కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

'నాకు ఏ ఫోన్ బాగుంటుంది. ఆండ్రాయిడ్ ఫోనా లేకా మరేదైనానా..?' కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసే విషయంలో చాలా మందిలో నెలకునే సందిగ్థత ఇదే.

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని మార్కెట్లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు భారీ డిస్కౌంట్‌ల పై సిద్ధంగా ఉన్నాయి. ఊరించే ఆఫర్లతో కళ్ల ముందు కనిపిస్తున్న డజన్ల కొద్ది స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌లో ఏ ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారా..?

ఈ 15 ఫోన్‌లు సగం రేట్లకే!

మీ 'వే ఆఫ్ ఇంట్రస్ట్' అలానే బడ్జెట్ రేంజ్‌కు అనుగుణంగా ఓ స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు ఈ 10 ప్రశ్నలను మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోండి. అవేంటో చూసేద్దామా మరి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

ఈ ప్రశ్నకు సమధానం చాలా ఈజీగా దొరికేస్తుంది. ఎందుకంటే..?, సౌకర్యాల దృష్ట్యా ఈ రోజుల్లో ఎవరైనా సరే స్మార్ట్‌ఫోన్‌నే కోరుకుంటారు. వందలు కొద్ది ఫీచర్లు, బెటర్ ఇంటర్నెట్ కనెక్టువిటీ, కెమెరా, పెద్దదైన డిస్‌ప్లే, స్టోరేజ్ మెమరీ వంటి ప్రత్యేకతలు స్మార్ట్‌ఫోన్ సొంతం. ఫీచర్ ఫోన్‌లలో కాల్స్ రిసీవ్ చేసుకుంటం తప్ప ఏముంటుంది చెప్పిండి. కాబట్టి, మీ ప్రిఫరెన్స్ స్మార్ట్‌ఫోన్‌కే ఇవ్వటం బెటర్.

 

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

మీరు ఎంపిక చేసుకునే ఫోన్ డిజైన్ ముందు చూడటానికి కంఫర్ట్ గా ఉండాలి. పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. అదే సమయంలో మన్నిక కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా అవుట్ డోర్ వాతావరణాలను మీ ఫోన్ తట్టుకునేంత సామర్థ్యాలను కలిగి ఉండాలి. వాటర్ రెసిస్టెంట్ కూడా అవసరం.

 

 

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

ఏ ఆపరేటింగ్ సిస్టం అయితే బాగుంటుంది..?

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ ఆండ్రాయిడ్ మొదటి స్థానంలో ఉంటే యాపిల్ ఐఓఎస్ రెండవ స్థానంలో ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్ ఫోన్ లు యూజర్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో సులువైన స్మార్ట్ మొబైలింగ్‌ను మీకు చేరువచేస్తాయి. మరోవైపు యాపిల్ ఐఓఎస్ పై స్పందించే ఐఫోన్‌లు ప్రొఫెషనల్ క్వాలిటీ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో ఆకట్టుకుంటాయి. అయితే యాపిల్ ఐఫోన్‌లు కాస్తంత ఖరీదెక్కువ. ఇవే కాకుండా మార్కెట్లో బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో వేటి ప్రత్యేకత వాటికే ఉంది. కాబట్టి ఆపరేటింగ్ సిస్టం ఎంపిక విషయంలో తుది నిర్ణయం మీదే.

 

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లు యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్‌‌ను చేరువ చేస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఫోన్‌లలో టెక్స్టింగ్ కొంచం ఇబ్బందిగా ఉంటుంది. మీరు టెక్స్టింగ్ కోసమే స్మార్ట్‌ఫోన్‌ను కొంటున్నట్లయితే మీ కోసం క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

 

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

కెమెరా ఎంతుంటే బాగుంటుంది..?

ప్రొఫెషనల్ డీఎస్ఎల్ఆర్ కెమెరా ఫోటోగ్రఫీకి ధీటుగా స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీ అభివృద్థి చెందుతోంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ ఉత్తమ క్వాలిటీ ఫోటోలను ఉత్పత్తి చేయాలంటే 5 అంతకన్నా ఎక్కువ మెగా పిక్సల్ సామర్థ్యాన్ని మీ ఫోన్ కలిగి ఉండాలి.

 

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

బ్యాటరీ ఎంతుంటే బాగుంటుంది..?

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ప్రధానంగా వేధిస్తోన్న సమస్య బ్యాటరీ బ్యాకప్. మీ స్మార్ట్‌‌ఫోన్‌లో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయంటే బ్యాటరీ బ్యాకప్ అంత త్వరగాతగ్గిపోతుందని అర్థం. కాబట్టి సింగిల్ చార్జ్ పై ఒకటి రెండు రోజులు బ్యాకప్‌నిచ్చే స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవటం మంచిది.

 

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

ఇంటర్నెట్ యాక్సెస్ ఏలా ఉండాలి..?

భారత్‌లో ప్రస్తుతానికి 2జీ, 3జీ, 4జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మీ ఫోన్ 4జీ ఇంటర్నెట్ కనెక్టువిటీని సపోర్ట్ చేసేదిగా ఉంటే బాగుంటుంది.

 

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

ఎలాంటి అదనపు ఫీచర్లుంటే బాగుంటుంది..?

మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఫిట్నెస్ ట్రాకర్ వంటి అదనపు ఫీచర్లుంటే బాగుంటుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Questions to ask yourself before buying a smartphone in Black Friday deals. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot