Home
How to

క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు వినియోగిస్తున్నారా.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రస్తుతం భారీగా విస్తరించింది. ప్రస్తుతం అత్యధిక శాతం మంది ప్రజలు బ్యాంకు అకౌంట్‌లను కలిగి ఉన్నారు. అయితే డెబిట్‌ కార్డులతోపాటు క్రెడిట్‌ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. ఉద్యోగాలు, వ్యాపారులకు బ్యాంకులు క్రెడిట్‌ కార్డులను అందిస్తున్నాయి. అయితే సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వినియోగదారులు (Credit and Debit Cards Usage Tips) అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే భారీగా నగదును కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇప్పటికే ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు అధికారులుగా ఫోన్‌లు చేసి, మభ్యపెట్టి డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు తెలుసుకొని.. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసిన ఘటనలు కూడా బయటకు వచ్చాయి. దీంతోపాటు అనుమానాస్పద లింక్‌లు, ఇతర మార్గాల్లో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. అయితే ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అత్యంత అప్రమత్తత ఎంతో అవసరం.

safety usage tips to use credit and debit cards

ప్రస్తుతం అనేక బ్యాంకులు క్రెడిట్‌, డెబిట్ కార్డులకు పటిష్ఠ భద్రతను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న 2 ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. ఫలితంగా మీ కార్డులపై లావాదేవీలు నిర్వహిస్తున్న సమయంలో ప్రత్యేక వెరిఫికేషన్‌ కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానంతో మీ అనుమతి లేకుండా బ్యాంకు కార్డులను ఎవరూ ఉపయోగించే అవకాశం ఉండదు.

దీంతోపాటు ముఖ్యంగా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహిస్తున్న సమయంలో పబ్లిక్‌ వైఫై లేదా ఇతర అనుమానాస్పద నెట్‌వర్క్‌లను ఉపయోగించకపోవడం ఉత్తమం. సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా పబ్లిక్‌ వైఫై సహా సరైన భద్రతా ఏర్పాట్లు లేని వైఫై నెట్‌వర్క్‌లను టార్గెట్‌ చేస్తున్నారు. అందువల్ల సురక్షితమైన నెట్‌వర్క్‌లను మాత్రమే ఉపయోగించాలి.

ఆన్‌లైన్‌లో షాపింగ్‌ లేదా ఏదైనా వస్తువులను కొనుగోలుకు సంబంధించి బిల్లులు చెల్లింపుల సమయంలో అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలి. ఏదైనా కొత్త వెబ్‌సైట్‌ లో మీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేయాలని భావిస్తే.. ఆ వెబ్‌సైట్‌ సరైనదా కాదా అని తెలుసుకొనే ప్రయత్నం చేయండి.

ఇటీవల కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఫీచర్‌ సౌకర్యవంతంగా ఉన్నా.. భద్రతపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫీచర్‌ ద్వారా పిన్‌ లేకుండానే లావాదేవీలు నిర్వహించవచ్చు. ఏదైనా సందర్భంలో మీ బ్యాంకు కార్డులు దొంగిలించబడినట్లయితే ఈ ఫీచ‌ర్‌ను దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం అనేక మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను వినియోగిస్తున్నారు. అందువల్ల అన్ని కార్డులకు ఒకే పిన్‌ లేదా సులభంగా గుర్తుండిపోయే పిన్‌లను క్రియేట్‌ చేస్తున్నారు. దీని వల్ల సైబర్ నేరగాళ్లు మీ కార్డులను సులభంగా యాక్సెస్‌ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల బ్యాంకులు సూచించిన విధంగా బలమైన పిన్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.

దీంతోపాటు ముఖ్యంగా క్రెడిట్‌ కార్డులను వినియోగించే వాళ్లు క్రెడిట్‌ లిమిట్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలి. దీంతోపాటు ఆన్‌లైన్‌ లావాదేవీల సమయంలో కార్డు వివరాలు సేవ్‌ కాకుండా జాగ్రత్తపడాలి. మరియు బ్యాంకు కార్డుల పిన్‌ ను నిర్ణీత వ్యవధి అనంతరం మార్పులు చేసుకోవడం ఉత్తమం.

More from GizBot

Best Mobiles in India

English summary
safety usage tips to use credit and debit cards during online transactions
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X