Home
How to

Jio UPI ఆటోపే ద్వారా రిపీట్ పేమెంట్లను ఎలా సెటప్ చేయాలి?

ఇండియాలోని టెలికాం రంగంలో అద్భుతమైన మార్పులను మొదటగా తీసుకొని వచ్చిన రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌ల కోసం UPI ఆటోపే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ఫలితంగా భారతదేశంలో జియో తన సబ్‌స్క్రైబర్‌లకు ఈ కార్యాచరణను అందించిన మొట్టమొదటి టెల్కోగా అవతరించింది. ఈ ఫీచర్‌తో జియో సబ్‌స్క్రైబర్‌లు NPCI యొక్క UPI ఆటోపే సదుపాయాన్ని ఉపయోగించుకొని యూజర్ల యొక్క ప్రీపెయిడ్ నంబర్‌ను క్రమం తప్పకుండ ఆటోమ్యాటిక్ గా రీఛార్జ్ చేయడానికి MyJio యాప్‌లో స్టాండింగ్ సూచనలను సెట్ చేయవచ్చు.

Jio UPI ఆటోపే ఫెసిలిటీ

Jio UPI ఆటోపే ఫెసిలిటీ

మీరు జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్ అయితే కనుక UPI ఆటోపే ఎంపికతో జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు తాము ఇంతకు ముందు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న ప్లాన్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా మీ ప్రస్తుత ప్లాన్ యొక్క వాలిడిటీ ముగింపును ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఫీచర్‌తో మీరు అదే ప్లాన్‌తో సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఫీచర్‌ని ఎంచుకుంటే రీఛార్జ్ ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. రూ.5,000 రీఛార్జ్ మొత్తాల కోసం ఈ ఫీచర్ అనుమతిస్తుంది. అంతేకాకుండా మీరు మీ ప్రీపెయిడ్ నంబర్‌ని రీఛార్జ్ చేసేటప్పుడు UPI పిన్‌ని నమోదు చేయవలసిన అవసరం లేదు. అయితే అధిక మొత్తంలో రీఛార్జ్ చేసే మొత్తాలకు మాత్రమే UPI పిన్ ప్రమాణీకరణ అవసరం. ఇంకా మీరు ఈ ఆటోపే ఫీచర్ ద్వారా మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకున్న టారిఫ్ ప్లాన్‌ల కోసం ఇ-మాండేట్‌ను సృష్టించవచ్చు, సవరించవచ్చు మరియు పూర్తిగా తొలగించవచ్చు. ఈ UPI ఆటోపే ఎంపిక ప్రస్తుతానికి ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్‌పెయిడ్ చందాదారులు మాత్రం మాన్యువల్‌గానే తమ బిల్లులను చెల్లించాలి.

ఆటో-డెబిట్

ఆటో-డెబిట్ లావాదేవీల కోసం అందుబాటులోకి వచ్చిన అప్ డేట్ మార్గదర్శకాలను గత సంవత్సరం RBI ప్రకటించిన తర్వాత ఈ చర్య వచ్చింది. అక్టోబర్ 1, 2021 నుండి రిపీట్ పేమెంట్ కోసం ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. NPCI UPI ఆటోపే ఫంక్షనాలిటీని ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు UPI అప్లికేషన్‌ని ఉపయోగించి రూ.2,000 వరకు రీపేమెంట్ కోసం ఇ-ఆదేశాన్ని సెట్ చేయడానికి అనుమతించారు. EMI పేమెంట్, విద్యుత్ బిల్లులు, మొబైల్ బిల్లులు, బీమా, మ్యూచువల్ ఫండ్‌లు, OTT సబ్‌స్క్రిప్షన్‌లు, లోన్ పేమెంట్లు మరియు మరిన్ని వాటి కోసం ఈ ఫీచర్ ను ఉపయోగించవచ్చు.

Jio UPI ఆటోపేను సెటప్ చేసే విధానం

Jio UPI ఆటోపేను సెటప్ చేసే విధానం

మీరు MyJio యాప్ ద్వారా మీ జియో ప్రీపెయిడ్ నంబర్‌కు UPI ఆటోపే సెటప్ చేయాలనుకుంటే కనుక దిగువన ఉండే దశలను అనుసరించండి.

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో MyJio యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: యాప్ ఎగువన ఉన్న మొబైల్ ట్యాబ్‌కి వెళ్లండి.

స్టెప్ 3: ఇప్పుడు సెటప్ జియో ఆటోపేపై ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4: UPI మరియు బ్యాంక్ అకౌంట్ అనే రెండు ఎంపికల నుండి ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించే పేజీకి దారి మళ్లించబడతారు. ఇక్కడ మీరు UPI ఎంపికను ఎంచుకోవాలి.

స్టెప్ 5: ఇప్పుడు మీరు మీ జియో ప్రీపెయిడ్ నంబర్ యొక్క ఆటోమేటిక్ పేమెంట్లను ఎంచుకోవాలనుకుంటున్న రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోండి. మీరు మీ అవసరాలకు సరిపోయే ప్లాన్‌ని ఎంచుకున్నారని నిర్ధారించుకోండి.

స్టెప్ 6: UPI ఎంపికను ఎంచుకున్న తర్వాత మీరు మీ UPI IDని అందించాలి మరియు ఆటోపే సదుపాయాన్ని సెట్ చేయాలి.

 

Best Mobiles in India

English summary
Reliance Jio Prepaid Users How To Set Up UPI Autopay on MY Jio App?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X