మీ ఎస్‌బిఐ డెబిట్ కార్డులో చిప్ ఉందో లేదో చెక్ చేయడం ఎలా ?

|

సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు ఖాతాదారుల లావాదేవీలకు మరింత సెక్యూరిటీ ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఖాతాదారులందరికీ పిన్‌తో పనిచేసే చిప్-బేస్డ్ డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయనుంది. డిసెంబర్ 31 లోగా ఖాతాదారులందరూ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులను చిప్ కార్డులతో రీప్లేస్ చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది. కార్డులపై జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది . ఈఎంవీ చిప్ కార్డుతోపాటు పిన్‌ ఖాతాదారులకు అదనపు భద్రత కల్పిస్తుంది. జూన్ చివరి నాటికి ఎస్‌బీఐ 28.9 కోట్ల ఏటీఎం కార్డుల్ని జారీ చేసింది. అందులో చాలావరకు చిప్‌ బేస్డ్ కార్డులే. ఒక్క ఎస్‌బీఐ మాత్రమే కాదు... మిగతా బ్యాంకులూ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డుల నుంచి ఈఎంవీ కార్డులకు మారుతున్నాయి.మరి కార్డు చిప్ కార్డు అవునో కాదో గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.

 

టెలికాంకు ఆర్‌కామ్ గుడ్ బై , కొత్త వ్యాపారంలోకి సునామి ఎంట్రీ !

2018 చివరి నాటికి..

2018 చివరి నాటికి..

ప్రియమైన ఖాతాదారులారా... మారడానికి సమయమిది. ఆర్బీఐ సూచనల ప్రకారం 2018 చివరి నాటికి మీరు మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులను ఈఎంవీ చిప్ డెబిట్ కార్డులకు మార్చుకోండి. ఈ మార్పు చాలా సురక్షితమైంది. ఎలాంటి ఛార్జీలు ఉండవని ఎస్‌బిఐ ట్వీట్ చేసింది.

మ్యాగ్నెటిక్ స్ట్రైప్‌దా లేక ఈఎంవీదా..

మ్యాగ్నెటిక్ స్ట్రైప్‌దా లేక ఈఎంవీదా..

మరి మీ దగ్గరున్న కార్డు మ్యాగ్నెటిక్ స్ట్రైప్‌దా లేక ఈఎంవీదా అని ఎలా తెలుస్తుంది? ఇది తెలుసుకోవడం చాలా సులువు.

 గోల్డెన్ చిప్ ఉంటే..

గోల్డెన్ చిప్ ఉంటే..

కార్డు ముందు వైపు గోల్డెన్ చిప్ ఉంటే అది ఈఎంవీ కార్డు. మీ దగ్గర అలాంటి కార్డే ఉంటే మార్చుకోవాల్సిన అవసరం లేదు.

కార్డుపై చిప్ లేకపోతే..
 

కార్డుపై చిప్ లేకపోతే..

ఒకవేళ కార్డుపై చిప్ లేకపోతే నేరుగా మీ హోం బ్రాంచ్‌కు వెళ్లి కార్డు రీప్లేస్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో..

ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో..

అలా సాధ్యం కాకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో కూడా కార్డు రీప్లేస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే

మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే

మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఎస్‌బిఐ అఫిషియల్ ఈ వెబ్‌సైట్ చూడవచ్చు.

https://bank.sbi/portal/web/personal-banking/magstripe-debit-cardholders

Most Read Articles
Best Mobiles in India

English summary
SBI starts blocking insecure ATM cards, yours could be one of them more news at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X