మీ ఫోన్‌లో డిలీట్ అయిన డేటాను తిరిగి పొందడం చాలా తేలిక
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. అది లేకుండా పని జరగడం లేదంటే నమ్మి తీరాల్సిందే.
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. అది లేకుండా పని జరగడం లేదంటే నమ్మి తీరాల్సిందే. ఒక్క నిమిషం కూడా అది లేకుండా గడిపే స్థితికి వినియోగదారులు చేరారు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా దానితోనే గడిపేయాల్సిందే. సోషల్ మీడియా వచ్చిన తరువాత ఈ వ్యసనం మరింతగా ఎక్కువైపోయింది. ముఖ్యమైన సమాచారం మొత్తాన్ని ఫోన్లోనే నిక్షిప్తం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాము. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు అనుకోకుండానే మన డేటా డిలీట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి దాన్ని రికవరీ చేసుకునే మార్గాల గురించి అందరూ తెగ ఆలోచిస్తుంటారు అయితే దీన్ని రికవరీ చేసుకునేందుకు మీకు ఓ యాప్ సహాయం చేస్తుంది. అదేంటో చూద్దాం.

మొబికిన్ డాక్టర్ ఫర్ ఆండ్రాయిడ్
మొబికిన్ డాక్టర్ ఫర్ ఆండ్రాయిడ్ ద్వారా మీరు కోల్పోయిన డేటాను ఈజీగా తిరిగిపొందవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్‌లో కొత్తగా వచ్చిన ఒక సదుపాయంతో ఫోన్‌లో డిలీట్ అయిన డాటాను సులభంగా పొందవచ్చు.

కంప్యూటర్‌కు కనెక్ట్
మనం ఏ ఆండ్రాయిడ్ మొబైల్‌లో అయితే డిలీట్ అయిన డాటాను తిరిగి పొందాలనుకుంటామో ఆ ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవాలి.

సాఫ్ట్‌వేర్‌ను ముందుగానే ఇన్‌స్టాల్..
కంప్యూటర్‌లో ‘మొబికిన్ డాక్టర్ ఫర్ ఆండ్రాయిడ్' అను సాఫ్ట్‌వేర్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం సాఫ్ట్‌వేర్‌ను రన్ చేసి ఓపెన్ చేయాలి.

కనెక్ట్ అయిందో లేదో చెక్..
ఇప్పుడు మీరు కనెక్ట్ చేసిన ఆండ్రాయిడ్ మొబైల్ సదరు సాఫ్ట్‌వేర్‌లో కనెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. కనెక్ట్ అయిన తరువాత మనకు కావాల్సిన ఫైల్స్, మెసేజ్‌లను రీస్టోర్ చేసుకోవాలి.

రీస్టోర్ చేసిన డాటా
దీనికి కొంత సమయం పడుతుంది. ఆ తరువాత మనం రీస్టోర్ చేసిన డాటా తిరిగి మన మొబైల్‌లోకి సులభంగా వచ్చేస్తుంది.

కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, మీడియా ఫైల్స్
ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, మీడియా ఫైల్స్, ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్ ఇలా సుమారు ఎనిమిది రకాల ఫైల్స్‌లను రికవరీ చేసుకోవచ్చు.

2 వేల రకాల ఆండ్రాయిడ్ ఫోన్స్‌లను..
ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా సుమారు 2 వేల రకాల ఆండ్రాయిడ్ ఫోన్స్‌లను రికవరీ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








