మీ పాస్‌వర్డ్‌లు సీక్రెట్‌గా ఉండాలంటే..?

ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల ఆగడాల తలబొప్పి కట్టిస్తున్నాయి. ఇటీవల హ్యాకింగ్‌కు గురైన 6 మిలియన్‌లు లింకిడిన్ అకౌంట్ల ఉదంతాన్ని మరవక ముందే సైబర్ క్రిమినల్స్ బృందం 450,000 యాహూ అకౌంట్‌లను హ్యాక్ చేసింది. ఆన్‌లైన్ ద్వారా అలజడి సృష్టిస్తున్న ఈ సైబర్ క్రిమినల్స్ రేపు మీ ఆకౌంట్ల పైనా దాడికి పాల్పడే అవకాశముంది. ఈ విధమైన దాడుల నుంచి మీ ఆకౌంట్‌లను రక్షించుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మీ పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుకునేందుకు పలు చిట్కాలు.
మీకున్న అన్ని అకౌంట్‌లకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించకుండా వేరు వేరు పాస్‌వర్డ్‌లను కేటాయించండి. లావాదేవీలు ముగియగానే ఆకౌంట్‌ను సైన్ అవుట్ చెయ్యటం మరవద్దు. యాంటీ వైరస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండండి. లైబ్రరీ, ఇంటర్నెట్ కేఫ్ వంటి ప్రాంతాల్లో మీ అకౌంట్ లను ఓపెన్ చేయకండి, ఒక వేళ చెయ్యాల్సి వస్తే పనిముగియగానే సైన్ అవుట్ చెయ్యటం మరవద్దు, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. మీ పాస్‌వర్డ్‌ను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. గోప్యత పాటించండి. భద్రతలేని వైఫై కనెక్షన్లను ఉపయోగించే సమయంలో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయకండి. పాస్‌వర్డ్‌లను సంవత్సరానికి ఒకసారైనా మార్చటం అవసరం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications