ఫోన్ మాట్లాడుతూనే నెంబర్ సేవ్ చేయటం ఎలా..?

ఫోన్ మాట్లాడేటప్పుడు అన్ని సందర్బాల్లో మనవద్ద పెన్ను, పేపర్లు అందుబాటులో ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలంటే ఇబ్బంది. ఫోన్ డయల్ ప్యాడ్ ద్వారా ఆదరాబెదరాగా ఆ నెంబర్‌ను టైప్ చేసినప్పటికి, కాల్‌ ఎండ్ అయ్యే సరికి ఆ సమాచారం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.

 ఫోన్ మాట్లాడుతూనే నెంబర్ సేవ్ చేయటం ఎలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో కాల్ మాట్లాడుతూనే నెంబర్లను సేవ్ చేసుకునేందుకు ఓ సులువైన మార్గం అందుబాటులోకి వచ్చింది. కాల్ రైటర్ అనే ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఫోన్ మాట్లాడుతూనే నెంబర్లను ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న Call Writer యాప్ ప్రత్యేకతలు...

Read More : రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్ (లేటెస్ట్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న

- సింగిల్ క్లిక్‌తో స్పీకర్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు.
- కాల్ మాట్లాడుతూ ఫోన్‌లో మీరు టైప్ చేసిన డేట్‌, కాల్ ఎండ్ అయినప్పటికి ఆటోమెటిక్‌గా సేవ్ కాబడి ఉంటుంది.
- కాల్ మాట్లాడుతూ నోట్ ప్యాడ్ లేదా పెయింట్‌ను ఉపయోగించుకోవచ్చు.
- మల్టీ డిజైన్ నోట్ సేవింగ్ ఆప్షన్
- సేవ్ చేయబడిన నోట్స్‌ను ఇన్‌స్టెంట్‌గా షేర్ చేసుకోవచ్చు.

కాల్ రైటర్ యాప్‍‌ను సెటప్ చేయటం ఎలా..?

ముందుగా కాల్ రైటర్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

కాల్ రైటర్ యాప్‍‌ను సెటప్ చేయటం ఎలా..?

యాప్ ఓపెన్ అయిన వెంటనే మీకు 3 గీతలతో ఉన్న సింగిల్ బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళతారు. ఇక్కడ మీ అవసరాలకు అనుగుణంగా యాప్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

 

కాల్ రైటర్ యాప్‍‌ను సెటప్ చేయటం ఎలా..?

కాల్ డయల్ లేదా రిసీవ్ చేసుకున్న ప్రతిసారి స్ర్కీన్ పై బ్లు కలర్ డైలర్ ఐకాన్ మీకు కనపిస్తుంది. ఈ ఐకాన్ పై క్లిక్ చేసి మీకు కావల్సిన నోట్స్‌ను సేవ్ చేసుకోవచ్చు.

కాల్ రైటర్ యాప్‍‌ను సెటప్ చేయటం ఎలా..?

కాల్ ఎండ్ అయినప్పటికి మీ రిటన్ నోట్స్ మాత్రం పోన్‌లో జాగ్రత్తగా సేవ్ అయి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here's How You Can Save a Number During A Phone Call On Android. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot