వేసవిలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగిస్తున్నారా.. ఈ రూల్స్ కచ్చితంగా పాటించాలి..!
వేసవి కాలం వచ్చేసింది. ఈ సంవత్సరం మార్చి నెల నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉంది. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతోపాటు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు (Electronic Gadgets Summer Usage Tips) నమోదు అవుతున్నాయి. అయితే ప్రస్తుతం అనేక మంది ఏదో ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ను ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్‌లు సహా వైఫై రూటర్లు, ప్రింటర్‌లు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం విషయంలో ఇతర కాలాలతో పోలిస్తే వేసవిలో ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను ఉపయోగిస్తున్న సమయంలో సాధారణంగా ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది. అంటే ఆయా వస్తువులు వేడెక్కుతాయి. దీంతోపాటు వేసవిలో బయట ఉష్ణోగ్రత కారణంగా మరింత వేడెక్కుతాయి.

ఇలా ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువ సమయం వేడెక్కి ఉంటే వాటి పరితీరు క్రమంగా దెబ్బతింటుంది. కొన్నిసార్లు అంతర్గత విభాగాలు డ్యామేజీ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే మీరు ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ వేడెక్కుతుంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.
ఇంట్లో లేదా ఆఫీస్, ఇతర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను అమర్చినప్పుడు వాటి చుట్టు కొత్త ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. మరియు గాలి ప్రవాహం సక్రమంగా వచ్చేలా చూసుకోవాలి. ప్రింటర్‌లు, కంప్యూటర్‌లు, రూటర్లు ఇతర డివైజ్‌లకు వెనుక వైపు లేదా కింద వైపు గాలి ప్రవాహం కోసం Vents ఉంటాయి.
చల్లని గాలి ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి వెళ్లేందుకు.. వేడి గాలి బయటకు పోయేందుకు ఈ Vents ఉపయోగపడతాయి. ఫలితంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు చల్లగా ఉంటాయి. అందువల్ల గాలి సక్రమంగా వచ్చే ప్రాంతంలో అమర్చుకోవడం ఉత్తమం.
దీంతోపాటు ఇంట్లో లేదా కార్యాలయాల్లో కంప్యూటర్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కిటికీలకు సమీపంలో అమర్చకూడదు. ఎందుకంటే ఈ వస్తువులు పనిచేసే సమయంలో ఎంతో కొంత వేడి ఉత్పన్నం అవుతుంది. నేరుగా సూర్యకాంతి ప్రసరించే ప్రాంతంలో వీటిని అమర్చడం కారణంగా త్వరగా వేడెక్కే అవకాశం ఉంది.
దీంతోపాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను ఉపయోగిస్తున్న సమయంలో ఫ్యాన్ లేదా ఎయిర్ కండిషనర్ లేదా సక్రమంగా గాలి వచ్చే ప్రాంతంలో ఉంచాలి. ఫలితంగా ఎక్కువ సమయం వినియోగించినా.. ఆయా వస్తువులు వేడెక్కే అవకాశం ఉండదు.
కొంత మంది తమ ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను దుమ్ము, ధూళి ఎక్కువగా వచ్చే ప్రాంతంలో అమర్చుతారు. దీని వల్ల ఆయా పరికరాల్లోకి దుమ్ము చేరి, వాటి పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్నిసార్లు పూర్తిగా పనిచేయకపోవచ్చు.
వేసవి కాలంలో కొన్నిసార్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు అధికంగా వేడెక్కుతాయి. అలాంటి సందర్భాల్లో తక్షణమే వాటి వినియోగం నిలిపివేయాలి. పవర్ కనెక్షన్ కూడా తొలగించాలి. ఆ వస్తువులు పూర్తిగా చల్లబడేంత వరకు వినియోగించకూడదు. ఆ వస్తువులపై పూర్తి స్థాయిలో గాలి ప్రవాహం ఉండేలా చూసుకోవాలి.
కొంత మంది యూజర్లు ఎలక్ట్రానిక్ వస్తువులను ఒకదానిపై మరొకటి అమర్చుతుంటారు. అలా ఎప్పుడు చేయవద్దు. ఎందుకంటే సరైన గాలి ప్రవాహం లేని కారణంగా అన్ని వస్తువులు వేడెక్కేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా గ్యాడ్జెట్‌ల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








