగుల్ ప్లే సర్వీస్ ఉన్నాయి. బీటాగా గుర్తించబడని మీ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ కాన్ఫిగరేషన్‌కు దగ్గరగా ఉన్న సంస్కరణను డౌన్‌లోడ్ చేయండి.
స్టెప్ 6: చివరగా గూగుల్ ప్లే స్టోర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. బీటాగా గుర్తించబడని తాజా సంస్కరణను డౌన్‌లోడ్ చేయండి.
స్టెప్ 7: ఇప్పుడు ఈ ఫైళ్లన్నీ డౌన్‌లోడ్ చేయబడిన మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోల్డర్‌కు వెళ్లి ఈ ఫైల్‌లను ఒకే క్రమంలో ఇన్‌స్టాల్ చేయండి: com.google.gsf.login> com.google.android.gsf> com.google.android.gms > com.android.vending.
స్టెప్ 8: ఇన్‌స్టాల్ చేయడం పూర్తి అయిన తరువాత మీ ఫోన్‌ను రీబూట్ చేయడం చాలా మంచిది.


Click it and Unblock the Notifications








