Home
How to

మీ ఫోన్‌లో జియో ఇంటర్నెట్ నెమ్మదిగా ఉందా..? ఇలా చేయండి

By Sivanjaneyulu Bommu

జియో నెట్‌వర్క్ స్పీడ్ నెమ్మదిగా ఉందంటూ చాలామంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. జియో అధికారిక్ లాంచ్‌కు ముందు లైఫ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు 4జీ ఇంటర్నెట్‌ను 10 నుంచి 20 ఎంబీపీఎస్ స్పీడ్ మధ్య అందుకున్నారు.

మీ ఫోన్‌లో జియో ఇంటర్నెట్ నెమ్మదిగా ఉందా..? ఇలా చేయండి

Read More : జనవరి నుంచే BSNL ఉచిత వాయిస్ కాల్స్..రూ.2కే?

జియో అధికారిక లాంచ్ తరువాత లోడ్ మరింత పెరగటంతో ఇంటర్నెట్ స్పీడ్ దారుణంగా పడిపోతున్నట్లు పలువురు కస్టమర్‌లు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. మీ ఫోన్‌లో జియో స్పీడ్ డౌన్‌లోడ్ స్పీడ్ 150 కేబీపీఎస్ నుంచి 500 కేబీపీఎస్ మధ్య ఉన్నట్లయితే, ఈ క్రింది సూచనలను పాటించండి..

Read More : జియోకు కౌంటర్ : 90 రోజుల ప్లాన్‌తో దూసుకొచ్చిన ఎయిర్‌టెల్

APN సెట్టింగ్స్‌ను మార్చటం  ద్వారా..

APN సెట్టింగ్స్‌ను మార్చటం ద్వారా..

మీ ఫోన్‌లో APN సెట్టింగ్స్‌ను మార్చుకోవటం ద్వారా జియో నెట్‌వర్క్ వేగాన్ని పెంచుకోవచ్చు. ఇలా చేయాలంటే ముందు మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ కనపించే మొబైలప నెట్‌వర్క్స్ ఆప్సన్‌ను సెలక్ట్ చేసుకుని అందులో నెట్‌వర్క్ టైప్ LTE మోడ్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. ఆ తరువాత Access Point Names (APN)ను సెలక్ట్ చేసుకుని అందులో కనిపించే APN protocol optionలోకి వెళ్లి Ipv4/Ipv6 అడ్రస్‌కు మారండి. ఆ తరువాత Bearer optionలోకి వెళ్లి అక్కడ కనిపించే LTE మోడ్‌ను సెలక్ట్ చేసుకుని అన్ని సెట్టింగ్స్‌ను సేవ్ చేయండి.

రూట్ చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌

రూట్ చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌

మీరు రూట్ చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నట్లయితే ముందుగా, మీ ఫోన్‌లో 3G/4G Speed Optimizer APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి network speed విభాగాన్ని సెలక్ల్ చేసుకోండి. అందులో మీరు 12/28/7 - Max Speed (Low battery efficiency) optionను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. సెట్టింగ్స్ అప్లై అయిన తరువాత ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది.

రూట్ చేయని ఫోన్‌లో VPN ద్వారా జియో స్పీడ్‌ను పెంచుకోవాలంటే...

రూట్ చేయని ఫోన్‌లో VPN ద్వారా జియో స్పీడ్‌ను పెంచుకోవాలంటే...

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Snap VPN యాప్‌ను మీ ఫోన్‌లోకి ఇ‌న్‌స్టాల్ చేసుకోండి. ఆ తరువాత యాప్‌ను ఓపెన్ చేసినట్లయితే దేశాల జాబితాతో పాటు అక్కడి సిగ్నల్ strength వివరాలు మీకు కనిపిస్తాయి. వాటిలో బలమైన ఇంటర్నెట్ సిగ్నల్‌ను కలిగి ఉన్న దేశాన్ని సెలక్ట్ చేసుకుని connectionను establish చేయండి. మీ నెట్ వేగం కచ్చితంగా పెరుగుతుంది.

 రకాల డేటా స్పీడ్‌లను వివిధ రకాల bandలలో

రకాల డేటా స్పీడ్‌లను వివిధ రకాల bandలలో

రిలయన్స్ జియో వివిధ రకాల డేటా స్పీడ్‌లను వివిధ రకాల bandలలో ఆఫర్ చేస్తుంది. వాటిలో band 40 ఇతర బ్యాండ్‌లతో పోలిస్తే వేగవంతమైన డేటా స్పీడ్స్‌ను ఆఫర్ చేస్తోంది. మీ ఫోన్ ఎల్టీఈ బ్యాండ్‌ను బ్యాండ్ 40కి మార్చుకోవటం ద్వారా హై డేటా స్పీడ్‌ను మీరు ఆస్వాదించవచ్చు.

మీరు క్వాల్కమ్  స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నట్లయితే

మీరు క్వాల్కమ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నట్లయితే

మీరు క్వాల్కమ్ ప్రాసెసర్‌తో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నట్లయితే *#*#4636#*#* సీక్రెట్ కోడ్‌ను అప్లై చేసి ఎల్టీఈ బ్యాండ్‌ను band 40కి మార్చుకోవచ్చు. అయితే ఈ ట్రిక్ వన్‌ప్లస్ 3, షియోమీ ఎంఐ 5 వంటి క్వాల్కమ్ చిప్ డివైస్‌లలో మాత్రమే వర్క్ అవుతోంది.

మీడియాటెక్  ప్రాసెసర్‌తో వస్తోన్న కొన్ని

మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తోన్న కొన్ని

మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తోన్న కొన్ని ఫోన్‌లలో ఎల్టీఈ బ్యాండ్‌ను మార్చేందుకు స్టెప్ 1ను అనుసరిస్తే సరిపోతుంది. మరికొన్ని ఫోన్ లలో మాత్రం MTK Engineering toolను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

ఎల్టీఈ బ్యాండ్‌ను మార్చిన తరువాత

ఎల్టీఈ బ్యాండ్‌ను మార్చిన తరువాత

ఎల్టీఈ బ్యాండ్‌ను మార్చిన తరువాత ఫోన్‌లోని APN Settingsను మార్చుకోవల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రింది విధంగా APN Settingsను క్రియేట్ చేయండి. Name - RJio APN - jionet APN Type - Default Proxy - No changes Port - No changes Username - No changes Password - No changes Server - www.google.com MMSC - No changes MMS proxy - No changes MMS port - No changes MCC - 405 MNC - 857 or 863 or 874 Authentication type - No changes APN Protocol - Ipv4/Ipv6

APN Settings అన్ని సందర్భాల్లో వర్క్ కాకపోవచ్పు

APN Settings అన్ని సందర్భాల్లో వర్క్ కాకపోవచ్పు

ఈ APN Settings అన్ని సందర్భాల్లో వర్క్ కాకపోవచ్పు. కాబట్టి ట్రిక్‌ను అప్లై చేసే ముందు మీ పాత APN వివరాలను బ్యాకప్ చేసుకోవటం మంచిది.

క్యాచీ ఫైల్స్‌ను క్లియర్ చేయటం ద్వారా

క్యాచీ ఫైల్స్‌ను క్లియర్ చేయటం ద్వారా

మీ ఫోన్‌లో పేరుకుపోయిన క్యాచీ ఫైల్స్‌ను క్లియర్ చేయటం ద్వారా 4జీ స్పీడ్‌ను పెంచుకోవచ్చు. ఇలా చేసేందుకు ఫోన్ Settingsలోకి వెళ్లి → Storage & USB → Under Internal Storage, tap on Cached data and hit clear cached data and confirm it by tapping on 'ok'.

(పాఠకులకు మనవి : ఈ ట్రిక్స్‌ను apply చేసే క్రమంలో ఏమైనా తప్పిదాలు చోటుచేసుకున్నట్లయితే, అందకు GIZBOT ఏ విధమైన బాధ్యత వహించదు. యూజర్ పూర్తిగా తన రిస్క్‌తోనే నిర్ణయం తీసుకోవల్సి ఉంది)

Best Mobiles in India

English summary
Increase Your Reliance Jio 4G SIM Internet Speed With These 6 Solutions. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X