PUBG మొబైల్ లో గాడ్జిల్లా దుస్తులను ఎలా పొందాలి?
పబ్‌జి మొబైల్ గేమ్ క్రొత్త బహుమతి ఈవెంట్‌తో మళ్ళీ తిరిగి వచ్చింది. దీనిలో వారు అద్భుతమైన దుస్తులను, క్రేట్ మరియు దుస్తుల పెట్టెను ఉచితంగా ఇస్తున్నారు. WeGame అనేది PUBG MOBILE యొక్క ఉచిత అఫీసియల్ టూల్ ఇప్పుడు ఇది భారతదేశంలో అందుబాటులో ఉంది.

ఈ APP ద్వారా PUBG వేగంగా నడుస్తుంది మరియు మీ PUBG గణాంకాలను వీక్షించవచ్చు మరియు విశ్లేషించవచ్చు కూడా. అలాగే మీరు సీజన్ యొక్క ప్రొఫైల్ గణాంకాలను చూడవచ్చు మరియు మీ స్నేహితుడి ప్రొఫైల్‌ను ట్రాక్ చేయవచ్చు. అసలు మీకు లభించే బహుమతులు ఏమిటి? ఈ రివార్డులను ఎలా పొందాలి? తెలుసుకోవాలంటే కింద చదవండి.

పబ్‌జి మొబైల్ యొక్క ఉచిత బహుమతులు:
ఈవెంట్‌లో పాల్గొనడం ద్వారా మీరు గెలుచుకోగల మూడు బహుమతులు
* గాడ్జిల్లా యొక్క కారపేస్
* PUBG క్రేట్ కూపన్
* అవుట్ ఫిట్ బాక్స్ III ఈ బహుమతులు పొందే దశలు క్రింద ఇవ్వబడ్డాయి.

WeGame యాప్ ద్వారా పబ్‌జి మొబైల్ రివార్డులను పొందే దశలు:
1. మొదటగా WeGame యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోని ఇన్‌స్టాల్ చేసుకోండి. WeGameను ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ కి అన్ని అనుమతులను ఇవ్వండి.
3. అప్పుడు మీరు ఖాతాలోకి లాగిన్ అవ్వమని అడుగుతుంది. గెస్ట్ లాగిన్ లేదా ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు.
4. సైన్ ఇన్ చేసిన తర్వాత దిగువభాగం పట్టీలోని చాట్ విభాగానికి వెళ్లండి.
5. ఈ క్రొత్త కార్యక్రమానికి సంబంధించి మీరు PUBG బడ్డీ నుండి ఒక మెసేజ్ ని చూస్తారు.
6. చాట్ ను ఓపెన్ చేసి దిగువభాగంలోని కుడివైపు మూలలో ఉన్న" ఫ్రీ గిఫ్ట్" మీద క్లిక్ చేయండి.
7. దీని తరువాత మీ PUBG మొబైల్ రోల్ (ప్రొఫైల్) ను WeGame యాప్ కి లింక్ చేయమని అడుగుతుంది లింక్ చేయండి.
8. మీ ప్రొఫైల్‌ను లింక్ చేసిన తర్వాత మీకు రివార్డులను క్లెయిమ్ చేయాల్సిన బ్యానర్ కనిపిస్తుంది.
9. "గెట్ థేమ్" ఎంపికపై క్లిక్ చేయండి. రివార్డులు మీ PUBG మొబైల్ జాబితాకు పంపబడతాయి.

పైన తెలిపిన సాధారణ దశలను అనుసరించడం ద్వారా మీరు ఈ బహుమతులను కూడా పొందవచ్చు.అంతేకాకుండా మీ స్నేహితుల ముందు ప్రదర్శించవచ్చు కూడా. కాబట్టి ఈవెంట్ ముగిసేలోపు తొందరపడండి ఈ రివార్డులను క్లెయిమ్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








