Home
How to

మీ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్ పని చేయట్లేదా.. ఐతే ఈ 6 సింపుల్ ట్రిక్స్ మీకోసమే!

Power button: స్మార్ట్‌ఫోన్లు ఈ రోజుల్లో మన లైఫ్‌లో ఎంత ముఖ్యమో చెప్పక్కర్లేదు. కమ్యూనికేషన్ నుంచి పని వరకు, ఎంటర్‌టైన్‌మెంట్ వరకు అన్నీ వాటితోనే. కానీ ఒక్కోసారి ఫోన్ పవర్ బటన్ మొరాయిస్తుంది. అప్పుడు ఫోన్ ఆన్ చేయాలన్నా, స్క్రీన్ లాక్ తీయాలన్నా చాలా చిరాకుగా ఉంటుంది. కానీ పవర్ బటన్ లేకుండానే స్క్రీన్‌ని టర్న్ ఆన్ చేసి, మీ ఫోన్‌ని యథావిధిగా వాడేందుకు కొన్ని ఈజీ ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దామా.

* డబుల్ ట్యాప్‌తో స్క్రీన్ ఆన్ చేయొచ్చు

చాలా స్మార్ట్‌ఫోన్లలో "డబుల్ ట్యాప్ టు వేక్" అనే ఉపయోగకరమైన ఫీచర్ ఉంటుంది. అంటే స్క్రీన్ మీద రెండుసార్లు ట్యాప్ చేస్తే చాలు, ఫోన్ స్క్రీన్ లైట్ వెలుగుతుంది. దీన్ని ఆన్ చేయడానికి ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ లాక్ స్క్రీన్ & వాల్‌పేపర్ లేదా డిస్‌ప్లే సెట్టింగ్స్ అని ఉంటుంది.

Power Button Not Working  Here Are Simple Ways to Unlock and Use Your Phone

దాన్ని ఓపెన్ చేయాలి. అందులో స్మార్ట్ స్క్రీన్ ఆన్/ఆఫ్ లేదా ట్యాప్ టు వేక్ ఆప్షన్ కోసం వెతకాలి. దాన్ని ఆన్ చేసేయాలి. అంతే, స్క్రీన్‌పై డబుల్ ట్యాప్ చేస్తే చాలు, ఫోన్ వెంటనే ఆన్ అవుతుంది. అయితే మొదటగా అసలు స్క్రీన్ ఆన్ అయి ఉంటేనే కదా ఈ సెట్టింగ్స్ మార్చగలం అని అనుకోవచ్చు.

అయితే స్క్రీన్ ఆన్ చేయడానికి ఇంకో మొబైల్ నుంచి మిస్ కాల్ ఇస్తే చాలు ఆన్ అయిపోతుంది. ఆపై పైన చెప్పిన స్టెప్స్ ఫాలో అయిపోతూ "డబుల్ ట్యాప్ టు వేక్" ఫీచర్ ఆన్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని పవర్ బటన్ పాడు కాకముందే ముందు జాగ్రత్తగా ఆన్ చేసుకొని ఉంటే భవిష్యత్తులో తలనొప్పులు తగ్గుతాయి.

* వాల్యూమ్ బటన్లతో స్క్రీన్ ఆన్

కొన్ని ఫోన్లలో వాల్యూమ్ బటన్లతో కూడా స్క్రీన్ ని వెలిగించొచ్చు. అది ఎలాగంటే, మళ్లీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి, అందులో "యాక్సెసిబిలిటీ లేదా బటన్ & జెస్చర్స్" సెట్టింగ్స్‌కి వెళ్లాలి. అక్కడ వేక్ స్క్రీన్ విత్ వాల్యూమ్ బటన్స్ అనే ఆప్షన్ కోసం చూడాలి. దొరికితే వెంటనే దాన్ని ఆన్ చేసేయాలి.

ఇప్పుడు వాల్యూమ్ బటన్స్ నొక్కితే చాలు, మీ ఫోన్ స్క్రీన్ వెంటనే వెలుగుతుంది. పవర్ బటన్ లేకపోయినా పర్లేదు. ఒకవేళ ఈ పద్ధతి గందరగోళంగా అనిపించినా మీరు నిరాశ పడక్కర్లేదు. ఇంకా చాలా సులభమైన పద్ధతిలో ఉన్నాయి. వీటితో స్క్రీన్ ఆన్ చేయడం ఎంత ఈజీగా మాటల్లో చెప్పలేం. కింద ఆ పద్ధతులు ఉన్నాయి. చూసేయండి.

* ఛార్జర్ పెడితే చాలు

ఒకవేళ మీ ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోతే, పవర్ బటన్ పని చేయకపోతే, ఏం చేయాలో తెలుసా సింపుల్ గా ఛార్జర్ పెట్టేయండి. చాలా ఫోన్లు ఛార్జర్ పెట్టిన వెంటనే ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. ఒకవేళ వెంటనే ఆన్ అవ్వకపోతే, కాసేపు ఛార్జింగ్‌లో ఉంచండి. ఆ తర్వాత మిగతా ట్రిక్స్ ట్రై చేయొచ్చు.

* ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్‌తో ఈజీ

మీ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లేదా ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ ఉంటే, వాటిని సెట్టింగ్స్‌లో ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే పవర్ బటన్ లేకుండానే మీ ఫోన్‌ని అన్‌లాక్ చేయొచ్చు. ఫింగర్ పెట్టినా లేదా ఫేస్ చూపించినా చాలు, ఫోన్ అన్‌లాక్ అయిపోతుంది. స్మార్ట్ అన్‌లాకింగ్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు.

* షెడ్యూల్డ్ పవర్ ఆన్/ఆఫ్ - టైమ్ సెట్ చేసుకోవాలి

కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో షెడ్యూల్డ్ పవర్ ఆన్/ఆఫ్ అనే ఫీచర్ ఉంటుంది. అంటే మీ ఫోన్ ఎప్పుడు ఆన్ అవ్వాలో టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఇది ఎలానో చూద్దాం. ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి, బ్యాటరీ లేదా అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ ఆప్షన్స్ కోసం వెతకాలి.

అందులో షెడ్యూల్డ్ పవర్ ఆన్/ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి, మీ ఫోన్ ఎప్పుడు ఆన్ అవ్వాలో టైమ్ సెట్ చేసుకోండి. మీరు సెట్ చేసిన టైమ్‌కి మీ ఫోన్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. పవర్ బటన్ పడిపోయిందనే ఆందోళన ఇక వద్దు.

* థర్డ్-పార్టీ యాప్స్ కూడా ఉన్నాయి

ఇవే కాకుండా, ప్లే స్టోర్‌లో చాలా యాప్స్ ఉన్నాయి. గ్రావిటీ స్క్రీన్ లేదా పవర్ బటన్ టు వాల్యూమ్ బటన్ లాంటి యాప్స్ మీ స్క్రీన్ ని ఆన్ చేయడానికి లేదా పవర్ బటన్ పనితీరును వేరే బటన్లకు మార్చడానికి సహాయం చేస్తాయి. కావాలంటే ఈ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ట్రై చేయొచ్చు.

Best Mobiles in India

English summary
Power button broken, No worries. Use double tap, volume buttons, charger, fingerprint, face unlock, scheduled power, or apps to wake and unlock your phone easily.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X