వాట్సాప్ స్టేటస్‌లోని ఫోటోలు, వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

|

వాట్సాప్ ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు ఇప్పుడు ఇది ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా కూడా మారింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ అనే ఫీచర్ ను జోడించిన తరువాత వాట్సాప్ కూడా వాట్సాప్ స్టేటస్ అనే స్టోరీస్ ఫంక్షన్‌ను జోడించింది. వాట్సాప్ లోని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ స్టేటస్లను కేవలం 24 గంటలలో మాత్రమే చూడడానికి అవకాశం ఉంటుంది.

వాట్సాప్ స్టేటస్
 

ప్రజలు ఈ వాట్సాప్ స్టేటస్ లలో తమ సొంత ఫోటోలను షేర్ చేయడమే కాకుండా కొన్నిసార్లు తమకు నచ్చిన పాటను లేదా వీడియోను కూడా వారి వాట్సాప్ స్టేటస్‌గా పోస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది తమ వాట్సాప్ స్టేటస్‌లో కూడా ఇదే వీడియోను లేదా పాటను పోస్ట్ చేయాలనుకుంటున్నారు లేదా షేర్ చేయాలనుకుంటున్నారా? దురదృష్టవశాత్తు వాట్సాప్ ఈ స్టేటస్‌లను డౌన్‌లోడ్ చేయడానికి వినియోగదారులకు అవకాశం ఇవ్వదు. కాబట్టి మీరు వాట్సాప్ స్టేటస్‌లోని ఫోటోలు మరియు వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోవడానికి కింద వున్న పద్దతులను పాటించండి.

డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లో PhonePe రికార్డ్

మెథడ్ 1: ఫైల్ మేనేజర్

మెథడ్ 1: ఫైల్ మేనేజర్

ఈ ఫోటోలు మరియు వీడియోలు తాత్కాలికంగా ఎక్కడ సేవ్ చేస్తాయో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఈ మీడియా ఫైళ్లు మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ ఫోల్డర్‌లో స్టోర్ చేయబడతాయి. అయితే వాట్సాప్ యాప్ లో స్టేటస్ 24-గంటలు మాత్రమే అనుబాటులో ఉండడం వలన ఈ మీడియా ఫైల్‌లు కూడా 24 గంటల వ్యవధి తర్వాత అదృశ్యమవుతాయి. మీరు ఆ ఫైల్‌లను యాక్సెస్ చేయడానికి కింద వున్న పద్దతులను పాటించండి.

కనీస రీఛార్జ్ విధానాన్ని కొనసాగిస్తున్న టెల్కోలు

వాట్సాప్
 

* వాట్సాప్ ఓపెన్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న వాట్సాప్ స్టేటస్‌ను ఒకసారి చూడండి.

* ఇప్పుడు ఫైల్ మేనేజర్ యాప్ ను ఓపెన్ చేయండి. ఒకవేళ మీ ఫోన్‌లో ఇది లేకపోతే మీరు Google Play స్టోర్ నుండి "గూగుల్ ఫైల్‌లను" డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* మీ ఫైల్ మేనేజర్ యాప్ యొక్క సెట్టింగ్‌ల పేజీలో కనిపించే "షో హిడెన్ ఫైల్‌లను" ఎంపికను ప్రారంభించండి.

* మీ ఫోన్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ కు వెళ్ళండి. అక్కడ "వాట్సాప్" అనే ఫోల్డర్ కోసం చూడండి.

* ఇక్కడ మీడియా> స్టేటస్‌లకు వెళ్లండి.

ఈ ఫోల్డర్‌లో మీరు గత 24 గంటల్లో చూసిన అన్ని వాట్సాప్ స్టేటస్‌ల వీడియోలు మరియు ఫోటోలను చూడవచ్చు. ఇప్పుడు మీకు కావలసిన ఫోటో లేదా వీడియోను కాపీ చేసి ఇంటర్నల్ స్టోరేజ్ లోని మరొక ఇతర ఫోల్డర్‌లో సేవ్ చేసుకోవచ్చు.

మెథడ్ 2: స్టేటస్‌ సేవ్ యాప్స్

మెథడ్ 2: స్టేటస్‌ సేవ్ యాప్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో వాట్సాప్ కోసం స్టేటస్ సేవర్ లేదా స్టేటస్ సేవర్ అని లేబుల్ చేయబడిన అప్లికేషన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాప్ లను డౌన్‌లోడ్ చేసుకోని ఏదైనా వాట్సాప్ వీడియోలు లేదా ఫోటోలను సేవ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఏదేమైనా అటువంటి యాప్ ల యొక్క ఇబ్బంది ఏమిటంటే ఇవి అనేక టన్నుల ప్రకటనలతో వస్తాయి.

మెథడ్ 3:స్క్రీన్ షాట్ మరియు స్క్రీన్ రికార్డ్

మెథడ్ 3:స్క్రీన్ షాట్ మరియు స్క్రీన్ రికార్డ్

వాట్సాప్ ఇమేజ్ లలో కనిపించే ఏవైనా ఫోటోలను స్క్రీన్ షాట్ తీయడం ద్వారా వాటిని సులభంగా సేవ్ చేసుకోవచ్చు. అయితే వీడియోల విషయానికి వస్తే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు స్థానిక స్క్రీన్ రికార్డర్‌లతో వస్తున్నాయి కాబట్టి మీరు వాటిని మీ స్క్రీన్‌ను రికార్డ్ చేయడానికి మరియు వీడియోను మీ యొక్క స్టేటస్ లో చూపించే విధంగా ట్రిమ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే మీ స్మార్ట్‌ఫోన్ స్థానిక స్క్రీన్ రికార్డర్‌తో రాకపోతే అటువంటి యాప్ లను గూగుల్ ప్లే స్టోర్‌ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Procedure to save WhatsApp Status Videos and Photos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X