ఐక్లౌడ్ ద్వారా డెలిట్ చేసిన ఫైళ్లను తిరిగి పొందడం ఎలా?

|

iCloud అనేది ఆపిల్ డివైస్ ల యొక్క ప్రాధమిక ఆన్‌లైన్ స్టోరేజ్ పరిష్కారం. కొన్ని సమయాల్లో మనం అనుకోకుండా ఒక ఫైల్‌ను డెలిట్ చేయబోయి మరొక దానిని డెలిట్ చేస్తువుంటాము లేదా ఏదో ఒక కారణం చేత అది iCloud నుండి డెలిట్ చేయబడింది అనుకోండి అటువంటి పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. చాలా కష్టంగా ఉంది కదా! డెలిట్ అయిన ఫైల్ తప్ప మరొక దారి లేనప్పుడు అన్న పరిస్థితిని తలుచుకోవడం చాలా కష్టం.

 

డెలిట్ విభాగం

ఇప్పుడు దానికి పరిష్కారంగా ఒక శుభవార్తను అందిస్తోంది. ఆపిల్ ఐక్లౌడ్ నుంచి తొలగించిన అన్ని ఫైళ్ళను డెలిట్ విభాగంలో 30 రోజుల పాటు ఉంచుతుంది. ఇది వినియోగదారులు అనుకోకుండా తొలగించిన వాటిని తిరిగి పొందటానికి అనుమతిస్తుంది. కాకపోతే వీటిని కొంత నిర్దిష్ట కాలం వరకు మాత్రమే తిరిగి పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Airtel Digital TV లాంగ్ టర్మ్ ప్యాక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లుAirtel Digital TV లాంగ్ టర్మ్ ప్యాక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు

బ్రౌజర్‌
 

డెలిట్ చేయబడిన వాటిని తిరిగి పొందడానికి వినియోగదారుడికి Mac, iPad లేదా బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేసిన ఏదైనా ఒక డివైస్ అవసరం కావాలి. ఈ రోజుల్లో ప్రతి కంప్యూటింగ్ డివైస్ దాదాపు ఆచరణాత్మకంగా బ్రౌజర్‌తో వస్తుంది. మరొక ముఖ్యమైన అవసరం ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇది లేకుండా ఫైళ్లను తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. కాబట్టి తొలగించబడిన ఏదైనా ఫైల్‌ను ఐక్లౌడ్ నుండి ఎలా తిరిగి పొందాలో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్ధతులు పాటించండి.

 

Infinix Hot 8 Price Cut: RS.2000 తగ్గింపుతో ఇన్ఫినిక్స్ హాట్ 8 సేల్స్... త్వరపడండిInfinix Hot 8 Price Cut: RS.2000 తగ్గింపుతో ఇన్ఫినిక్స్ హాట్ 8 సేల్స్... త్వరపడండి

డివైస్

- మీరు తీసుకున్న ఏదైనా డివైస్(మాక్, ఐప్యాడ్) వంటి వాటిలో మొదటిగా వెబ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి.

- అందులో ICloud.com ను ఓపెన్ చేసి ఆపిల్ యొక్క లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.

- లాగిన్ అయిన తర్వాత ఎగువవైపున ఉన్న అకౌంట్ పేరు క్రింద ఉంచిన 'అకౌంట్ సెట్టింగ్స్' పై క్లిక్ చేయండి.

- తరువాత అందులో గల 'అడ్వాన్స్' విభాగంలోకి వెళ్లి అక్కడ నుండి 'రిస్టోర్ ఫైల్స్' ఎంపికను క్లిక్ చేయండి.

- ఇటీవల మీరు డెలిట్ చేసిన అన్ని ఫైల్‌లతో ఐక్లౌడ్ లోడ్ అయ్యే వరకు వేచి ఉండండి.

 

ఆన్‌లైన్‌ ద్వారా ఇ-పాన్ పొందడం ఎలా?ఆన్‌లైన్‌ ద్వారా ఇ-పాన్ పొందడం ఎలా?

రిస్టోర్

- ఇక్కడ ఫైళ్ళను రిస్టోర్ చేయడానికి ఒక వ్యక్తిగత ఫైళ్ళను ఎంచుకోండి లేదా అన్ని చెక్ బుక్ ను ఎంచుకోండి.

- వాటిని ఎంచుకున్న తరువాత 'రిస్టోర్' బటన్ క్లిక్ చేసి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండండి.

- ప్రక్రియ మొత్తం పూర్తయింది అని నిర్దారణ చేసుకున్న తర్వాత ప్రక్రియను పూర్తి చేయడానికి 'Done' బటన్ పై క్లిక్ చేయండి.

- ఒకవేళ మీరు iOS లేదా iPadOS డివైస్ ను ఉపయోగిస్తుంటే కనుక తొలగించిన ఫైల్‌లను రిస్టోర్ చేయడానికి ఫైల్స్ యాప్ క్రింద 'రీసెంట్లీ డెలిటెడ్' విభాగానికి వెళ్ళండి.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Process To Recover Lost Files From iCloud

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X