Home
How to

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

గంటల తరబడి షాపింగ్‌మాల్స్‌లో గడిపేయడం బొత్తిగా నచ్చనివారికి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చక్కగా ఉపయోగపడుతోంది. కావాల్సిన వస్తువులను, వాటి ధరను ఇంట్లోనే కూర్చుని సెలక్ట్‌ చేసుకోవడం ద్వారా షాపింగ్‌మా ల్స్‌లో కాలయాపన తప్పుతోందని ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో కంప్యూటర్‌ కామన్‌ వస్తువుగా మారడంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు సహజంగానే డిమాండ్‌ పెరుగుతోందనే భావన నిర్వాహకుల నుంచి సైతం వినిపిస్తోంది. సురక్షితమైన అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్ కోసం 10 బెస్ట్ చిట్కాలను మీకు సూచిస్తున్నాం...

Read More : సామ్‌సంగ్ ఫోన్‌ల పై డిస్కౌంట్‌ల మోత

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

మీ ఆన్‌లైన్ షాపింగ్‌కు మార్కెట్లో పాపులర్ అయిన ఈ-కామర్స్ సైట్‌లలో మాత్రమే ఎంపిక చేసుకోండి. గుర్తింపులేని ఫేక్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల జోలికి వెళ్లకండి. ఆన్‌లైన్ షాపింగ్ నిమిత్తం ఓ వెబ్‌సైట్‌ను ఎంపిక చేసుకునేముందు ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన రివ్యూ రేటింగ్‌లను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే ఆన్‌లైన్ షాపింగ్‌కు ఉపక్రమించండి.

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

SSL (Secure Sockets Layer) సెక్యూరిటీ ఉన్న ఈ-కామర్స్ వెబ్ సైట్ లలో మాత్రమే ఆన్‌లైన్ షాపింగ్ సురక్షితం. SSL సెక్యూరీటీ వ్యవస్థను కలిగి ఉన్న వెబ్‌సైట్ యూఆర్ఎల్ HTTPS://తో మొదలవుతుంది.

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

మీ ఆన్‌లైన్ కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలను ప్రింట్ రూపంలో మీ వద్ద భద్రంగా ఉంచుకోండి. మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తులకు సంబంధించి భవిష్యత్‌లో ఏదైనా సమస్య ఎదురైతే వీటి ఉపయోగం చాలా ఉంటుంది.

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

విశ్వసనీయత లేని ఈకామర్స్ సైట్‌లలో షాపింగ్ చేయటం ద్వారా మీ బ్యాంకింగ్‌కు సంబంధించిన పాస్‌వర్డ్స్ బహిర్గతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి, అకౌంట్‌లకు శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను సమకూర్చుకోండి.

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్‌కు క్రెడిట్ కార్డులను ఉపయోగించటం చాలా సురక్షితమైన పద్ధతి. ఆన్‌లైన్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ సహాయంతో క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించటం ద్వారా మీ షాపింగ్ మరింత సురక్షితంగా ఉంటుంది. పిష్షింగ్ ఫిల్టర్‌ను డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

మీరు కోనుగోలు చేసే వస్తువు డెలివరీకి సంబంధించి పూర్తి వివరాలను క్షున్నంగా తెలుసుకోండి. వస్తువు డెలివరీకి సంబంధించి ఖచ్చితమైన చిరునామాను ఇవ్వండి.

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

షాపింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఆకౌంట్‌లను లాగ్‌అవుట్ చేయటం మరవద్దు.

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

మీరు కొనుగోలు చేసే ఉత్పత్తికి సంబంధించి బిల్లింగ్, గ్యారంటీ, డెలివరీ వంటి అంశాలకు సంబంధించి నిబంధనలు ఇంకా షరతులను చదవండి.

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో అనవసరంగా మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయవద్దు. సెక్యూరిటీ కోడ్ విషయంలో జాగ్రత్త వహించండి

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్, 10 సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డుల ద్వారా చెల్లించిన మొత్తానికి సంబంధించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.

Best Mobiles in India

English summary
Simple Tips For Safe Online Shopping This Festival Season. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X