ఇక మొబైల్ ఫోన్‌లో రైల్వే టికెట్ బుకింగ్

Posted By:

ఇక పై రైల్వే టికెట్‌ను బక్ చేసుకునేందకు రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లవల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ ద్వారానే రైలు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అందుకు మీరు చేయవల్సిందల్లా మీ ఫోన్ నుంచి 139 లేదా 5676714 నంబర్లకు రెండు సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్‌లు) పంపడమే. రైలు ప్రయాణానికి సంబంధించిన రైల్వే టికెట్‌లు ఇప్పటివరకు రిజర్వేషన్ కౌంటర్‌ల ద్వారానూ... ఆన్‌లైన్ ఇంటర్నెట్ బుకింగ్‌ల ద్వారానూ కొనుగోలు చేసేందుకు మాత్రమే అవకాశాలు ఉండేవి. నేరుగా మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా టికెట్ కొనుగోలు చేసుకొనే సదుపాయాన్ని రైల్వే శాఖా మంత్రి మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు. అంతర్జాలం ఇంకా స్మార్ట్‌ఫోన్ సదుపాయం లేని సాధారణ సెల్‌ఫోన్ యూజర్లు సైతం ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా రైలు టికెట్‌లను బుక్ చేసుకునే విధానాన్ని క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇక మొబైల్ ఫోన్‌లో రైల్వే టికెట్ బుకింగ్

1.) ముందుగా మీ మొబైల్ నెంబరును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి.

ఇక మొబైల్ ఫోన్ లో రైల్వే టికెట్ బుకింగ్

ఈ చర్య పూర్తి అయిన వెంటనే సదరు బ్యాంకు మీకు మొబైల్ మనీ ఐడెంటిఫయర్ ఇంకా వన్ టైమ్ పాస్ వర్డ్ నెంబర్లను ఇస్తుంది.

ఇక మొబైల్ ఫోన్ లో రైల్వే టికెట్ బుకింగ్

తరువాత మీ మొబైల్ నెంబరును ఐఆర్సీటీసీలో రిజిస్టర్ చేయాలి. ఈ చర్యలను సమర్థవంతంగా పూర్తి చేసినట్లయితే మీ మొబైల్ ఫోన్ రైలు టికెట్ ను బుక్ చేసుకునేందుకు అర్హత సాధించనట్లే.

ఇక మొబైల్ ఫోన్ లో రైల్వే టికెట్ బుకింగ్

టికెట్ బుక్ చేసుకునే విధానం:

మీరు ప్రయాణించబోయే రైలు నంబరు, వెళ్లవలిసిన ప్రదేశం, ప్రయాణ తేది, ప్రయాణించనున్న శ్రేణి, పేరు, వయసు, లింగ వంటి వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్ నుంచి 139 లేదా 5676714 నంబర్లకు పంపాలి.

 

ఇక మొబైల్ ఫోన్ లో రైల్వే టికెట్ బుకింగ్

వెంటనే ట్రాన్సెక్షన్ ఐడీ వివరాలతో ఒక సందేశం మీ మొబైల్ కు వస్తుంది.

ఇక మొబైల్ ఫోన్ లో రైల్వే టికెట్ బుకింగ్

తరువాత పే అని టైప్ చేసి ట్రాన్సెక్షన్ ఐడీ ఎంఎంఐడీ, ఓటీపీ వివరాలను ఎస్ఎంఎస్ గా పంపితు టికెబ్ బుక్ అవుతుంది.

ఇక మొబైల్ ఫోన్ లో రైల్వే టికెట్ బుకింగ్

ఒక్కో ఎస్ఎంఎస్ కు రూ.3 ఛార్జ్ చేస్తారు, చెల్లింపులకు సంబంధించి రూ.5,000లోపు టికెట్లకు రూ.5, రూ. అయిదువేలకు పైబడిన టికెట్లకు రూ.10 చొప్పున వసూలు చేస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot