Home
How to

Room Heaters : రూం హీటర్లను ఉపయోగిస్తున్నారా.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే..!

చలికాలంలో అనేక మంది గీజర్‌లు, వాటర్‌ హీటర్‌లు, రూం హీటర్లను (Room Heaters) వినియోగిస్తుంటారు. అయితే వీటిని కొనుగోలు, వినియోగించే సమయాల్లో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గీజర్‌లు కొనుగోలు చేసే సమయాల్లో బ్రాండ్‌, BEE రేటింగ్‌, ట్యాంక్‌ సామర్థ్యం సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్ హీటర్‌లను కొనుగోలు చేయడం సహా వినియోగిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

అయితే రూం హీటర్లను ఇటీవల కాలంలో అనేక మంది ఉపయోగిస్తున్నారు. కొత్తగా కొనుగోలు చేస్తున్నా లేదా ప్రస్తుతం ఉన్న హీటర్‌ నే వినియోగించాలని భావిస్తే మాత్రం.. అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. వైరింగ్‌, ప్లగ్‌, ఇతర విడిభాగాలను సరిగ్గా తనిఖీ చేయాల్సి ఉంటుంది.

Safety guide to use Room Heaters

* గాలి ప్రసారం సక్రమంగా ఉండేలా చూసుకోవాలి :
రూం హీటర్లను వినియోగిస్తున్న సమయంలో కొంత మంది గదిలో అన్ని తలుపులు, కిటికీలను పూర్తిగా మూసివేస్తుంటారు. ఇలా చేస్తే హీటర్‌ ఆన్‌ చేసిన కొంత సమయం వరకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా.. ఎక్కువ సమయం గది పూర్తిగా మూసివేస్తే.. ఆక్సిజన్‌ సక్రమంగా అందక, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

కొంత మంది రాత్రంతా రూం హీటర్‌ ను ఆన్‌ చేసి, వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ గదిలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయి క్రమంగా అధికం అవుతుంది. అదే సమయంలో ఆక్సిజన్ స్థాయి క్రమంగా తగ్గిపోతుంది. దీని వల్ల శ్వాస క్రియకు తీవ్ర ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది.

దీర్ఘకాలంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆక్సిజన్‌ స్థాయి పూర్తిగా తగ్గిపోవడం కారణంగా నిద్రలోనే మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనలు కూడా అనేకం వెలుగులోకి వచ్చాయి. సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

Safety guide to use Room Heaters

గదిలో ఉష్ణోగ్రత అత్యంత కనిష్ఠంగా ఉంటే, సరిగ్గా నిద్రపోయే సమయంలోనే రూం హీటర్‌ ను ఆన్ చేయకూడదు. అందుకు బదులుగా నిద్ర పోయేందుకు గంట ముందుగానే గదిలోని హీటర్‌ ను ఆన్‌ చేయడం ఉత్తమం. దీని వలన మీరు నిద్రకు ఉపక్రమించే సమయానికి గదిలో ఉష్ణోగ్రత మెరుగుపడుతుంది. అనంతరం రూం హీటర్‌ ను ఆఫ్‌ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు.

* రూం హీటర్‌ ను సరైన ఎత్తులో మరియు కదలకుండా ఉండే ఉపరితలంపై అమర్చివలసి ఉంటుంది. ఫలితంగా బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటుంది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. దీంతోపాటు గది మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి.

* బాత్‌రూం, సింక్‌ సహా నీటికి సమీపంలో రూం హీటర్‌లను ఏర్పాటు చేయకూడదు. నీటికి సమీపంలో ఉంటే విద్యుత్ ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు నిద్రించే ప్రదేశానికి అత్యంత దగ్గరగా హీటర్‌ అమర్చుకుంటే, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

చిన్నారులు సహా రూం హీటర్లపై సరైన అవగాహన లేని వ్యక్తులు.. వాటి దగ్గరకు వెళ్లకపోవడం ఉత్తమం. చిన్నారులు హీటర్‌ల దగ్గరకు వెళ్లకుండా, ఇంట్లోని పెద్దలు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలపై వారికి అవగాహన కల్పించాలి.

Best Mobiles in India

English summary
Safety guide to use Room Heaters during winter season full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X