పవర్ బటన్ పనిచేయడం లేదా, అయితే ఇలా చేయండి
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. అది లేకుండా ఒక్క క్షణం కూడా లేని స్థితికి జనాలు వచ్చారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తరువాత ఈ స్మార్ట్ ఫోన్ల వినియోగం పతాక స్థాయిక
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. అది లేకుండా ఒక్క క్షణం కూడా లేని స్థితికి జనాలు వచ్చారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తరువాత ఈ స్మార్ట్ ఫోన్ల వినియోగం పతాక స్థాయికి చేరింది. ఇంతలా బానిసలుగా మారిపోయారు. స్మార్ట్ ఫోన్ ఏదైనా సమస్య వచ్చి పనిచేయడం మానేస్తే ఏంచేయాలో దిక్కు తోచని పరిస్థితి.

రిపేర్ షాపులకు పరుగులు పెడతాం. పవర్ బటన్ పనిచేయడం మానేసినా కూడా స్మార్ట్ ఫోన్ వాడటం కష్టమైపోతూ ఉంటుంది. అయితే పవర్ బటన్ పనిచేయకుంటే కొన్ని ట్రిక్స్ ద్వారా మన ఫోన్ ని వాడుకోవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం.

ఫింగర్ ప్రింట్ స్కానర్
ఈ రోజుల్లో ప్రతి స్మార్ట్ ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. కాబట్టి పవర్ బటన్ పనిచేయకపోయినా ఫరవాలేదు. మీరు పింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ఫోన్ లాక్ తీయవచ్చు. వాడుకోవచ్చు.

gesture-based features
మీరు మీ స్మార్ట్ ఫోన్ ని గ్వెశ్చర్ బేస్ డ్ ఫీచర్స్ ద్వారా కూడా ఫోన్ లాక్ తీయవచ్చు. మీ సెట్టింగ్స్ లో కెళ్లి ఈ ఫీచర్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీ స్క్రీన్ లాక్ తీసుకోవచ్చు.

ధర్డ్ పార్టీ యాప్స్
గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి కొన్ని ధర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు మీ ఫోన్ లాక్ తీయవచ్చు. పవర్ బటన్ టూ వాల్యూమ్ బటన్ ద్వారా ఓపెన్ చేసుకునే విధంగా కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే Gravity Screen, Proximity actions వంటివి కూడా ఈ లాక్ తీయడానికి ఉపయోగపతాయి.

Trial and error method
ఛార్జింగ్ నోటిఫికేషన్ సమయంలో డిస్ ప్లే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సమయాల్లో అలారం సెట్ చేసుకోవడం ద్వారా కూడా స్కీన్ ఒపెన్ చేయవచ్చు. కొన్ని సంధర్భాల్లో ఫోన్ స్విచ్చాఫ్ అయినప్పుడు అలారం టర్న్ ఆన్ చేయడం ద్వారా స్మార్ట్ ఫోన్ ఆటోమేటిగ్గా ఆన్ అవుతుంది


Click it and Unblock the Notifications








