PUBG: న్యూ స్టేట్ గేమ్ ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?

|

PUBG మొబైల్ గేమ్ యొక్క న్యూ స్టేట్ ప్రీ-రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇండియాలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోను ఈ ప్రీ-రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంది. ప్రముఖ BR టైటిల్ యొక్క కొత్త వెర్షన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇది ఇప్పుడు భారతీయ గేమింగ్ కమ్యూనిటీలోకి ప్రవేశిస్తోంది. PUBG గేమ్ యొక్క డెవలపర్ల ప్రకారం గేమ్ యొక్క న్యూ స్టేట్ ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారుల కోసం ఫ్రీమియం గేమ్‌గా ప్రారంభిస్తుందని పేర్కొన్నాడు. ఈ గేమ్ ప్రారంభమైనప్పటి నుండి ఇండియా, చైనా మరియు వియత్నాంలలోని వినియోగదారులను మినహాయించి ప్రపంచవ్యాప్తంగా 32 మిలియన్లకు పైగా ప్రీ-రిజిస్ట్రేషన్‌లను ఈ గేమ్ గ్రహించింది.

ఆండ్రాయిడ్, మరియు iOS లో PUBG: న్యూ స్టేట్ ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?

ఆండ్రాయిడ్, మరియు iOS లో PUBG: న్యూ స్టేట్ ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?

** PUBG గేమ్ మీద ఆసక్తి ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ కి వెళ్లి ముందుగా PUBG: న్యూ స్టేట్ ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం సెర్చ్ చేయవచ్చు.

** తరువాత 'ప్రీ-రిజిస్టర్' బటన్‌ని నొక్కండి. మీరు నోటిఫై ఆప్షన్‌పై టిక్ చేయమని ప్రాంప్ట్ చేయబడతారు.

** తరువాత 'అందుబాటులో ఉన్నప్పుడు ఇన్‌స్టాల్ చేయండి' ఎంపికను ఎంచుకోండి. ఇది లాంచ్ అయినప్పుడు స్థిరమైన బిల్డ్‌ని ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేస్తుంది.

** ముఖ్యంగా PUBG గేమ్ Wi-Fi తో కనెక్ట్ చేయబడిన పరికరాల్లో కూడా స్వయంచాలకంగా ఇన్‌స్టాల్ చేయబడుతుంది. ఇన్‌స్టాల్ విజయవంతమైన తర్వాత ఆటగాళ్లు శాశ్వత పరిమిత వాహన స్కిన్ పొందుతారు.

 

PUBG: న్యూ స్టేట్ - మార్పులు

PUBG: న్యూ స్టేట్ - మార్పులు

PUBG: న్యూ స్టేట్ ఆధునిక కాలంలో సెట్ చేయబడిన వనిల్లా టైటిల్‌ను దాటి 2051 సంవత్సరాలలో సెట్ చేయబడుతుంది. ఈ గేమ్ ఒక రిఫ్రెష్ మ్యాప్ ట్రాయ్‌ని తీసుకువస్తుంది మరియు భవిష్యత్ ఆయుధాలు, డ్రోన్‌లతో సహా వాహనాలు మరియు విస్తరించదగిన పోరాట కవచాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త వెర్షన్ గేమ్ లో సరికొత్త అప్ డేట్ ఎంపికలను తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఇది ఆటగాళ్లు తమ ఆయుధాలను పోరాటంలో సవరించడానికి అనుమతిస్తుంది.

PUBG: న్యూ స్టేట్ ఫీచర్స్

PUBG: న్యూ స్టేట్ ఫీచర్స్

PUBG: న్యూ స్టేట్ యొక్క రెండవ ఆల్ఫా టెస్ట్ ఆఖరిదశలో ఉంది. IOS ఆల్ఫా టెస్టర్‌ల కోసం ప్రీ-డౌన్‌లోడ్‌లు టెస్ట్‌ఫ్లైట్‌లో మళ్లీ ఓపెన్ చేయబడ్డాయి. రెండవ పరీక్షకు ఎంపికైనవారిని క్రాఫ్టన్ ఇప్పటికే ప్రకటించింది. ప్రముఖ BR టైటిల్ యొక్క భవిష్యత్తు వెర్షన్ ఈ ఏడాది చివర్లో రెండు ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.

PUBG

ఇండియాలోని వినియోగదారుల యొక్క డేటాను మరియు ప్రైవసీను లీక్ చేస్తున్నట్లు వంటి సమస్యల దృష్ట్యా PUBG మొబైల్ ఇండియాను 2020 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం నిషేధించిందని గమనించాలి. PUBG మొబైల్ ఇండియా పునప్రారంభం గురించి PUBG డెవలపర్లు ఇంకా అధికారిక ప్రకటన చేయకపోగా PUBG మొబైల్ ఇండియా త్వరలో పేరును మార్చుకొని తిరిగి ప్రారంభించబడుతుందని ఉహాగానాలు చెలరేగుతున్నాయి. లింక్డ్ఇన్లో సంస్థ నిరంతరం ఉద్యోగ జాబితాలను వదులుతున్న కారణంగా చుస్తే కనుక ఈ గేమ్ తిరిగి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
PUBG: New State Game Pre-Registration Process Step by Step on Android, iOS

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X