మీ పాత నెంబర్‌తోనే జియోలోకి మారటం ఎలా..?
ఇతర నెట్‌వర్క్‌లకు సంబంధించిన యూజర్లను రాబట్టుకునే క్రమంలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సదుపాయాన్ని జియో ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ఇతర నెట్‌వర్క్‌లకు సంబంధించిన యూజర్లను రాబట్టుకునే క్రమంలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సదుపాయాన్ని జియో ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మొబైల్ నెంబర్ పోర్టబులిటీకి ద్వారా ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్, ఐడియా వంటి ప్రముఖ నెట్‌వర్క్‌ల యూజర్లు రిలయన్స్ జియోలోకి మారిపోయే అవకాశముంది.
Read More : 1జీబి లిమిట్ దాటినా జియో స్పీడ్ తగ్గకుండా ఉండాలంటే..?

ఇప్పటికిప్పుడు జియోలోకి మారటం వల్ల..
మీ పాత మొబైల్ నెంబర్‌తో ఇప్పటికిప్పుడు జియోలోకి మారటం వల్ల "Jio Happy New Year offer" మీకు లభిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా మార్చి 31 2017 వరకు జియో 4జీ సేవలను ఉచితంగా ఆస్వాదించే అవకాశం మీకు లభిస్తుంది. ఈ ఆఫర్ పిరియడ్ పూర్తి అయిన తరువాత 1జీబి డేటాకు రూ.50 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. వాయిస్ కాలింగ్ పూర్తి ఉచితం.

ఎంఎన్‌పీ ద్వారా రిలయన్స్ జియోలోకి మారేందుకు ఇలా చేయండి...
స్టెప్ 1
మీ మొబైల్ నెంబర్ నుంచి పోర్ట్ (port) అని టైప్ చేసి కొంత స్పేస్ ఇచ్చి బ్రాకెట్లో మీ మొబైట్ నెంబర్‌ని జత చేసి 1900కి ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఎనిమిది అంకెల యూనిక్ పోర్టింగ్ కోడ్ మీ మొబైల్‌కు సందేశం రూపంలో
అందుతుంది.

స్టెప్ 2
ఈ కోడ్ ఆధారంగా మీ సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్ లేదా ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌ను సంప్రదించి సంబంధిత అప్లికేషన్‌లను పూరించాల్సి ఉంటుంది.

స్టెప్ 3
సిమ్ యాక్టివేషన్ ప్రక్రియలో భాగంగా మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఇతర ధృవీకరణ ప్రతాలను జియో ప్రతినిధులకు సమర్పించాల్సి ఉంది. మీరు వాడుతున్నది తప్పనిసరిగా 4జీ ఫోన్ అయి ఉండాలి.

స్టెప్ 4
ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే Jio Welcome ఆఫర్‌తో కూడిన జియో 4జీ సిమ్ కార్డ్ మీకు అందుతుంది. జియో సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే మీరు ఇప్పటికే వాడుతున్న నంబర్ నెట్‌వర్క్ కట్ అయిపోతుంది.

స్టెప్ 5
జియో సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే మీరు ఇప్పటికే వాడుతున్న నెంబర్ నెట్‌వర్క్ కట్ అయిపోతుంది. అలా జరిగిన వెంటనే మీ జియో సిమ్ యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అయిన జియో సిమ్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయటం ద్వారా "Jio Happy New Year offer"ను మార్చి 31 వరకు ఎంజాయ్ చేయవచ్చు. దీని కన్నా ముందు యూజర్లు టెలీ వెరిఫికేషన్ ద్వారా మీ వివరాలను వెరిఫై చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








