ఈ వర్షా కాలంలో మీ ఫోన్ జరభద్రం!
వానల కాలం వచ్చేసింది. ఈ వర్ష రుతువులో మీ మొబైల్ ఫోన్ నీటిలో తడిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అనుకోని పరిస్థితుల్లో మీ మొబైల్ చమ్మతాకిడికి లోనైనట్లయితే తీసుకోవల్సిన జాగ్రత్తలను క్రింది స్లైడ్ షోలో సూచించటం జరిగింది.

ఈ వర్షా కాలంలో మీ ఫోన్ జరభద్రం!
నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి. ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది.

ఈ వర్షా కాలంలో మీ ఫోన్ జరభద్రం!
తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది.

ఈ వర్షా కాలంలో మీ ఫోన్ జరభద్రం!
తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. - ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి.

ఈ వర్షా కాలంలో మీ ఫోన్ జరభద్రం!
పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి.

ఈ వర్షా కాలంలో మీ ఫోన్ జరభద్రం!
తడిబారిన ప్రదేశం వెచ్చబడిన అనంతరం ఫోన్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి. ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.
లేటెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)
చమ్మ వాతావరణం నుంచి రక్షించే వాటర్‌ప్రూఫ్ మొబైల్‌ఫోన్‌లు మార్కెట్లో అనేకం లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో నిక్షిప్తం చేసిన వాటర్‌ప్రూఫ్ వ్యవస్థ మన్నికైనదో కాదో నిర్ధారించుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2013కు గాను బెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తున్నాం వాటి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు సదరు డివైజ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ అవగాహనకు రండి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్ కొత్తదిగా ఉంది. మరో వైపు యాపిల్ ఐవోఎస్,బ్లాక్‍బెర్రీ 10 ఇంకా విండోస్ 8 ఓఎస్ ఆధారిత డివైజ్‌లులభ్యమవుతున్నాయి. వివిధ స్ర్కీన్ వేరియంట్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పొడవు 4 అంగుళాల ఉన్నట్లయితే ఇంటర్నెట్ సర్ఫింగ్ ఇంకా స్ర్కీన్ రిసల్యూషన్ బాగుంటుంది. కంపెనీ బట్టి స్మార్ట్‌ఫోన్ క్వాలిటీ ఆధారపడిఉంటుంది. కాబట్టి ఫోన్ ఎంపిక సంబంధించి ముందుగానే బ్రాండ్ ఎంచుకోండి. మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. మీ ట్యాబ్లెట్ 4000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది.


Click it and Unblock the Notifications








