మీ ఏరియాలో Jio 4G నెట్‌వర్క్ కవరేజ్‌ను చెక్ చేయటం ఎలా..?
Jio యూజర్లు తమ ఏరియా పరిధిలో నెట్‌వర్క్ కవరేజ్‌ను చెక్ చేసుకునేందుకు Smart Coverage map పేరుతో సరికొత్త సర్వీసును రిలయన్స్ జియో లాంచ్ చేసింది.

Read More : ప్రతి ఒక్కరికి 5జీబి ఇంటర్నెట్ ఉచితం, సంచలరం రేపుతోన్న Airtel కొత్త ఆఫర్లు
ఈ స్మార్ట్ కవరేజ్ మ్యాప్ ద్వారా జియో యూజర్లు తమ ఏరియాలోని జియో 4జీ టవర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు నెట్‌వర్క్ సిగ్నల్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఓపెన్ నెట్‌వర్క్ ఫీచర్‌కు పోటీగా రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన స్మార్ట్ కవరేజ్ మ్యాప్ ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం..

#1
Smart Coverage mapను పొందాలనుకునే రిలయన్స్ జియో యూజర్లు ముందుగా Jio websiteలోకి లాగినై తమ మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ కావల్సి ఉంటుంది.

#2
రిలయన్స్ జియో లాంచ్ చేసిన స్మార్ట్ కవరేజ్ మ్యాప్ ద్వారా మీ ప్రాంతంలోని జియో నెట్‌వర్క్‌కు సంబంధించిన క్వాలిటీ, signal strength వంటి వివరాలను తెలుసుకునే వీలుంటుంది.

#3
ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునే క్రమంలో మీ ఫోన్ జీపీఎస్‌ను ఆన్ చేసి ఉంచవల్సి ఉంటుంది. అంతేకాకుండా, మీ లొకేషన్‌కు సంబంధించిన వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.

#4
రిలయన్స్ జియో స్మార్ట్ కవరేజ్ మ్యాప్ ద్వారా అవుట్ డోర్ ఆన్-ఎయిర్ నెట్‌వర్క్ కవరేజ్‌తో పాటు ఇండోర్ నెట్‌వర్క్ కవరేజ్ కు సంబంధించి రియల్ టైమ్ వివరాలను తెలుసుకోవచ్చు.

#5
ఈ స్మార్ట్ కవరేజ్ మ్యాప్ ద్వారా జియో Wi-Fi Hotspotలకు సంబంధించి నెట్‌వర్క్ కవరేజ్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు.

#6
మీ ప్రాంతంలో జియో నెట్‌వర్క్ కవరేజ్‌కు సంబంధించిన ఫలితాలను పీడ్‌బ్యాక్ రూపంలో మీరు సబ్మిట్ చేసే అవకాశముంటుంది. ప్రస్తుతానికి రిలయన్స్ జియో స్మార్ట్ కవరేజ్ మ్యాప్ బేటా వర్షన్‌లో ఉంది.


Click it and Unblock the Notifications








