ఫ్రీ ఎస్ఎంఎస్ సర్వీస్‌లు (విదేశాలకు)

Posted By: Super

 ఫ్రీ ఎస్ఎంఎస్ సర్వీస్‌లు (విదేశాలకు)

విదేశాల్లో ఉన్న మీ ఆప్తులకు ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా సందేశాలను పంపుకునే అవకాశాన్సి  ఈ క్రింది పేర్కొన్న వెబ్‌సైట్‌లు కల్పిస్తున్నాయి.

సెండ్-ఎస్ఎంఎస్-నౌ డాట్ కామ్ (Send-sms-now.com):

ఈ సైట్ ద్వారా ఏ దేశంలో ఉన్న మిత్రులు లేదా బంధువుల కైనా ఒక్క నిమిషంలో సందేశాన్ని పోస్ట్ చేయవచ్చు. ఈ సైట్ సేవలను ఉపయోగించుకోవాలనుకునే వారు ముందుగా రిజిస్టర్ కావల్సి ఉంటుంది.

సందేశం పంపే విధానం..

- ముందుగా సందేశం వెళ్లాల్సిన దేశాన్ని ఎంచుకోవాలి.

- సందేశం స్వీకరించే వ్యక్తి ఏ నెట్‌వర్క్‌లో ఉన్నారో ఎంచుకోవాలి.

- తరువాతి చర్యగా సదరు వ్యక్తి మొబైల్ నెంబరును పూరించాలి.

-‘ఫ్రమ్’ అనే బాక్స్‌లో మీ పేరును పూరించి, కింద జత చేసిన మెసేజ్ బాక్స్ల్‌లో సందేశాన్ని పేర్కొనవచ్చు.

ఈ ఆన్‌లైన్ ప్రక్రియ సమయాన్ని వృధా చేస్తుందనకుంటే హేవైర్ అనే అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని అంతర్జాతీయ సందేశాలను ఉచితంగా పోస్ట్ చేసుకోండి..

హేవైర్ (Heywire):

ముందు పేర్కొన్న వెబ్‌సైట్ సెండ్-ఎస్ఎంఎస్-నౌ డాట్ కామ్ తరహాలో హేవైర్ అప్లికేషన్ ఇంచుమించు సమాన ఫీచర్లను ఒదిగి ఉంటుంది. ఈ సైట్ చాట్ సర్వీస్‌లను కూడా అందిస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా మీరు సందేశాన్ని పోస్ట్ చేసిన వెంటనే అవతలి వ్యక్తి మొబైల్ ఇన్‌బాక్స్‌లోకి చేరిపోతుంది.

ఐవోస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది:

ఈ అప్లికేషన్ జీఎస్ఎమ్ నెట్‌వర్క్ ఆధారితంగా స్పందిస్తుంది. ఏ విధమైన రోమింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ క్రాస్ ప్లాట్‌ఫామ్ అప్లికేషన్ మెసెంజర్ ఆపిల్ ఐవోఎస్ ఇంకా ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఫేస్‌బుక్ ఇంకా గూగుల్ టాక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లకు అప్లికేషన్‌ను అనుసంధానించుకోవచ్చు. 3జీ, వై-ఫై నెట్‌వర్క్‌లలో సైతం అప్లికేషన్ రన్ అవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot