వై-ఫై కనెక్షన్ తీసుకుంటున్నారా, ఈ విషయాలు గుర్తుంచుకోండి

ప్రతి ఇంట్లో వై-ఫై కనెక్షన్ కామన్ అయిపోయింది. వై-ఫై నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చాక పోన్ బిల్స్ విపరీతంగా ఆదా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్త వై-పై కనెక్షన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ADSL రౌటర్‌, non-ADSL రౌటర్‌

మీరు బీఎస్ఎన్ఎల్ వంటి టెలీఫోన్ ప్రొవైడర్ నుంచి వై-ఫై కనెక్షన్ తీసుకోవాలని భావిస్తున్నట్లయితే ADSL రౌటర్‌ను ఎంపిక చేసుకోండి. లోకల్ కేబుల్ ఆపరేటర్ వద్ద నుంచి వై-ఫై కనెక్షన్ తీసుకోవాలని భావిస్తున్నట్లయితే non-ADSL రౌటర్‌ను తీసుకోండి. కొత్త వై-పై రౌటర్ కొనుగోలు చేసే ముందు ఇటువంటి స్పెసిఫికేషన్‌‌లను కలిగి ఉన్న రౌటర్‌ను సెలక్ట్ చేసుకోండి...

802.11ac వైర్‌లెస్ స్టాండర్డ్‌

మీరు ఎంపిక చేసుకునే వై-ఫై రౌటర్ 802.11ac వైర్‌లెస్ స్టాండర్డ్‌ను సపోర్ట్ చేసేదిగా ఉండాలి. డ్యుయల్ బ్యాండ్ సపోర్ట్ తో వచ్చే ఈ రౌటర్ 2.4GHz అలానే 5GHz బ్యాండ్‌లను డీఫాల్ట్‌గానే సపోర్ట్ చేస్తుంది. 'n'వైర్‌లెస్ స్టాండర్డ్‌తో వచ్చే రౌటర్స్ కేవలం 2.4GHz వైర్‌లెస్ బ్యాండ్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి.

మల్టిపుల్ యూఎస్బీ పోర్ట్స్‌ ఉండేలా చూసుకోండి...

మీరు కొనుగోలు చేసే రౌటర్‌లో ఎక్కువ యూఎస్బీ పోర్ట్స్ ఉండేలా చూసుకోండి. రౌటర్ మల్టిపుల్ యూఎస్బీ పోర్ట్స్‌ను కలిగి ఉండటం వల్ల ప్రింటర్స్ అలానే ఫ్లాష్‌డ్రైవ్‌లను కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. కొన్ని రౌటర్స్ 3జీ డేటా డాంగిల్స్‌ను సపోర్ట్ చేస్తున్నాయి.

రెండు యాంటెన్నాలతో వచ్చే రౌటర్ ఎక్కువ కవరేజ్‌ను ఆఫర్ చేస్తుంది..

సింగిల్ ఎక్సటర్నల్ యాంటెన్నాతో వచ్చే వై-ఫై రౌటర్‌తో పోలిస్తే, రెండు ఎక్సటర్నల్ యాంటెన్నాలతో వచ్చే రౌటర్ ఎక్కువ కవరేజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇంట్లో ఈ విధమైన రౌటర్‌ను సెట్ చేసుకున్నట్లయితే సిగ్నల్ రేంజ్ బాగుంటుంది.

D-Link, TP-Link

D-Link కంపెనీ ఆఫర్ చేస్తోన్న చాలా వరకు రౌటర్లు మూడు యాంటెన్నాలతో వస్తున్నాయి. వీటిలో Firewall ప్రొటెక్షన్ సౌకర్యం కూడా ఉంటోంది. ఈ ఫీచర్ మీ హోమ్ నెట్‌వర్క్‌ను హ్యాకింగ్ దాడుల నుంచి కాపడుతుంది. మార్కెట్లో దొరుకుతోన్న TP-Link అలానే Netgear రౌటర్లు పేరెంటల్ కంట్రోల్ సెట్టింగ్స్‌తో వస్తున్నాయి.

ఈ మోడల్స్ బెస్ట్ ఆప్షన్స్...

మీరు Non-ADSL రౌటర్ కోసం చూస్తున్నట్లయితే మీకు ఈ మోడల్స్ బెస్ట్ ఆప్షన్స్...
D-Link DIR-816 AC750 (Rs 1,800),
Netgear R6220 AC-1200 (Rs 3,300),
TP-Link Archer C2 (Rs 3,600),
Asus RT-AC55UHP (Rs 7,500)

డబ్బులు ఎక్కువైనా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలి

రౌటర్‌ను ఎంపిక చేసుకునే ముందు ఈ రౌటర్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లను పూర్తిగా చదవండి. కొంచం డబ్బులు ఎక్కువైనా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Setting up a Wi-Fi router in your house: 5 Important things not to miss. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot