షాపింగ్ చేస్తున్నారా, ఈ విషయాలు ఎట్టిపరిస్థితుల్లోనూ మరచిపోవద్దు

Written By:

ఈ రోజుల్లో చాలామందికి షాపింగ్ అనేది వ్యసనంలా మారింది. ఎప్పుడు బడితే అప్పుడు షాపింగ్ వెంట వెళుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం. ఉదాహరణకు పెద్దపెద్ద షాపింగ్‌ మాళ్లకు.. లేదా షోరూంలకు వెళ్లినప్పుడు మనం అనుకున్న వస్తువు కాకుండా మరొకటి కొంటుంటాం. లేదా రెండే కొనేసి ఇంటికి వచ్చిన తర్వాత బిల్లు చూసి దిగాలు పడుతుంటాం. ఇందుకు ప్రధాన కారణం కొనే వస్తువుపై పూర్తి అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, మార్కెట్‌లోకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఉత్పత్తులను చూసి తికమకపడడం మరో కారణం. మరి ఇలాంటి వాటినుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి అనేదానిపై కొన్ని రకాల టిప్స్ ఇస్తున్నాం. ఇవి Online, offline షాపింగ్ కు వాడుకునే అవకాశం ఉంది.ఓ సారి ఫాలో అవ్వండి.

చైనా కంపెనీలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన తైవాన్ కంపెనీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లిస్ట్‌ తప్పని సరి

షాపింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా ఏం కొనాలన్న దానిపై స్పష్టతతో ఉండాలి. అవసరమైతే వస్తువుల లిస్ట్‌ తయారు చేసుకోవడం ఉత్తమం.

కొత్త ఉత్పత్తులు

కొత్త ఉత్పత్తుల రోజు మార్కెట్లో అనేక రకాలుగా హల్ చల్ చేస్తుంటాయి. వీటిని యాడ్ లు చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అయితే వీటిని అస్సలు నమ్మొద్దు. కొత్త వస్తువులు వాడితే కొన్నిసార్లు అవి నాణ్యత లేకపోవడం, కొన్ని శరీరానికి పడకపో వడం వంటి సమస్యలు రావచ్చు. వాడే ఉత్పత్తుల్లో కొత్తదనం కోరుకుంటే దానికి సంబం ధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.

ఆఫర్లు

కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టినప్పుడు కొన్ని కంపెనీలు ప్రచారాలు, ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉత్పత్తి గురించి పూర్తిగా తెలియక ఏదో ఆఫర్‌ ఉందనో, తక్కువ ధరకే లభిస్తుందనో కొనుగో లు చేస్తే వాడుతున్నప్పుడు అయిష్టత ఏర్పడే ప్రమాదముంది. కాబట్టి అనవరసమైన వాటి జోలికెళ్లకండి.

సేల్స్ మెన్ చెప్పేవి వినాలి

న్ని మంచి కంపెనీలు కొత్త టెక్నాలజీతోనూ, ఫీచర్లతో మార్కెట్‌లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి మనం కొనే ఉత్పత్తులకు సంబంధించి కొంత నాలెడ్జ్‌తో వెళ్తే మచింది.వాటి గురించి కూడా సేల్స్‌ సిబ్బంది చెప్పేవి వినాలి. తర్వాత మన స్థోమతను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఉత్పత్తి మీద అవగాహన

కేవలం సేల్స్‌ సిబ్బంది చెప్పే ఆకర్షణీ యమైన మాటలను నమ్మి కొనేయడం మంచి దికాదు. ఒకవేళ కొన్నతర్వాత సదరు ఉత్పత్తి ఏదైనా సరిగ్గా పని చేయకపోయినా ఇతర ఇబ్బందులు ఉన్నా.. మనం మళ్లీ వారి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది.

గ్యారంటీ, వారంటీ

మనం కొనే వస్తువులకు సంబంధించి ఆఫ్టర్‌ సేల్స్‌ సర్వీసు ఉందా? లేదా? గమనించాలి. కొనే వస్తువులకు గ్యారంటీ అంటున్నా రా? వారంటీ అంటున్నారా? అన్నది పూర్తిగా తెలుసుకోవాలి. గ్యారంటీ అంటే సదరు వస్తువులు నిర్ణీత వ్యవధిలోపు పాడైనా, సాంకేతిక లోపం ఉన్నా.. వెంటనే మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ, వారంటీ అంటే సదరు ఉత్పత్తి పాడైతే, పనిచేయకపోతే వాటిని రిపేర్‌ చేసి ఇస్తామని అంటారు. ఈ తేడాను గుర్తుంచుకోవాలి.

వన్‌ గెట్‌ వన్‌

ఒకటి కొంటే ఒకటి ఉచితం అనో, లేదా డిస్కౌంట్‌లు ఇస్తామనో చెప్తారు. ఇలాంటి ఆఫర్లపై కొంత అప్రమత్తంగా ఉండాలి. వస్తువుల్లో ఏదో లోపం ఉంటేనే బయ్‌ వన్‌ గెట్‌ వన్‌ అంటూ ఇస్తా రు. డిస్కౌంట్స్‌ ఇస్తున్నారంటే సదరు వస్తువు కాలపరిమితి దాటిపోవడమో లేక నాణ్యత సరిగ్గా లేదనో గుర్తించాలి.

తయారీ ఎప్పుడు ?

కొనుగోలుచేసే ఉత్పత్తుల ధరలను, ఎప్పుడు తయారు చేశారు? తయారీ దారుల చిరునామా వంటివి జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే కొన్న తర్వాత ఏదైనా సమస్య వస్తే వినియోగదారుల కోర్టువెళ్లడానికి అవకాశం ఉంటుంది.

బిల్లులు

ఇక షాపింగ్‌ చేసిన తర్వాత కచ్చితంగా బిల్లులు తీసుకోవాలి. అందులో ఏ విధమైన పన్నులు వేశారన్నది జాగ్రత్తగా గమనించాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Shopping online? Follow these tips to avoid frauds, safe shopping More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot