ఈ AI చాట్‌బోట్ ద్వారా కూడా రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఎలా చేయాలో తెలుసా?
రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకోవడం ఒకప్పుడు పెద్ద ప్రక్రియ.. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితిలో కొంత మార్పులు వచ్చినా.. యాప్ ద్వారా బుకింగ్ చేసుకొనే వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. బుకింగ్ సమయంలో సాంకేతిక సమస్యలు సహా అనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే కీలక అడుగులు వేస్తోంది.
భారతీయ రైల్వే AI చాట్‌బోట్ AskDisha 2.0 ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ చాట్ బోట్ ద్వారా అనేక రకాల సేవలను అందిస్తోంది. టికెట్లు బుకింగ్ చేయడం (Indian Railway Ticket Booking), రిఫండ్ ప్రక్రియ గురించి తెలుసుకోవడం సహా వివిధ సేవలకు సంబంధించిన సమాచారం అందిస్తోంది.

AskDisha 2.0 చాట్‌బోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial intelligence ) మరియు మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది. CoRover AI పైన పనిచేస్తుంది. ఈ చాట్‌బోట్ హిందీ, ఇంగ్లీష్, హింగ్లీష్ (Hinglish) భాషలను సపోర్టు చేస్తుంది. మరియు ఈ AI చాట్‌బోట్ IRCTC మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
AskDisha 2.0 లో చిన్న చిన్న కమాండ్లు ఉపయోగించిన రైలు టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. మరియు PNR స్టేటస్‌ను (Know your PNR Status) గురించి తెలుసుకోవచ్చు, టికెట్లను క్యాన్సిల్ వంటి సేవలను పొందవచ్చు. వాయిస్ కమాండ్ల ద్వారా కూడా ఈ సదుపాయాలను పొందవచ్చు.
ఈ చాట్‌బోట్ ద్వారా ఏయే సేవలను పొందవచ్చు.. :
భారతీయ రైల్వేకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బోట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. మరియు PNR స్టేటస్ చెకింగ్ చేసుకోవచ్చు మరియు క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీంతోపాటు రిఫండ్ పరిస్థితిని తెలుసుకోవచ్చు. దీంతోపాటు బోర్డింగ్ స్టేషన్ మార్పులు చేయడం సహా బుకింగ్ హిస్టరీని కూడా తనిఖీ చేసుకోవచ్చు. దీంతో టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యాక్సెస్‌ను ఎలా పొందాలి ;
AskDisha 2.0 చాట్‌బోట్‌ను IRCTC వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ పొందవచ్చు. యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఈ చాట్‌బోట్ లోగోను గుర్తించవచ్చు. చాట్ బోట్ ఓపెన్ చేసి సంబంధించిన వివరాల కమాండ్‌ను ఎంటర్ చేయాలి. దాంతోపాటు మైక్రోఫోన్ ఆప్షన్ కూడా వినియోగించుకోవచ్చు. సింపుల్ వాయిస్ కమాండ్ల ద్వారా కూడా వినియోగించుకోవచ్చు.
AskDisha 2.0 మీ ఫోన్‌లో వినియోగించుకొనేందుకు ప్లేస్టోర్ నుంచి IRCTC రైల్ కనెక్ట్ యాప్‌ను (IRCTC Rail Connect App) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం మీ కావాల్సిన సమాచారం కోసం కమాండ్లు, వాయిస్ కమాండ్ల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ చాట్‌బోట్ అందరికీ అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








